»   » డ్యాన్స్‌ రియాల్టీ షో: యాంకర్ గా సల్మాన్

డ్యాన్స్‌ రియాల్టీ షో: యాంకర్ గా సల్మాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి :డ్యాన్స్‌ రియాల్టీ షోకి యాంకర్లగా సినిమా స్టార్స్ వస్తే ఆ క్రేజే వేరు. ముఖ్యంగా టీవి మీడియా మరింత ముందుకు దూసుకుపోతూండటంతో స్టార్స్ తమ క్రేజ్ ని మరింత పెంచుకోవటం కోసం ఈ మీడియాలోకి ప్రవేశించటానికి ఏ మాత్రం సందేహించటం లేదు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తన ఫ్యాన్స్ ని ఆనందపరిచారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సల్మాన్‌ ఖాన్‌ డ్యాన్స్‌ ప్లస్‌ అనే టీవీ రియాల్టీ డ్యాన్స్‌ షోకి ఒకరోజు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఆయన ఇదివరకు దస్‌ కా దమ్‌, బిగ్‌ బాస్‌ వంటి రియాల్టీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Salman Khan to Co-Host an Episode of Talent Show Dance +

ఇప్పుడు తన సొంత నిర్మాణంలో వస్తున్న మొట్టమొదటి చిత్రం 'హీరో' ప్రచారం కోసం ఒకరోజు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్లు బాలీవుడ్‌ మీడియా వర్గాల సమాచారం. ఈ కార్యక్రమంలో చిత్ర ప్రధాన తారాగణం అథియా శెట్టి, సూరజ్‌ పంచోలీలు కూడా పాల్గొంటున్నారు.

ఆదివారం ఈ ఎపిసోడ్‌ స్టార్‌ప్లస్‌లో ప్రసారం కానుంది. ఈ షోకి ప్రఖ్యాత కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా, శక్తి మోహన్‌, ధర్మేశ్‌ యెలండే, సుమీత్‌ నాగ్‌దేవ్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. హీరో చిత్రం 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరో ప్రక్క

సల్మాన్‌ ఖాన్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు (సోమవారం) కొట్టివేసింది. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సల్మాన్‌ను దోషిగా నిర్ధారించిన ముంబయిలోని సెషన్స్‌ కోర్టు గతంలో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం ముంబయి హైకోర్టు సల్మాన్‌కు అదే రోజు బెయిలు మంజూరు చేసింది.

Salman Khan to Co-Host an Episode of Talent Show Dance +

కేసు వివరాల్లోకి వెళితే...

2002 సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి సల్మాన్ కారులో వస్తుండగా రోడ్డుపై నిద్రిస్తున్నవారిపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. కేసును విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు.. ఇప్పటివరకు 25 మంది నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. చివరిగా సల్మాన్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది.

English summary
Salman Khan, who has previously hosted shows like ‘10 Ka Dum’ and ‘Bigg Boss’, will turn host once again for an upcoming episode of TV show ‘Dance +’, where he will promote his forthcoming production ‘Hero’.
Please Wait while comments are loading...