Bigg Boss 15: గ్రాండ్ ప్రీమియర్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసా.. కంటెస్టెంట్ల పూర్తి లిస్టు ఇదే?
అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న క్షణం రాబోయే కొద్ది గంటలు రాబోతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా 'బిగ్ బాస్ 15' ఈ రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన ప్రారంభం కాబోతోంది. 'బిగ్ బాస్' 15 వ సీజన్ థీమ్ అడవి పై ఆధారపడి ఉంటుంది మరియు దీని కోసం పోటీదారులందరూ అడవిలో నివసించవలసి ఉంటుంది. ఇక్కడ వారికి సౌకర్యాల కొరత ఉంటుంది మరియు నిద్ర కూడా కరువు అవనుంది. ఇక ఈసారి బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ నటి రేఖ కూడా 'బిగ్ బాస్ 15' కోసం పని చేస్తున్నారు. ఇక ఈ షో ఎలా? ఎక్కడ? ఎప్పుడు? చూడాలి అనే వివరాలు మీకు అందిస్తున్నాం.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో
నిజానికి కొద్దీ రోజుకా కృషం విడుదలైన బిగ్‌బాస్ 15 ప్రోమో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఇందులో సల్మాన్ ఎంట్రీతోపాటు ఆయన ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. హౌస్ లోకి వెళ్లే సభ్యులు తమ కోసం తాము నిలబడాలని సల్మాన్ తెలిపారు. విలాసవంతమైన ఇంట్లోకి వెళ్లే ముందు అడవి లాంటి సెటప్‌లో కఠిన పరిస్థితుల్లో రెండు వారాలు గడపాల్సి ఉంటుందని సల్మాన్ పేర్కొన్నా

రేఖ స్పెషల్
ఆ ప్రోమోలో అందరి ముఖాల్లో నవ్వులు చూడాలని, కొంత రొమాన్స్, ఇంకొంత గేమ్లో ఎలా సర్వైవ్ అవుతారో చూడాలనుకుంటున్నాను అని తెలిపారు. సభ్యులు తమ కోసం, తమకిష్టమైన వారి కోసం పోరాడాలని కోరుకుంటున్నా అని తెలిపారు సల్మాన్. ఆ సందేశం బిగ్‌బాస్15 సీజన్‌పై అంచనాలను పెంచుతుంది. ఇక ఇక 'బిగ్ బాస్' 15 వ సీజన్ లో రేఖ 'విశ్వ మంత్రి' పాత్రను పోషిస్తుంది. పోటీదారులకు ఆమె సూచనలు చేయనుంది.

ఎక్కడ లైవ్ చూడచ్చు అంటే ?
అడవిలో పోటీదారులు ఎలాంటి సౌకర్యాలు పొందాలో లైన్ నిర్ణయిస్తుందని అంటున్నారు. ఇక 'బిగ్ బాస్ 15' ఈ రోజు అంటే అక్టోబర్ 2 న ప్రీమియర్ అవుతోంది. ఈ బిగ్ బాస్ ను ఎప్పుడు ? ఎక్కడ చూడవచ్చు? అనేది పరిశీలిస్తే 'బిగ్ బాస్ 15' అక్టోబర్ 2 న రాత్రి 9:30 గంటలకు కలర్స్ ఛానెల్‌లో ప్రసారం చేయబడుతుంది. షో ప్రీమియర్ వూట్ యాప్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఇది కాకుండా, 'బిగ్ బాస్ 15' కూడా Jiotvలో కూడా ప్రసారం చేయబడుతుంది.

ఎప్పుడు ప్రసారం అవుతుంది అంటే?
ఇక ఈ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10:30 PMకి, వీకెండ్స్ లో 9:30 PMకి ప్రసారం చేయబడుతుంది, శని మరియు ఆదివారాల్లో సల్మాన్ ఖాన్ 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్స్ ని హోస్ట్ చేస్తారు, దీనిని శని, ఆదివారాలలో రాత్రి 9:30 గంటలకు వీక్షకులు వీక్షించవచ్చు. ఈ సారి షోలో వివిధ నేపథ్యాల నుండి పోటీదారులు వచ్చారు. సంగీతం, టెలివిజన్ మరియు సినిమా నేపథ్యానికి చెందిన వారు బిగ్ బాస్ 15 పోటీదారుల జాబితాలో ఉంటారు.

ఎవరెవరు వెళ్తున్నారు అంటే?
ఈ షోలో నటి రియా చక్రవర్తి పాల్గొనవచ్చని అంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు రియా బిగ్ బాస్ 15 లో భాగం కాదని నిర్ధారించబడింది. ఈ షోలో చేరిన కన్ఫర్మ్ చేసిన కంటెస్టెంట్స్ లిస్ట్ తెలుసుకుందాం కరణ్ కుంద్రా, సింబా నాగపాల్, విధి పాండ్య, విశాల్ కోటియన్, సాహిల్ ష్రాఫ్, మీషా అయ్యర్, తేజస్వి ప్రకాష్, ఆకాశ సింగ్, డోనల్ బిష్ట్, ఉమర్ రియాజ్ వెళ్తున్నారు. వీరిటోపాతు బిగ్‌బాస్ 15 ఓటీటీ సభ్యులు షమితా శెట్టి, పార్తిక్ సెహజ్‌పాల్, నిశాంత్ భట్ కూడా హౌజ్‌లోకి వెళ్తున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











