యాంకర్ సుమకు పోటీగా రాజీవ్ కనకాల.. రెచ్చిపోదాం బ్రదర్ అంటూ ఎంట్రీ!
ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజీవ్ కనకాల యాక్టర్‌గా తన ప్రతిభను చాటుకొంటున్నారు. విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటూ బుల్లితెరపై నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. నటుడిగా తనదైన శైలిలో రాణిస్తున్న రాజీవ్ త్వరలోనే బుల్లితెరపైన కొత్త అవతారం ఎత్తనున్నారు. అడపదడపా తన భార్య, యాంకర్ సుమ నిర్వహించే షోలు, ఇతర షోలో కనిపించిన ఆయన ఇప్పుడు ఓ షోలో హోస్ట్ అవతారం ఎత్తేందుకు సిద్దమయ్యారు. ఈ ప్రొగ్రాంకు సంబంధించిన ప్రోమోను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలోకి వెళితే..
రెచ్చిపోదాం బ్రదర్ అనే షోలో హోస్ట్‌గా రాజీవ్ కనకాల కనిపించనున్నారు. హోస్ట్ ఎంట్రీ ఇస్తూ.. కొన్నిసార్లు రావడం లేటు అవ్వొచ్చేమో కానీ.. రావడం పక్కా అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రంలోని రావణ పాటతో ఎంట్రీ ఇచ్చారు. భీకరమైన రూపంతో వేదికపైకి వచ్చిన రాజీవ్.. ఏది ఏమైనా.. షో ఏదైనా నేను రెడీ అంటూ సవాల్ విసిరారు.

ఇక రెచ్చిపోదాం బ్రదర్ షో ఈటీవీలో జూన్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ఈ షో ప్రేక్షకులకు చేరువకానున్నది. ఈ షోను ప్రముఖ నిర్మాణ సంస్థ మల్లెమాల దీనిని నిర్మించింది. దీంతో రాజీవ్ కనకాల హోస్ట్‌గా ఎలాంటి ప్రభావం చూపుతారనే ఆసక్తిని పెంచింది.
ఇప్పటికే యాంకర్ సుమ పలు టెలివిజన్ షోలలో యాంకర్‌గా, హోస్ట్‌గా రాణిస్తున్నారు. ఇక సుమ దారిలోనే రాజీవ్ బుల్లితెర ప్రవేశం చేశారు. రాజీవ్ ఏ మేరకు తన సత్తా చాటుతారో వేచి చూడాల్సిందే.
యాక్టింగ్ విషయానికి వస్తే.. రాజీవ్ కనకాల ప్రస్తుతం RRR చిత్రంలో ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. త్వరలోనే ఆ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


Click it and Unblock the Notifications











