»   » నటి రోజాకు ‘జబర్దస్త్ కామెడీ షో’ షాక్!

నటి రోజాకు ‘జబర్దస్త్ కామెడీ షో’ షాక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవర్తన సరిగా లేని కారణంగా రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. రోజా వ్యవహారం ఏపీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అటు అసెంబ్లీ నుండి షాక్ తగిలిన రోజా ఇంకా కోలుకోక ముందే.... మరో షాక్ కూడా తగిలినట్లు తెలుస్తోంది.

తెలుగులో సూపర్ హిట్ కామెడీ షో అయిన ‘జబర్దస్త్'లో రోజా జడ్డిగా వ్యవహిస్తున్న సంగతి తెలిసిందే. నాగబాబుతో పాటు రోజా కూడా ఈ షోలో చాలా కాలంగా సందడి చేస్తున్నారు. ఇందుకోసం రోజా ఒక్కో ఎపిసోడ్ కు రూ. 6 లక్షల వరకు చార్జ్ చేస్తోందట.ఉన్నట్టుండి ఆమె ఈ షో నుండి మాయం అయ్యారు.

Roja out of Jabardasth

నిన్న ప్రసారం అయిన ‘జబర్దస్త్' షోలో రోజా స్థానంలో మంచు లక్ష్మి కనిపించింది. దీంతో ‘జబర్దస్త్' షో నుండి రోజాను తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి రోజా తనకు వీలు కాక ఈ షోలో పాల్గొనలేక పోయారా? లేక బయట ప్రచారం జరుగుతున్నట్లు ఆమెను కావాలని తప్పించారా? అనేది చర్చనీయాంశం అయింది.

రోజా తీరుపై గత కొంతకాలంగా అసహంగా ఉన్న టీడీపీ వర్గాలు ఆమెను ఈ షో నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నాయని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

English summary
Yesterday night, we saw Lakshmi Manchu replacing Roja in TV comedy show Jabardasth. Whether this replacement is temporary or permanent will be known little later.
Please Wait while comments are loading...