బిగ్‌బాస్ భారీ షాక్, వచ్చే రెండువారాలకు రోహిత్ నామినేట్! భర్త కోసం మరీనా దిమ్మ తిరిగే ప్లాన్!
బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షోలో కంటెస్టెంట్లకు భారీ షాక్స్ ఇస్తున్నారు. బ్యాటరీ రీచార్జ్ టాస్క్‌లో కఠినమైన పరీక్షలను ఇంటి సభ్యుల ముందు బిగ్‌బాస్ పెడుతున్నారు. బ్యాటరీ రీచార్జ్ చేసుకోవడానికి వాసంతి, రోహిత్‌లో ఎవరో ఒకరు నేరుగా రానున్న రెండు వారాల కోసం నామినేట్ కావాలి. అందుకు ప్రతిఫలంగా 100 శాతం బ్యాటరీ రీఛార్జీ అవుతుంది అని సూర్యకు బిగ్‌బాస్ చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

నామినేషన్‌కు సిద్దమైన రోహిత్
బిగ్‌బాస్ చెప్పిన నిబంధనను సూర్య కంటెస్టెంట్లకు చెబుతూ.. 100 శాతం ఫోన్ రీఛార్జ్ కావాలంటే.. వాసంతి, రోహిత్‌లో ఎవరో ఒకరు రెండు వారాలపాటు నామినేట్ కావాలి అని చెప్పాడు. దాంతో వాసంతి నామినేట్ కావాడానికి నిరాకరించింది. దాంతో తాను నామినేట్ అవుతానని రోహిత్ ముందుకు వచ్చాడు.

100 శాతం బ్యాటరీ రీచార్జ్ కోసం
ఇంటి సభ్యులను సమావేశపరిచి.. వాసంతి, రోహిత్‌లో ఎవరు నామినేట్ అవుతున్నారో చెప్పండి అంటే.. వాసంతి గతవారం నామినేట్ అయింది. ఈ వారం మరీనా నామినేట్ అయింది. వచ్చే రెండు వారాలకు నేను నామినేట్ అవుతాను రోహిత్ చెప్పాడు. దాంతో 100 శాతం ఫోన్ రీచార్జ్ అయింది.

ఇంత స్వార్ధమా? అంటూ రోహిత్
అయితే ఫోన్ 100 శాతం రీచార్జ్ అవ్వడానికి,.. రెండు వారాలపాటు నామినేట్ అవ్వడానికి కారణమైన తనకు ఫోన్ మాట్లాడే ఛాయిస్ ఇవ్వకుండా.. వేరే వాళ్లు ఆ ఛాయిస్ తీసుకోవడంపై మరీనా, రోహిత్ బాధపడ్డారు. ఇంటి సభ్యుల్లో ఇంత స్వార్ధమా అని మరీనాతో రోహిత్ ఆవేదన చెందాడు.

నేనో.. రోహితో.. ఎలిమినేట్ అవ్వడం..
రోహిత్ నామినేట్ అయిన తర్వాత ఇనయతో మరీనా తన బాధను పంచుకొన్నది. జంటగా ఆడే తమను మొదట బిగ్‌బాస్ విడదీశాడు. ఆ తర్వాత నేను నామినేట్ అయ్యాను. ఇప్పుడు రోహిత్ రెండు వారాలకు నామినేట్ అయ్యాడు. ఇప్పుడు మాలో ఒకరు ఎలిమినేట్ కావడానికి అవకాశాలు పెరిగాయి. ఎవరో ఒకరు ఇంటి నుంచి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుందని బాధపడింది.

భర్తను కాపాడుకొనేందుకు మరీనా
ఇది ఇలా ఉండగా.. కెప్టెన్సీ టాస్క్‌లో సూర్య, రోహిత్‌లో ఒకరికి ఓటేయ్యాల్సి వచ్చిన పరిస్థితిలో మరీనా చాలా తెలివిగా ప్రవర్తించింది. తన భర్త రోహిత్‌కు కాకుండా సూర్యకు ఓటేసింది. నామినేషన్‌లో ఉన్న తాను, రోహిత్‌ను కాపాడుకొనేందుకునేందుకే మరీనా తన వ్యూహాన్ని అమలు పరిచిందనే వాదన తెరపైకి వచ్చింది. మరీనా స్ట్రాటేజీ వర్కవుట్ అవుతుందా? లేదా? వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











