జబర్దస్త్‌లో స్కిట్స్ సరిగ్గా చేయకపోతే తెర వెనుక జరిగేది ఇదే.. రూమ్‌లోకి పిలిచి..: రాకెట్ రాఘవ కామెంట్స్

జబర్దస్త్ లో ప్రస్తుతం ఉన్న సీనియర్ మోస్ట్ కమెడియన్స్ లలో రాఘవ ఒకరు. రాకెట్ రాఘవ అనే టీమ్ ను అతను ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నారు. మొదట కమెడియన్ గా జెమిని టీవీలో వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేసిన రాఘవ జబర్దస్త్ కు వచ్చిన తరువాత మళ్ళీ మరో ఛానెల్ కు వెళ్లలేదు. సేఫ్ జోన్ లోనే వెళుతున్నాడు. ఇటీవల జబర్దస్త్ తెరవెనుక జరిగిన కొన్ని స్కిట్స్ గురించి రాఘవ వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

 18 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే

18 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే

గత 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రాఘవ మొదట సినిమా నటుడు అవ్వాలని ప్రయత్నాలు చేసి అనంతరం టీవీ షోలతో కామెడీ ప్రోగ్రాంలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఇక జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి కూడా ఎంతోమంది సీనియర్లు బయటకు వెళ్లిపోయినా కూడా రాఘవ వెళ్లలేదు.

జబర్దస్త్ నుంచి అందుకే వెళ్లిపోవడం లేదు

జబర్దస్త్ నుంచి అందుకే వెళ్లిపోవడం లేదు

పాత వాళ్ళు వెళ్లిపోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. జబర్దస్త్ లో ఏది మారినా కూడా రాకెట్ రాఘవ మాత్రం మారడం లేదు. అంతే స్థిరంగా ఉంటున్నాడు. ఇక జబర్దస్త్ నుంచి బయటకు వెల్లకపోవడానికి గల కారణాన్ని కూడా చెప్పాడు. మళ్ళీ బయటకు వెళ్లినప్పుడు అవకశాలు ఎక్కువగా రాకపోతే ఖాళీగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ధైర్యం చేయలేకపోయినట్లు చెప్పారు.

కొత్త వాళ్ల నుంచి కూడా

కొత్త వాళ్ల నుంచి కూడా

ప్రస్తుతం జబర్దస్త్ లో వర్క్ కూడా చాలా హ్యాపీగా ఉందని కొత్తగా చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇక్కడే చేసుకుంటూ వెళుతున్నట్లు చెప్పారు. అంతే కాకుండా పాత వాళ్ల నుంచి ఎలాగైతే నేర్చుకున్నానో ఇప్పుడు వస్తున్న కొత్త వాళ్ల నుంచి కూడా అంతే నేర్చుకుంటున్నాను అని మాట్లాడారు.

స్కిట్స్ సరిగ్గా చేయకపోతే..

స్కిట్స్ సరిగ్గా చేయకపోతే..

ఇక జబర్దస్త్ స్కిట్స్ బాగా చేయనప్పుడు తెర వెనుక చాలా జరుగుతాయని జడ్జిలు కూడా ఏం చేశావని మొహం మీదే అనేస్తారని రాఘవ చెప్పాడు. అంతే కాకుండా కొన్నిసార్లు రూమ్ కు పిలిచి పేమెంట్స్ గట్టిగానే తీసుకుంటున్నారు కదా , సరిగ్గా చేయాలి కదా అని గట్టిగానే క్లాస్ తీసుకుంటారట. అప్పట్లో నాగబాబు గారు ఆ విధంగా అందరికి చెప్పేవారు.. అని రాఘవ క్లియర్ గా వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X