For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Finale: ప్లాన్ మార్చిన బిగ్ బాస్.. ఫినాలేకు పాన్ ఇండియా హీరోలు.. ఆ బ్యూటీ స్పెషల్‌గా!

  |

  ఇండియాలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే భారీ స్థాయిలో స్పందనను సొంతం చేసుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలా దేశంలోనే మరే షోకూ దక్కని రేటింగ్‌ను రాబడుతూ సత్తా చాటుతోంది.

  దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరోది కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇది నేడు (డిసెంబర్ 18 ఆదివారం) గ్రాండ్ ఫినాలేను జరుపుకోబోతుంది. దీనికి ఇద్దరు హీరోలు, ఒక బ్యూటీ గెస్టులుగా వస్తున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  టైటిల్ పోరులో ఆ ఐదుగురు

  టైటిల్ పోరులో ఆ ఐదుగురు

  ఎంతో బజ్‌తో ప్రారంభం అయిన బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో మొత్తంగా 15 మంది ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఆరంభంలో ఆరుగురు సభ్యులు మాత్రమే హౌస్‌లో ఉన్నారు. అందులో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో శ్రీ సత్య వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు కీర్తి భట్, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఆది రెడ్డి మాత్రమే టైటిల్ పోటీలో నిలిచారు.

  గ్లామర్ కంచె తెంచేసిన కాజల్: డెలివరీ తర్వాత తొలిసారి యమ హాట్‌గా!

  వైభవంగా ఆరో సీజన్ ఫినాలే

  వైభవంగా ఆరో సీజన్ ఫినాలే

  వంద రోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ఆరో సీజన్ డిసెంబర్ 18 అంటే ఆదివారంతో పూర్తి కాబోతుంది. రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇక, ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను ఎంతో వైభవంగా జరపనున్నారు. దీని కోసం నిర్వహకులు భారీ ఖర్చు చేయడంతో పాటు ఎన్నో సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

  వాళ్లందరితో కలిసి సందడి

  వాళ్లందరితో కలిసి సందడి

  నేటి సాయంత్రం నుంచి జరగబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. అంతేకాదు, వీళ్లలో చాలా మంది ఆటపాటలతో అలరించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మొత్తం షూటింగ్ కూడా శనివారమే ముగిసినట్లు తెలిసింది.

  అఖండ హీరోయిన్ హాట్ సెల్ఫీ: ఓర్నాయనో ఆ డ్రెస్సేంటి బాబోయ్!

  గెస్టుల విషయంలో పుకార్లు

  గెస్టుల విషయంలో పుకార్లు

  ఎంతో గ్రాండ్‌గా జరగబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌ గ్రాండ్ ఫినాలేకు గెస్టులుగా వచ్చేది ఎవరన్న దానిపై కూడా చాలా రకాల చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఈ ఎపిసోడ్ కోసం వస్తారని అన్నారు. ఆ తర్వాత కూడా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఈ విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు. అయితే, ఈ సారి గెస్టులు ఎవరూ రావట్లేదని కూడా టాక్ వినిపించింది.

  అప్పటి హీరోయిన్‌తో పాటు

  అప్పటి హీరోయిన్‌తో పాటు

  స్టార్ మా ఛానెల్‌లో త్వరలోనే 'బీబీ జోడీ' అనే డ్యాన్స్ షోను ప్రారంభించబోతున్నారు. దీనికి శ్రీముఖి హోస్టుగా చేస్తుండగా.. ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లలోని కొందరు మాజీ కంటెస్టెంట్లు జంటలుగా పోటీ పడబోతున్నారు. ఇక, ఈ షోకు అప్పటి హీరోయిన్ రాధ, సదాతో పాటు తరుణ్ మాస్టర్‌లు జడ్జ్‌లుగా చేయబోతున్నారు. వీళ్లంతా ఫినాలే ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు.

  డెలివరీ తర్వాత తెగించిన హీరోయిన్: ఎద అందాలు హైలైట్ చేస్తూ ఘోరంగా

  నిఖిల్ ఎంట్రీ.. ఎలిమినేట్

  నిఖిల్ ఎంట్రీ.. ఎలిమినేట్

  ఆదివారం జరగబోతున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన నిఖిల్ సిద్ధార్థ్ తన కొత్త చిత్రం '18 పేజెస్' ప్రమోషన్ కోసం రాబోతున్నాడు. అతడు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రోహిత్‌ను ఎలిమినేట్ చేసి స్టేజ్ మీదకు తీసుకు వస్తాడని తెలిసింది. నిఖిల్‌తో పాటు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

  రవితేజ ఎంట్రీ.. ఆమె రచ్చ

  రవితేజ ఎంట్రీ.. ఆమె రచ్చ

  ఇక, ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ కోసం టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. తన కొత్త చిత్రం 'ధమాకా' ప్రమోషన్ కోసం హీరోయిన్ శ్రీ లీలాతో కలిసి ఈ మాస్ హీరో బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేయబోతున్నారని సమాచారం. అయితే, రవితేజ విన్నర్‌ను ప్రకటించే వరకూ షోలోనే ఉంటాడా? లేక మధ్యలోనే వెళ్లిపోతాడా? అన్నది తెలియలేదు.

  English summary
  Bigg Boss 6th Season Running Successfully. Heroes Ravi Teja and Nikhil Entry to This Reality Show Grand Finale Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X