Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వైసీపీలోకి జబర్దస్త్ కమెడియన్స్.. హైపర్ ఆదికి పోటీగా రోజా మాస్టర్ ప్లాన్?
టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపును అందుకున్న కొంతమంది కమెడియన్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా బిజీ అవుతున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా ఎంట్రీ ఇచ్చినవారు ఇప్పుడు మంచి ఆదాయాలను అందుకుంటున్నారు. కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా టెలివిజన్లోనే వివిధ రకాల షోలు చేసుకుంటూ మరో స్థాయికి వెళ్తున్నారు.
అయితే ఇప్పుడు అందులో కొందరు రాజకీయపరంగా అడుగులు వేస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇటీవల హైపర్ ఆది జనసేన తరపున మాట్లాడటంతో ఇప్పుడు రోజా అతనిని టార్గెట్ చేసే విధంగా.. కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ ను రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సినిమాల్లో కూడా..
జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకొని ఆ తర్వాత సినిమాల్లో కూడా మంచి అవకాశాలు అందుకున్న కమెడియన్స్ లలో హైపర్ ఆది ఒకరు. ప్రస్తుతం హైపర్ ఆది సినిమాల్లో కంటే టెలివిజన్లోనే ఎక్కువగా బిజీ అవుతున్నాడు. గ్యాప్ లేకుండా అతనికి చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఒక్క ఎపిసోడ్ కు రెండు లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఈటీవీలో అతను ఢీ షోలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

హైపర్ ఆదితో అప్పుడే విబేధాలు
అయితే ఒకప్పుడు జబర్దస్త్ ద్వారా నాగబాబు రోజా గారికి బాగా దగ్గరైన హైపర్ ఆది వారిపై కూడా కామెడీగా కొన్ని పంచులు వేస్తుండేవారు. నాగబాబు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆది కొంతకాలం పాటు జబర్దస్త్ లోనే ఉన్నాడు.
కానీ ఆ మధ్యలో అది పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎక్కువ కామెంట్స్ చేయడంతో రోజా సంతృప్తి వ్యక్తం చేసింది అని టాక్ వచ్చింది. అలాగే వారి మధ్య విభేదాలు రావడం వలన హైపర్ ఆది కొంతకాలం పాటు జబర్దస్త్ కు గ్యాప్ కూడా ఇచ్చాడు అని కథనాలు వెలువడ్డాయి.

నేతలపై ఆది పంచ్
ఇటీవల హైపర్ ఆది జనసేనకు సంబంధించిన ఒక మీటింగ్లో పాల్గొని మాట్లాడిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా వైసిపి పార్టీపై అతను చేసిన కామెంట్లు కూడా చాలా వైరల్ అయ్యాయి.
ముఖ్యంగా వైసిపి మంత్రులు కావాలని పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేస్తున్నారు అని వివిధ రకాల శాఖలలో ఉన్న సరే వాటి గురించి వారికి ఏమీ తెలియదు అని అంతగా ఉంటే పవన్ కళ్యాణ్ ను తిట్టే ఒక శాఖను పెట్టుకోండి అని పంచ్ లు కూడా వేశాడు.

రోజా కౌంటర్
అయితే హైపర్ ఆది ఆ విధంగా కామెంట్ చేయడంతో రోజా కూడా అతనిపై ఊహించని స్థాయిలో కౌంటర్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది. అతనికి డైపర్ పెట్టుకునే సమయం వచ్చింది అని మీడియా ముందు ఫోన్ నెంబర్ కూడా ఇస్తూ ఊహించిన విధంగా రోజా చేసిన వ్యాఖ్యలు అందరిలో హాట్ టాపిక్ గా మారింది. హైపర్ ఆది మెగా హీరోలకు భయపడి మళ్లీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తారేమో అనే భయంతోనే ఆ విధంగా వారికి మద్దతు ఇస్తున్నాడు అని రోజా కామెంట్ చేసింది

రోజా మాస్టర్ ప్లాన్
అయితే ఇప్పుడు ఊహించిన విధంగా మరొక కొత్త టాక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ రోజాకు చాలా క్లోజ్ గా ఉన్నారు. అయితే వారు వైసీపీ కోసం మీడియా ముందు మాట్లాడేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. హైపర్ ఆదికి పోటీగానే వారిని రోజా రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.

ఆదిని తిట్టించేలా ప్లాన్?
నాగబాబుపై కోపంతో ఉన్న కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ రోజా వైపు యూ టర్న్ తీసుకున్నట్లు కూడా కథనాలు వస్తున్నాయి. ఏదేమైనా కూడా రోజా తరఫున కొంతమంది జబర్దస్త్ టెలివిజన్ సెలబ్రిటీలు వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వారిలో ఒక ప్రేమ జంట కూడా హైపర్ ఆధిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.