For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్థస్త్‌కి రోజా రీ ఎంట్రీ.. 27 ఏళ్లుగా లేనిది ఇప్పుడే చూస్తున్నా అంటూ ఇంద్రజ ఎమోషనల్!

  |

  తెలుగులో జబర్థస్త్ షో తెచ్చుకున్నంత పేరు మరే ఇతర షో తెచ్చుకోలేదు. శ్యాం ప్రసాద్ రెడ్డికి చెందిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. మధ్య మధ్యలో చాలామంది కంటెస్టెంట్స్ మారారు, జడ్జిలు మారారు కానీ షో మాత్రం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా శస్త్రచికిత్స కోసం హాస్పిటల్ లో జాయిన్ కావడంతో ఆమె స్థానంలో ఇంద్రజ జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.. అయితే తాజాగా రోజా ఆరోగ్యం కుదుటపడినట్లు తెలుస్తోంది.. ఆమె షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.. వివరాల్లోకి వెళితే

   జబర్థస్త్ ప్రేమ

  జబర్థస్త్ ప్రేమ

  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలాకాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగిన రోజా ఆ తర్వాతి కాలంలో అత్త అమ్మ పాత్రలు కూడా చేశారు. కానీ తెలుగు టెలివిజన్ చరిత్రలో నెంబర్ వన్ షో అనిపించుకుంటున్న జబర్దస్త్ షో మొదలైన తర్వాత ఆమె అందులో జడ్జిగా వ్యవహరించడం మొదలుపెట్టారు. ఈ షో ద్వారా ఆమెకు మరింత క్రేజ్ లభించింది. రాజకీయాల్లో సైతం యాక్టివ్గా ఉండే ఆమె ఎమ్మెల్యే కావడానికి ఈ జబర్దస్త్ కారణం అని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

   శస్త్ర చికిత్స నేపథ్యంలో

  శస్త్ర చికిత్స నేపథ్యంలో

  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రోజా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి ఆమె వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. అయితే కొద్ది రోజుల క్రితం రోజా అనారోగ్యంగా ఉండటంతో హాస్పిటల్ లో చికిత్స కోసం వెళ్లారు. ఆమెకి శస్త్ర చికిత్సలు చేయడం అత్యవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్సలు చేయించుకుని బయటికి పరిమితమయ్యారు. ఈక్రమంలో రోజా స్థానంలో ఇంద్రజ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే రోజాకు పూర్తిగా నయం కావడంతో ఆమె జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్థస్త్ షూటింగ్ లో కూడా తాజాగా పాల్గొన్నట్లు సమాచారం.

  ఎమోషనల్

  ఎమోషనల్

  ఇక తాజాగా నిన్న రిలీజ్ అయిన ఎక్స్తా జబర్దస్త్ ప్రోమోలో రాకింగ్ రాకేష్ స్కిట్ చర్చనీయాంశంగా మారింది. మరి కొన్నేళ్ల తరువాత జబర్దస్త్ ప్రోగ్రాం ఎలా ఉంటుంది అన్న ఊహతో ఆయన ఒక స్కిట్ చేయగా ఈ స్కిట్ సందర్భంగా జబర్దస్త్ లోని అందరూ ఎమోషనల్ అయ్యారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను తదితరులు తమకు జబర్దస్త్ కి ఉన్న అనుబంధం అలాగే జబర్దస్త్ కు తమకు ఉన్న అవినాభావ సంబంధం గురించి చెప్పుకొచ్చారు.

  ఇన్నేళ్లు చూడరుగా

  ఇన్నేళ్లు చూడరుగా


  అయితే ఇదే సమయంలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ కూడా ఆసక్తికరంగా స్పందించారు.. తాను హీరోయిన్ గా మారి దాదాపు 27 ఏళ్లు అయిందని, అయితే ఈ 27 ఏళ్లు తనకు ప్రేక్షకుల నుంచి ఎంత ప్రేమ దక్కుతుందో తనకు తెలిసేది కాదని కానీ మొట్టమొదటిసారి జబర్దస్త్ ద్వారా ఎంత ప్రేమ దక్కుతుంది అనేది కళ్లారా చూస్తున్నాను అని చెప్పుకొచ్చింది. జబర్దస్త్ ద్వారా తన అభిమానుల ప్రేమను పొందానని ఆమె ఎమోషనల్ అయింది.

  Prabhas : పొందిన సాయం మర్చిపోని ప్రభాస్.. ఆ హీరో కి డార్లింగ్ అండ | Radhe Shyam || Oneindia Telugu
  ఇన్నేళ్ళు నడిచేది కాదుగా

  ఇన్నేళ్ళు నడిచేది కాదుగా

  నిజానికి కొద్ది రోజుల క్రితం ఆమె ఒక్క ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించింది. తాను జబర్దస్త్ లో ఇలా వ్యాఖ్యాతగా వ్యవహరించడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నారు. అభిమానులు కామెంట్స్ రూపంలో తమ అభిమానాన్ని ప్రేమను వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. అదే ఇంటర్వ్యూలో జబర్దస్త్ ఒక బూతు ప్రోగ్రాం అని జనం అనుకుంటున్నారు కదా అని యాంకర్ ప్రశ్నించగా తాను అలా అనుకోవడం లేదని అలా అనుకుంటే ఈ షో ఇన్నేళ్లు నడిచేది కాదని ఆమె చెప్పుకొచ్చింది.

  English summary
  as we all know actress and politician RK roja recently undergone two major surgeries. for the time being roja is fully recovered now and as per the reports she is attending for the latest shoot of jabardasth and extra jabardasth. and in the latest extra jabardasth promo the present judge indraja became emotional about her journey with jabardasth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X