Bigg Bossలోకి శృంగార తార.. భర్తతో కలిసి రొమాన్స్ చేసేందుకు రెడీ..

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ రియాలిటీ షోలో శృంగారతార రాఖీ సావంత్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. గతేడాది ముగిసిన బిగ్‌బాస్14 సీజన్‌లో రాఖీ సావంత్ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. తోటి కంటెస్టెంట్లతో అనేక గొడవలకు కారణమయ్యారు. అయితే త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్ 15 సీజన్‌లో మరోసారి భాగం కావాలని కోరుకొంటున్నది. అయితే ఈ సారి ఒంటరిగా కాకుండా భర్తతో ఈ షోలో హంగామా చేయాలని అనుకొంటున్నారు. తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ...

బిగ్‌బాస్ 15లో ఎంట్రీ ఇవ్వాలని అనుకొంటున్నాను. కానీ ఈసారి నా భర్త రితేష్‌తో బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండాలని అనుకొంటున్నాను. ఆ ఇంటిలో వైవాహిక జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలని కోరుకొంటున్నాను. నా భర్తకు పెళ్లి అయిందనే ఫీలింగ్ రావాలంటే మేమిద్దరం అక్కడ ఉండాల్సిందే. సల్మాన్ ఖాన్, బిగ్‌బాస్ పర్యవేక్షణలో ఆ ఇంటిలో నా భర్త నేర్చుకొనే చాలా ఉన్నాయి. పెళ్లి తర్వాత నా లాంటి భార్యను విడిచి ఉండకూడదనే విషయం తెలిసి రావాలి అని రాఖీ సావంత అన్నారు.

Rakhi Sawant wants to entry into Bigg Boss house with husband Ritesh

పెళ్లి తర్వాత నాతో నా భర్త ఎక్కువగా గడపలేదు. నేను కూడా ఆయనతో ఉండలేదు. బిగ్‌బాస్‌లో ఉంటే మా ఇద్దరి అన్యోన్యత దేశం మొత్తం తెలుస్తుంది. మా రిలేషన్‌షిప్ 100 శాతం పరిపూర్ణంగా మారాలని కోరుకొంటున్నాను. నా భర్త గురించి నాకు ఏమీ తెలియదు. ఈ షోలో కలిసి ఉంటే మా ఇద్దరి గురించి ఒకరికొకరం తెలుసుకొంటాం అని రాఖీ సావంత్ అన్నారు.

రాఖీ సావంత్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ తర్వాత ఆమె సారేగమ డాన్స్ షోలో డ్రీమ్ మే ఎంట్రీతో అడుగుపెట్టింది. అలాగే ఇండియన్ ఐడల్ 12లో కూడా పాలుపంచుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X