Just In
- 51 min ago
గొల్లపూడి భౌతిక కాయానికి నివాలి : అది నా దురదృష్టం.. చిరు కన్నీటి వీడ్కోలు
- 1 hr ago
జై బాలయ్య అనే వరకు వదల్లేదు.. బోయపాటిని విసిగించిన నందమూరి ఫ్యాన్స్
- 2 hrs ago
నిర్మాతగా మెగా డాటర్ ఎంట్రీ.. వాటితో మొదలు పెడుతుందంట!
- 3 hrs ago
పెళ్లికి సిద్ధమైన మరో టాలీవుడ్ యంగ్ హీరో.. వచ్చే ఏడాది ప్రేమించిన అమ్మాయితో వివాహం.!
Don't Miss!
- News
గిఫ్టుగా మారిన ఉల్లి...! బట్టలు కొంటే.. ఉల్లిగడ్డ ఉచితం...!
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Sports
అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ.. రోహిత్ పోటీ!!
- Finance
ఆర్థిక మందగమనం: బడ్జెట్‌పై నిర్మలా సీతారామన కసరత్తు
- Technology
గూగుల్ ఇంటర్ప్రెటర్ ఇప్పుడు మొబైల్‌లోకి వచ్చేసింది
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
బిగ్‌బాస్ గ్యాంగ్ రీయూనియన్ పార్టీ.. అందుకే రాహుల్ గైర్హాజరు.. త్వరలో లైవ్ కాన్సర్ట్..
బిగ్‌బాస్ షో ముగిశాక.. కంటెస్టెంట్లు తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. బిగ్‌బాస్ ఇంట్లో ఉండడం వల్ల మిస్ అయిన ఫన్ అంతా బయటకు వచ్చాక తీర్చుకుంటున్నారు. అందరిలోకెల్లా హిమజ, వరుణ్ సందేశ్, వితిక, పునర్నవిలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. రెండు మూడు రోజుల క్రితం వీరంతా రీయూనియన్ పేరిట ఓ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అలీ, మహేష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరంతా కలిసి ఫుల్ సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

హౌస్‌లో హల్‌చల్..
బిగ్‌బాస్ హౌస్‌లో ఓ గ్యాంగ్ ఏర్పడిన రాహుల్, పునర్నవి, వరుణ్, వితిక బయటకు వచ్చాక కూడా తమ బంధాన్ని అలానే కొనసాగిస్తున్నారు. హౌస్‌లో ఈ నలుగురు చేసిన అల్లరి, సందడి అంతా ఇంతా కాదు. చివర్లో అలీ, రాహుల్ మధ్య స్నేహం ఏర్పడటంతో వీరి గ్యాంగ్‌లోని అలీ కూడా చేరిపోయాడు. ఓ స్కిట్‌లో భాగంగా జంటగా నటించడంతో హిమజ, మహేష్‌ల మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఇక బయటకు వచ్చాక ఫుల్ పార్టీలు చేసుకుంటున్నారు.

రీయూనియన్ పార్టీ..
వరుణ్, వితికా, పునర్నవి, హిమజ, మహేష్, అలీ రెజాలు కలిసి ఓ రిసార్ట్‌లో పార్టీ చేసుకున్నారు. మహేష్ స్విమ్మింగ్ చేస్తుండగా వీడియో తీసి షేర్ చేస్తూ నా లింగం అంటూ పోస్ట్ చేసింది. అందరూ కలిసి ఫోటోలకు పోజులివ్వడం, బోల్డ్ కంటెంట్‌తో కూడిన ఫ్లకార్డులను పట్టుకుని దిగిన ఫోటోలు హల్‌చల్ చేశాయి. అయితే ఆ పార్టీలో రాహుల్ మిస్ అవ్వడం ఒక్కటే లోటుగా కనిపించింది. ఆ ముగ్గురు తెగ ఎంజాయ్ చేయగా.. అందులో రాహుల్ లేకపోవడంతో అతని అభిమానులు కాసింత నిరాశచెందారు.

ఒంట్లో బాగాలేకపోవడంతో..
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న వాతావరణం, బయటకు వచ్చాక మార్పులకు గురవ్వడంతో రాహుల్‌కు ఒంట్లో కాసింత నలతగానే ఉంటోంది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు బాగా లేదని, జ్వరం వచ్చినట్టుగా ఉందని చెప్పిన సందర్భాలున్నాయి. తాజాగా కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటోన్న రాహుల్ కాసేపటి క్రితమే ఓ వీడియోను షేర్ చేశాడు. ఒంట్లో బాగా లేకదని, గొంతు కూడా బాగా లేదని.. అయినా రికార్డింగ్‌కు వచ్చానని తన పరిస్థితి గురించి వివరించాడు. తనకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే పార్టీకి రాలేకపోయాడని తెలుస్తోంది.

త్వరలో లైవ్ కాన్సర్ట్..
బిగ్‌బాస్ టైటిల్ గెలిచాక ఫ్యాన్ మీట్‌లో అందర్నీ కలుస్తానని చెప్పిన రాహుల్.. అందుకు తగ్గట్టే గట్టి ఏర్పాట్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించిన పనుల్లోనే నిమగ్నమైనట్లు తెలిపాడు. త్వరలోనే ఓ తేదీని ఫిక్స్ చేసి చెబుతానని, లైవ్ కాన్సర్ట్‌లో అందర్నీ ఎంటర్టైన్ చేస్తానని తెలిపాడు.