»   » బిగ్‌బాస్‌లో రానా దగ్గుబాటి.. ఇంటి సభ్యులకు షాకిచ్చిన జోగేంద్ర..

బిగ్‌బాస్‌లో రానా దగ్గుబాటి.. ఇంటి సభ్యులకు షాకిచ్చిన జోగేంద్ర..

Written By:
Subscribe to Filmibeat Telugu

బిగ్‌బాస్ రియాలిటీ షోలో కార్యక్రమంలో భాగంగా బయట ప్రపంచం తెలియకుండా బతుకుతున్న సెలబ్రిటీలకు ఓ కొత్త ఆనందం దొరికింది. కలహాలు, కలతలతో గత 22 రోజులుగా సినీ ప్రముఖులు గడుపుతున్నారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ ఇంటి ఆవరణలో అడుగుపెట్టిన రానాను చూసి ఇంటి సభ్యులు తొలుత షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆనందంతో కౌగిలించుకొని స్వాగతం పలికారు. ఇంతకు రానా బిగ్‌బాస్‌లో గడపడానికి వచ్చాడనుకొంటే పొరపాటే.. జోగేంద్ర రూపంలో బిగ్‌బాస్ ఇంటిలోకి రానా ఎందుకు వచ్చాడంటే..

హిందీ బిగ్‌బాస్‌లో మాదిరిగానే..

హిందీ బిగ్‌బాస్‌లో మాదిరిగానే..

హిందీ బిగ్‌బాస్ కార్యక్రమం వేదికను గతంలో షారుక్, ఇతర సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్లకు ఉపయోగించుకొన్నారు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే రియాలిటీ షోకు షారుక్ ఖాన్ వచ్చి సెలబ్రిటీలను ఆశ్చర్య పరిచారు.

బిగ్‌బాస్‌లో షారుక్, సల్మాన్..

బిగ్‌బాస్‌లో షారుక్, సల్మాన్..

సల్మాన్‌తో ఉన్న విభేదాలను పక్కన పెట్టి బిగ్‌బాస్ 10 కార్యక్రమంలో షారుక్ అడుగుపెట్టడం ఇరు హీరోల అభిమానులను ఆశ్చర్య పరిచారు. ఎన్నో ఏళ్లుగా కలువని షారుక్, సల్మాన్‌ను బిగ్‌బాస్ హౌస్ ఒక్కటి చేసింది.

షారుక్ ప్రమోషన్

షారుక్ ప్రమోషన్

షారుక్ తాను నటించిన రాయిస్ చిత్ర ప్రమోషన్ కోసం బిగ్‌బాస్‌ హౌస్‌లో పర్యటించారు. ఆ చిత్ర ప్రమోషన్ బిగ్‌బాస్ వేదికపై ప్రచారం చేస్తూ సల్మాన్, షారుక్ ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి సన్నిలీయోన్‌ కూడా షారుక్ వెంట వచ్చారు.

షారుక్ ఎంట్రీతో రేటింగ్..

షారుక్ ఎంట్రీతో రేటింగ్..

బిగ్‌బాస్ హౌస్‌కు అప్పట్లో షారుక్, సన్నిలియోన్ రావడంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించే కలర్స్ టెలివిజన్ రేటింగ్ ఆకాశానికి దూసుకెళ్లింది. ఆ కార్యక్రమంలో రయిస్ చిత్రంలోని లైలా ఓ లైలా పాటకు సన్నీ లియోన్ చేసిన డ్యాన్స్ బుల్లితెర వీక్షకులను ఆకట్టుకొన్నది. ఆ కార్యక్రమంలో షారుక్, సల్మాన్ డ్యాన్స్ చేయడం విశేషం.

నేనే రాజు కోసం రానా

నేనే రాజు కోసం రానా

బాలీవుడ్‌లో మాదిరిగానే తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఈ నెల 11న విడుదల కానున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్‌ను రానా చేపట్టాడు. శనివారం రాత్రి బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లాడు. బిగ్ బాస్ వేదికపై ఎన్టీఆర్, రానా హంగామా చేశారు. వారిద్దరి కలయిక తప్పకుండా బుల్లితెర వీక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది

రానాకు ఘన స్వాగతం

రానాకు ఘన స్వాగతం

బిగ్‌బాస్‌లో ఎన్టీఆర్‌తో వేదికను పంచుకొన్న తర్వాత రానా ఇంటిలోకి వెళ్లి సభ్యులకు షాక్ ఇచ్చాడు. రానాను చూడగానే సభ్యులు ఆనందంలో మునిగి ఘనంగా స్వాగతం పలికారు. అలాంటి సన్నివేశాలను మా స్టార్ టెలివిజన్ శనివారం, ఆదివారం రోజుల్లో బాగా ప్రచారం చేసింది. దాంతో ఈ ఎపిసోడ్‌పై విపరీతమైన ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే మంచి రేటింగ్

ఇప్పటికే మంచి రేటింగ్

తెలుగు బిగ్‌బాస్‌తో ఇప్పటికే మంచి రేటింగ్ సంపాదించుకొన్న స్టార్ మా టెలివిజన్ ఎన్టీఆర్, రానా కలయికతో మరింత దూసుకెళ్లే అవకాశం ఉంది. ఎన్టీఆర్ షోకు రానా రావడంపై వీక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

English summary
Rana Daggubati, who has been promoting his upcoming Telugu film Nene Raju Nene Mantri, has now headed to Bigg Boss Telugu season 1 to meet and greet the house members as Raja Jogendra, his character from the film. Rana would be sharing the screen space with his contemporary, Jr NTR, for the first time, who made his debut with Bigg Boss Telugu three weeks ago. Rana would go inside the Bigg Boss house and spend some time with the contestants.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu