Rithu Chowdary Remuneration: బిగ్‌బాస్‌లో రీతూ చౌదరికి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్క వారానికి ఎంతంటే?
బిగ్‌బాస్ తెలుగు 9 ఉత్కంఠగా సాగుతోంది. ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు కామనర్స్‌కు అవకాశం కల్పించారు నిర్వాహకులు. దాంతో 9 మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్‌తో కలిపి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ తెలుగులో అడుగుపెట్టారు. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ సీజన్ ఊహించని మలుపులు, గొడవలు, కొట్లాటలతో హాట్ హాట్‌గా సాగుతోంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ల గురించి చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లు, బుల్లితెర సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా రావడంతో వారి రెమ్యునరేషన్ ఎంత? వారానికి ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ నటి, యాంకర్ రీతూ చౌదరికి బిగ్‌బాస్‌లో అడుగుపెట్టినందుకు ఎంత పారితోషికం చెల్లించారు? ఈ వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్‌లో లేడీ కమెడియన్‌గా నవ్వులు పూయించిన రీతూ చౌదరి ఆ తర్వాత తెలుగులో టాప్ ఛానెల్స్‌లో పలు షోలు, కార్యక్రమాలలో పాల్గొన్నది. సీరియల్స్‌లోనూ అదృష్టం పరీక్షించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు బుల్లితెరపై దూసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రీతూ.. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు, సినిమాలు, షోల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటారు. రీతూ చౌదరికి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఆమె ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలకు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ప్రతిసారి బిగ్‌బాస్ సీజన్‌లో కంటెస్టెంట్స్ లిస్ట్‌లో రీతూ చౌదరి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. తీరా లాంచింగ్ ఎపిసోడ్ రోజున రీతూ కనిపించకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతుంటారు. అందంతో పాటు చలాకీతనంతో ఉండే రీతూ.. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ప్లస్ ఆవిడ ప్రేమ, పెళ్లి, విడాకులతో పాటు అంశాలతో వివాదాస్పద వ్యక్తిగా ఉండటం.. పైగా బిగ్‌బాస్ జనాలకు అలాంటి వాళ్లంటే చాలా ఇష్టం కావడంతో రీతూ చౌదరిని కంటెస్టెంట్‌గా తీసుకొచ్చేందుకు పలుమార్లు ప్రయత్నాలు చేశారు.
రెండు, మూడు సీజన్‌లకు రీతూ చౌదరిని సంప్రదించగా.. ఆమె అప్పట్లో తిరస్కరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈసారి మాత్రం బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా చౌదరి అడుగుపెట్టారు. హౌస్‌లో సందడి చేస్తూ.. టాస్క్‌లైనా, డిస్కషన్స్ అయినా దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా తన ఫ్రెండ్ ఇమ్మాన్యుయేల్‌తో కలిసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. రీసెంట్‌గా టెనెంట్స్‌ని ఓనర్స్‌గా మార్చే స్కిట్‌లో తన విశ్వరూపం ప్రదర్శించింది. అడ్డొచ్చిన వారిని పక్కకి నెట్టేస్తూ ఉన్మాదిలా ప్రవర్తించింది. అయితే డిమోన్ పవన్‌ని కెప్టెన్‌ని చేయడంలో తన మైండ్ గేమ్ చూపించి కంటెస్టెంట్స్‌ని ఆశ్చర్యపడేలా చేసింది.
ఇదిలాఉండగా.. బిగ్‌బాస్ తెలుగు 9లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లలో ఒకరిగా రీతూ చౌదరి పేరు తెచ్చుకున్నారు. బిగ్‌బాస్ కోసం తన సీరియల్స్, షోలు, సినిమాలు, ఇతర పనులను పక్కనపెట్టి మరి వచ్చారు. మరి అలాంటి రీతూ చౌదరికి రెమ్యునరేషన్ ఎంత? అనేది హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి రీతూ చౌదరికి వారానికి 3 లక్షల రూపాయల చొప్పున పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా బిగ్‌బాస్ తెలుగు 9లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచారు. మరి రీతూ ఎన్ని వారాల పాటు హౌస్‌లో కొనసాగుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











