For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్, బాలయ్య చేస్తే తప్పు లేదు.. నేను చేస్తే తప్పా.. కోపంతో ఊగిపోయిన రోజా

  |

  టాలీవుడ్ సీనియర్ నటి రోజా ఇటీవల ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకి ఒక్కసారిగా పక్కన ఉన్న పేపర్ ని సిసిరికొట్టి ఏమిటి బాబు ఆ ప్రశ్నలు? తెలుగు దేశం పార్టీ వాళ్ళు అడిగే ప్రశ్నలు నన్ను అడిగి నాకు చిరాకు తెప్పించవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జబర్దస్త్ షోలో మీరు వ్యవహరించే తీరుపై కామెంట్స్ చేస్తున్నారు అనగనే రోజా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన విధానం హాట్ టాపిక్ గా మారింది.

  ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి

  ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి

  రోజా మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి ఒక ప్రొఫెషన్ ఉంటుంది. అలాగే నేను ఆర్టిస్ట్ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఇతర రంగాల్లో చాలా మంది రాజకీయ నాయకులు డబ్బు సంపాదిస్తున్నారు. నేను ఒక ఆర్టిస్ట్ గా నా వర్క్ నేను చెసుకుంటున్నాను. సీనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ లాంటి వాళ్లే సినిమాలు చేస్తున్నప్పుడు నేను కాక ఆర్టిస్ట్ గాఉంటే తప్పేంటి?

  ఆడవాళ్ళు చేస్తే తప్పా?

  ఆడవాళ్ళు చేస్తే తప్పా?

  మగవాళ్ళు చేస్తే తప్పు లేదు? ఆడవాళ్ళు చేస్తే తప్పని మీరు భావిస్తున్నారా?. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం నన్ను ఒక నటిగా ఆదరించిన ప్రజల కోసం ఏదైనా సేవ చేయలనే తపనతో వచ్చాను. నేను ఏదైతే మంచి విషయం అనుకుంటానో దాన్ని చాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళతాను. అవినీతి చేయడం నాకు చేత కాదు. ఇతర బిజినెస్ లు కూడా లేవు. నాకు నటన మాత్రమే వచ్చు. అదే చేస్తున్నాను.

  జగన్మోహన్ రెడ్డికి లేని బాధ మీకెందుకు?

  జగన్మోహన్ రెడ్డికి లేని బాధ మీకెందుకు?

  అలాంటిది నన్ను ఆర్టిస్ట్ గా ఎందుకు డ్యాన్స్ చేశావు. ఎందుకు పలనా షోలో ఉన్నావు అని నాకు అంటే దాని అర్థం ఏమిటి.

  అయినా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి లేని బాధ మీకెందుకు? అయినా జబర్దస్త్ వల్ల వచ్చిన నష్టమేంటి. నాకు వచ్చిన క్రేజ్ చూసి చాలా బాధపడుతున్నారా?

  ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా

  ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా

  జబర్దస్త్ అనేది ఒక కామెడీ షో. చూసినవాళ్లు బాధలన్ని మర్చిపోయేలా చేసే కామెడీ షో. షో చూసిన చాలా మంది కూడా నన్ను కలిసి ఎంతో హాయిగా ఉన్నామని, షో కారణంగా మా కష్టాలన్నీ మరచిపోయి సరదాగా నవ్వుకుంటామని చెబుతున్నారు. అలాంటి రెస్పాన్స్ వచ్చింది కాబట్టే టీడీపీ వాళ్ళు ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా నేను పట్టించుకోను.

  లిమిట్ లోనే ఉంటున్నాను

  లిమిట్ లోనే ఉంటున్నాను

  నన్ను ఒక డ్యాన్సర్ గా కూడా అభిమానుస్తున్నారు అని కొన్నిసార్లు డ్యాన్స్ చేశాను. ఇక రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత లిమిట్ లోనే ఉంటున్నాను. ఎక్కువగా చైర్ లోనే ఉంటూ డ్యాన్స్ చేస్తున్నాను. అనవసరంగా వాళ్ళతో అనిపించుకోవడం ఎందుకు అని లైట్ తీసుకున్నాను. డ్యాన్స్ కూడా చాలా వరకు తగ్గించేశాను.

  Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
  నాకు రెండు కళ్లతో సమానం

  నాకు రెండు కళ్లతో సమానం

  ఇక జబర్దస్త్ రాజకీయాల్లో ఏది కావాలని అని మీరు అడిగితే.. నేను మాత్రం రాజకీయాల్లోనే ఉంటాను. ఎందుకంటే నేను ప్రజాసేవకే ఎక్కువ విలువ ఇస్తాను. నాకు నటిగా గుర్తింపు తెచ్చిపెట్టిన ఇండస్ట్రీ, అలాగే నన్ను ఆదరిస్తున్న పాలిటిక్స్ అంటే నాకు రెండు కళ్లతో సమానం. ఇక ఫుల్ టైమ్ రాజకీయాల్లో కొనసాగాలి అంటే మాత్రం సినిమాలకు దూరంగా ఉంటాను అని రోజా వివరణ ఇచ్చారు.

  English summary
  Jabardast, one of the top comedy shows in the history of Telugu television, has been shut down due to lockdown. At one point, however, the talk came about as the show was no longer on the television screen. The talk also came down to the fact that the organizers were discontinuing the show as the rating went down. That suspense is on screen today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X