ఒక్క రోజు మీ రేటు ఎంత? వేధించి అలా హింసించారు.. అలేఖ్య పికల్స్ రమ్య సిస్టర్
Alekhya Chitti Pickles Ramya: రమ్య మోక్ష కంచర్ల అంటే చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపడుతారు. సోషల్ మీడియాలో వివాదం జరిగిన తరువాత ఆమె కుటుంబం ఎదుర్కొన్న బాధలు, విమర్శలు, మానసిక ఒత్తిడి, కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు చాలా మందికి తెలియవు. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి అడుగుపెట్టిన రమ్య గురించి ఆమె అక్క సుమీ ( Sumi)ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
సాధారణ కుటుంబం నుండి సోషల్ మీడియా స్టార్‌గా
"మేము సామాన్య కుటుంబం నుంచి వచ్చాం. మా అమ్మాయిలు బిజినెస్ ప్రారంభించి, అతి తక్కువ కాలంలో మా బిజినెస్ లో విజయం సాధించాం, 'అలేఖ్య చిట్టి పికిల్స్' బ్రాండ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, మా ప్రమోషన్ వీడియోలు కూడా పెద్ద ఎత్తున షేర్ అయ్యాయి. కానీ మన సమాజంలో సక్సెస్ కంటే విమర్శలే ఎక్కువ వస్తాయి. ఆ సమయంలో మా నెంబర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సమయంలో కొంతమంది మాకు ఫోన్ చేసి.. సపోర్ట్ చేసేవారు. కొంతమంది మాత్రం సరదాగా మాట్లాడతామని, మరికొందరు మాత్రం అసభ్యంగా, వల్గర్‌గా మెసేజ్లు పంపేవారు. కానీ వాటి అసలు పట్టించుకునే వాళ్లం కాదు" అని సుమీ చెప్పింది.

డాడీ ఉన్నంత వరకు మేము బలంగా ఉన్నాం
"మా డాడీ మా ఇంటి అండ... ఆయన ఉన్నంతవరకు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా పట్టించుకోవద్దని మాకు ధైర్యం ఇచ్చేవారు. కానీ ఆయన సడన్‌గా చనిపోవడంతో మేము మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యాం. ఆయన మరణం తర్వాత ఒక వారం పది రోజులపాటు మేము సోషల్ మీడియా నుంచి దూరంగా ఉన్నాం. ఆ సమయంలో కూడా కొంతమంది మాపై నెగిటివ్ ప్రచారం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మాపై కావాలనే తప్పుడు రూమర్స్ స్ప్రెడ్ చేశారు" అని ఆమె వివరించింది.
వల్గర్ మెసేజ్‌లతో రమ్య ఫ్రస్ట్రేట్
"కొంతమంది మా బిజినెస్‌పై కాకుండా మా వ్యక్తిగత జీవితంపై వల్గర్ మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించారు. కొంతమంది అయితే.. 'ఇంతా రేటా.. అంతా రేటా..’అనేవారు. ఇన్ డైెరెక్ట్ గా ఒక్క రోజు మీ రేటు ఎంత? వేధించి అలా హింసించారు. దీంతో రమ్య చాలా ఫ్రస్ట్రేట్ అయ్యింది. ఒకరికి పంపాల్సిన మెసేజ్ పొరపాటున మరొకరికి వెళ్లడం వల్లే ఆ వివాదం మొదలైంది. కానీ ఆ విషయాన్ని పెద్దది చేసి మాపై నెగిటివ్ ప్రచారం చేశారు. నిజానికి మేము ఎన్నిసార్లు క్లారిఫై చేసినా, ప్రజలు మమ్మల్నీ తప్పుగా అర్థం చేసుకున్నారు. నా చెల్లి ఆ సమయంలో సైలెంట్‌గా ఉండి ఉంటే ఇవాళ పరిస్థితి వేరుగా ఉండేది" అని ఆమె బాధతో చెప్పింది.
అందుకే బిగ్ బాస్ ఎంట్రీ
రమ్య బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం వెనుక ఉన్న కారణం గురించి సుమీ ఇలా చెప్పింది. 'మాపై వచ్చిన నిందలను తొలగించుకోవడం, మేము నిజంగా ఎవరమో ప్రపంచానికి చూపించడం కోసం రమ్య బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆమె తన వ్యక్తిత్వాన్ని, ధైర్యాన్ని, మానసిక బలాన్ని నిరూపించుకుంటుంది."అని సుమి ఆశా భావం వ్యక్తం చేసింది.
రమ్య బలాల గురించి సుమీ మాట్లాడుతూ.. 'రమ్య ధైర్యానికి ప్రతీక. ఏ సిట్యుయేషన్ అయినా 'డూ ఆర్ డై' ఆలోచనతో ముందుకు వెళ్తుంది. ఎప్పుడూ కూర్చొని ఏడవదు, ఎదుర్కొంటుంది. రమ్య ఫిజికల్‌గా కూడా, మెంటల్‌గా కూడా చాలా స్ట్రాంగ్. మా డాడీ మరణం, ట్రోల్స్, సోషల్ మీడియా నెగటివిటీ ఇవన్నీ ఎదుర్కొంటూ నిలబడ్డది. ఆ స్ట్రెంగ్త్‌తోనే బిగ్ బాస్ హౌస్‌లో కూడా బలంగా నిలుస్తుందని నాకు నమ్మకం ఉంది' అని ఆమె చెప్పింది.
అలాగే.. రమ్య బలహీనతలకు గురించి చెప్పుతూ.. "రమ్యకు ఒక చిన్న వీక్నెస్ ఉంది. ఎవరైనా ఆమె ముందు ఒకలా మాట్లాడి వెనుక మరొకలా ప్రవర్తిస్తే తట్టుకోదు. ఆమె చాలా ఎమోషనల్. మనసులోని బాధ బయట పెట్టదు కానీ, లోపల మాత్రం దానికి చాలా కంగారు పడుతుంది. అందుకే కొన్నిసార్లు ప్రజలు ఆమెను తప్పుగా అర్థం చేసుకుంటారు" అని సుమీ స్పష్టం చేసింది. అలాగే.. "రమ్య ఓపెన్ బుక్ కాదు. ఆమెను పూర్తిగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. బిగ్ బాస్‌లో ప్రతి రోజూ ప్రేక్షకులు ఆమె కొత్త కోణాన్ని చూస్తారు. ఆమె రియల్ పర్సనాలిటీ అక్కడ బయటపడుతుంది"అని సుమీ చెప్పింది.
చివర సుమీ మాట్లాడుతూ.. 'మా కుటుంబం ఎదుర్కొన్నది కేవలం ట్రోలింగ్ కాదు, జీవిత పాఠం. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, మహిళలుగా బిజినెస్ ప్రారంభించి, సోషల్ మీడియాలో నిలదొక్కుకోవడం చాలా పెద్ద విషయం'అని గర్వంగా చెప్పింది. ఇలాంటి కాంట్రవర్సీలు, బాధలు, విషాదాల మధ్య బిగ్ బాస్ లో అడుగుపెట్టిన రమ్య బిగ్ బాస్ వేదికపై ఎలా సర్వేవ్ అవుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











