»   »  'మా వూరి వంట' లో రామ్ గోపాల్ వర్మ (వీడియో)

'మా వూరి వంట' లో రామ్ గోపాల్ వర్మ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తను కేవలం డైరక్టర్ గానే కాకుండా వంటవాడు గానూ కనిపించనున్నారు. ఆయన గరిట తిప్పుతూ...మాటీవి వారి మావూరి వంట పోగ్రామ్ లో కనిపించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ పోగ్రాం ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కు మంచి రేటింగ్ రానుందని అంతా భావిస్తున్నారు. ఈ ఎపిసోడ్ కు చెందిన ప్రోమో ఈలోగా చూసేయండి మరి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వర్మ తాజా చిత్రం "365 డేస్" విషయానికి వస్తే....

నేటి తరం ప్రేమలు ఎలా ఉన్నాయి, ప్రేమకు ముందు ఒక జంట ఎలా ఉంటోంది - పెళ్లి తర్వాత అదే ప్రేమ జంట ఎలా ఉంటోంది అనే పాయింట్ ని బేస్ చేసుకొని చేసిన సినిమానే ‘365 డేస్'. ఇటీవలే ఈ సినిమా ఆడియోని కూడా విడుదల చేసారు.

Ram Gopal Varma (RGV) in Maa Voori Vanta

నిఖితశ్రీ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేష్ ఈ సంవత్సరంలో మూడు సినిమాలు నిర్మించబోతున్నారు. దీనిలో భాగంగా ఆయన మొదట నిర్మించిన చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో "365 డేస్". ఈ సినిమా రిలీజ్ కాగానే వెంటనే రామ్ గోపాల్ వర్మతో మరో సినిమా కూడా మే నుంచే ప్రారంభి౦చబోతున్నారు. ఈ రెండు కాకుండా మరో ఫీల్ గుడ్ లవ్ స్టొరీ స్క్రిప్ట్‌పై కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి. వెంకటేష్ మాట్లాడుతూ "రామ్ గోపాల్ వర్మ గారి మొత్తం కెరియర్ లో ఎక్కువగా వయలెంట్ సినిమాలు, హర్రర్ సినిమాలు, యాక్షన్ ధ్రిల్లర్లు తీశారు. అడపాదడపా రంగిలా, మస్త్, ప్రేమకథ లవ్ స్టోరీలు తీసినా వాటిల్లో ఒక వయలెంట్ బ్యాగ్రౌండో లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి ఒక ఫాంటసీ బ్యాగ్రౌండో వుండేది. కానీ "365 డేస్" లో నాకు విపరీతంగా నచ్చిన అంశం ఏంటంటే" వర్మ గారు తన 25 ఏళ్ల కెరియర్లో 100% పూర్తి లవ్ & రొమాంటిక్ చిత్రం ఇదే మొట్టమొదటిసారి తీయటం అని చెప్పారు.

వర్మ సినీ జీవితంలో ఫస్ట్ టైమ్ ప్యూర్ లవ్&మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన "365 డేస్" పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం చూసినవాళ్లు "365 డేస్" చిత్రకథ ప్రతి ప్రేమజంటకి & ప్రతి పెళ్ళైన జంటకి కూడా కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు.

"365 డేస్" ఒక్క రామ్ గోపాల్ వర్మ పెళ్లి కధే కాదు. ప్రతి ఒక్కరి ప్రేమ కథ. ప్రతి ఒక్కరి పెళ్లి కథ. ఈ అందమైన పెళ్లి కథకు ప్రేక్షకులందరూ కదలి రావాలని రామ్ గోపాల్ వర్మ పిలుపునివ్వబోతున్నారు. ఈ చిత్రం తాలూకు ఒక ట్రైలర్‌ని, ఒక పాటని ఈ నెల 21 న రిలీజ్ చేయబోతున్నాం..' అన్నారు.

English summary
Ram Gopal Varma appears on 'Maa Voori Vanta' program aired on MAA TV. Ram Gopal Varma described cooking as a conspiracy plotted by Men on Women. He feels a real woman should never cook but have to make her man cook for her. RGV's special episode of 'Maa Voori Vanta' will be telecasted on the coming Friday at 12 PM.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu