For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sudigali Sudheer ఫలించిన 9 ఏళ్ల కల.. గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్ యూ చెప్పిన రష్మీ గౌతమ్

  |

  బుల్లితెరపైన స్టార్ సెలబ్రిటీలు రష్మీ గౌతమ్, యాంకర్, హోస్ట్, జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ మధ్య రొమాంటిక్ లైఫ్, కెమిస్ట్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక షోలో గానీ, మరేదైనా కార్యక్రమం కానీ... ఈ ఇద్దరు సెలబ్రీలు తెరపైన ఉంటే అభిమానుల్లో ఉండే ఆనందం మాటల్లో చెప్పనక్కర్లేదే. ప్రతీ కార్యక్రమాన్ని తమ మధ్య ఉన్న ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో సీన్‌ను రక్తికట్టిస్తారు. దాదాపు తొమ్మిదేళ్లుగా రష్మి, సుడిగాలి సుధీర్ లావ్ ట్రాక్ సుదీర్ఘమైన టెలివిజన్ సీరియల్‌గా కొనసాగుతున్నది. అయితే తాజాగా రోజా సూచన మేరకు సుడిగాలి సుధీర్‌పై తనకు ఉన్న ప్రేమను రష్మీ గౌతమ్ ఎలా వ్యక్తం చేసిందంటే..

  Photo Courtesy: ETV Telugu

  ఐ లవ్ యూ చెప్పమని రోజా సూచన

  ఐ లవ్ యూ చెప్పమని రోజా సూచన

  వినాయక చవితి సందర్భంగా ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈటీవీ తెలుగులో ప్రసారమైన ఊరిలో వినాయకుడు కార్యక్రమంలో సుధీర్, రష్మీని ఉద్దేశించి మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా మీ లవ్ ట్రాక్ వెళ్తున్నది. ఇక్కడంతా ఏం జరుగుతందో అర్దం కాక ప్రతీ ఒక్కరు జుట్టు పీక్కుంటున్నారు. మీ ప్రేమ వ్యవహారానికి ఓ ముగింపు ఉండదా అంటూ రోజా ఓ ప్రపోజల్ చేశారు. అయితే ఇంద్రజ జోక్యం చేసుకొని సుధీర్ ప్రపోజ్ చేశారు. కానీ రష్మీ దానికి సమాధానం చెప్పలేదు. అడిగా అడిగా అని అడుక్కొనే వాడి కంటే దీనంగా ప్రేమను సుధీర్ అడిగాడు అని అన్నారు.

  సుధీర్ కోసం ఏదైనా చేస్తానంటూ ..

  సుధీర్ కోసం ఏదైనా చేస్తానంటూ ..

  రోజా, ఇంద్రజ మాటలకు స్పందించిన రష్మీ గౌతమ్.. ఏదో ఒకటి చేద్దాం అంటూ ముసిముసిగా నవ్వింది. సుధీర్ నీ సీట్లో కూర్చుంటే.. నా మనసులో మాట చెబుతాను అంటూ అంటూ గతంలో సుధీర్ తనకు ప్రపోజ్ చేసిన వీడియోను చూపించింది. ఢీ కానీ, ఇతర ప్రోగ్రాంలో ఎవరైనా అమ్మాయి నాకు ప్రపోజ్ చేసినా.. ఇంకా ఎవరినైనా చూశానా.. ప్రపంచంలో అందగత్తెవైనా.. ఆడదన్నా.. మంచిదన్నా నీవే అంటూ.. సుధీర్ ప్రపోజ్ చేశారు. అయితే ఆ వీడియోకు స్పందిస్తూ.. తొమ్మిదేళ్లలో నీ ప్రపోజ్ చేస్తే ఎప్పుడైనా నేను నో చెప్పానా.. అని తొమ్మిదేళ్ల ప్రేమకు ఓ డెడికేషన్ ఇస్తున్నాను అంటూ రష్మీ పలు పాటలకు స్టెప్పులు వేసి.. లవ్ సింబల్, కలర్ పెయింటింగ్‌తో సుధీర్‌కు ఐ లవ్ యూ చెప్పింది.

  కాఫీ కప్పుపై సుధీర్ బొమ్మతో

  కాఫీ కప్పుపై సుధీర్ బొమ్మతో

  ఖడ్గం సినిమాలో నువ్వే నువ్వూ పాటకు స్టెప్పులు వేస్తూ కప్పులో కాఫీ పోయగానే ఆ కప్పుపై సుధీర్ బొమ్మ కనిపించింది. ఆ కప్పును ప్రేమగా తాకుతూ.. సుధీర్‌పై ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని వెల్లడించింది. రకరకాల గిఫ్టు బొమ్మలపై సుధీర్ చిత్రాన్ని చూపిస్తూ తన గుండెలకు హత్తుకొంటూ ప్రేమను వ్యక్తం చేసింది.

  సుధీర్ స్టైల్‌గా కళ్ల జోడు పెట్టుకొంటూ..

  సుధీర్ స్టైల్‌గా కళ్ల జోడు పెట్టుకొంటూ..

  అలాగే నీ స్టైల్ అంటే నాకు ఇష్టం అంటూ పిల్లలతో కళ్ల జోడును పంపిస్తే.. సుధీర్ తన స్టైల్‌ను మెయింటెన్ చేస్తూ గ్లాసెస్ పెట్టుకొని లుక్ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు ఓ ఫ్లవర్‌కు ఫ్లవర్ ఇవ్వడమేనేనా.. నేను నీకు రోజెస్‌తో గిఫ్టు ఇస్తున్నాను అంటూ ఓ ఫ్రేమ్‌పై గులాబీలో సుధీర్ బొమ్మను చేసి చూపించింది. ఆ తర్వాత సుధీర్‌తో కలిసి డ్యాన్స్ చేసి బలంగా కౌగిలించుకొన్నది.

  రష్మీ ప్రపోజ్ చూసి రోజా ఎమోషనల్

  రష్మీ ప్రపోజ్ చూసి రోజా ఎమోషనల్


  అయితే సుధీర్‌కు రష్మీ ప్రపోజ్ చేసిన విధానం చూసి రోజ్ ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడు కూడా అబ్బాయిలు ప్రపోజ్ చేయడం చూస్తాం. కానీ అమ్మాయిలు ప్రపోజ్ చేయరు. వాళ్ల ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎదుటి వాళ్లు తెలుసుకోవాలని అనుకొంటారు. కానీ తొమ్మది ఏళ్లు వెయిట్ చేసినందుకు నీవు ఎంత అందంగా ప్రపోజ్ చేశావు రష్మీ.. నీ ప్రపోజ్ చూసి నేనే పడిపోయాను అంటూ రోజా కామెంట్ చేసింది. అంతేకాకుండా స్టేజ్ మీదకు వెళ్లి వారికి హగ్ ఇచ్చింది.

  Recommended Video

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
  లవ్ మ్యాటర్ అలా చెప్పేసిన రష్మీ గౌతమ్

  లవ్ మ్యాటర్ అలా చెప్పేసిన రష్మీ గౌతమ్

  ఇక రష్మీ, సుధీర్ కెమిస్ట్రీ గురించి రోజా మాట్లాడుతూ.. ఈ సెట్‌‌లోనే కాదు.. మీ అభిమానులంతా మీరు పెళ్లి చేసుకోవాలని కోరుకొంటున్నారు. జంట అంటే ఇలా ఉండాలని అనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ మీద మీ కెమిస్ట్రీ బాగుంది. స్క్రీన్ మీద ఎంత నటించినా ఆ రేంజ్‌లో వర్కవుట్ కాదు. ఎవరైనా అమ్మాయి ప్రపోజ్ చేయాలంటే దానికి ఓ మైలురాయిని సెట్ చేశావు అని రోజా అంది. ఏది ఏమైనా రష్మీ తన మనసులో ఉన్న విషయాన్ని ఓ మాట రూపంలో చెప్పు అంటూ ఇంద్రజ కామెంట్ చేస్తే.. ఏ అమ్మాయి కూడా తన మనసులో ఉన్న ప్రేమను ఇంతకంటే గొప్పగా చెప్పదు అని రష్మీ అన్నారు.

  English summary
  Television Star Rashmi Gautami proposes Sudigali Sudheer on Oorilo Vinayakudu Show. Roja request to Rashmi to propose to Sudheer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X