Don't Miss!
- News
తారకరత్న కోసం బాలకృష్ణ సంకల్పం..!!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బిగ్‌బాస్.. ప్లీజ్ ఒక్కసారి క్షమించండి.. బతిమిలాడిన సంపూ.. ఏం జరిగిందంటే..
బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ ప్రారంభమైన రెండో రోజే సెలబ్రిటీల ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది. ఈ రియాలిటీ షో నుంచి బయటకు పంపించేందుకు తక్కువ అర్హత ఉన్న వారి కోసం అన్వేషణ ప్రారంభించారు బిగ్‌బాస్. ఎవరిని ఎలిమినేట్ చేయాలనే విషయంపై 14 మంది పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరి నుంచి బిగ్‌బాస్ సేకరిస్తున్నది. ఈ క్రమంలో ఒక్కొక్కరి నుంచి తమ అభిప్రాయాలను బిగ్‌బాస్ సేకరించాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ కెప్టెన్ సంపూకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అదేమింటంటే..

ధన్‌రాజ్, శివబాలాజీ పేర్లను నామినేట్
బిగ్‌బాస్ హౌస్‌లోని కన్ఫేషన్ రూమ్‌లోకి అందరిని పిలిచి ఎవరిని ఎలిమినేట్ చేయవచ్చు అని బిగ్‌బాస్ అడిగాడు. ఈ క్రమంలో కెప్టెన్ సంపూను పిలిచాడు. ఎలిమినేషన్ ప్రక్రియలో నీవు ఎవరిని నామినేట్ చేయాలనుకొంటున్నావు అని అడుగగా.. నేను కమెడియన్ ధన్‌రాజ్, హీరో శివబాలాజీని నామినేట్ చేస్తున్నానని చెప్పాడు.
Recommended Video


నాకు వేరే ఉద్దేశం లేదు..
ధన్‌రాజ్, శివబాలాజీని నామినేట్ చేయడం వెనుక ఎలాంటి ఉద్దేశం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వారి పేరు చెప్పాల్సి వచ్చింది అని బిగ్‌బాస్‌కు సంపూ తెలియజేశాడు. కారణాలు ఏవీ తెలియవు అని అన్నాడు.

పెద్దగా కారణాలు చెప్పలేకపోతున్నాను
ధన్‌రాజ్, శివబాలాజీతో తొలిసారి పనిచేస్తున్నాను. అందుకే పెద్దగా కారణాలు చెప్పలేకపోతున్నాను. అందుకు బిగ్‌బాస్ స్పందిస్తూ.. కారణాలు చెప్పనంత వరకు నామినేషన్ ప్రక్రియ ఆగిపోతుంది. ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు, అందుకు కారణాలు చెప్పనంత వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి అవ్వదు అని బిగ్ బాస్ స్పష్టం చేశాడు.

నాకు అర్థం కావడం లేదు..
ధన్‌రాజ్, శివబాలాజీని బయటకు పంపించడానికి పెద్దగా కారణాలు ఏమీ లేదు. ఇప్పుడిప్పుడే ఒకరి గురించి మరొకరం తెలుసుకొంటున్నాం. కారణాలు ఏమిటనే విషయం నాకు అర్థం కావడం లేదు. చాలా తికమకగా ఉంది. ఈ ఒక్కసారి నన్ను క్షమించు బిగ్ బాస్ అని అని సంపూ వేడుకొన్నాడు.

సంపూని బిగ్‌బాస్ ఉతికి ఆరేస్తుంటాడు
ఇలా కన్ఫెషన్ రూమ్‌లో బిగ్‌బాస్, సంపూ మధ్య సుదీర్ఘమైన చర్చ జరుగుతుండగా బయట లాన్‌లో కూర్చొని ఉన్న ఇతర సభ్యుల్లో ఓ రకమైన ఆసక్తి పెరిగింది. లోపల సంపూను రూల్స్ రెగ్యులేషన్ అంటూ ఉతికి ఆరేస్తుంటారు. బిగ్‌బాస్ ఇరుగదీస్తుంటాడు అని సభ్యులు జోకులు వేసుకొన్నారు.

వారిద్దరి గొడవ ఎక్కువగా ఉంది..
నామినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్లంటే కారణాలు చెప్పాల్సిందేనని బిగ్ బాస్ పట్టుబట్టాడు. దాంతో వారిద్దరి గొడవ చాలా ఎక్కువగా ఉంది. ధన్‌రాజ్, శివబాలాజీ ఎక్కువగా మాట్లాడటం ఇబ్బందిగా అనిపించింది. అందుకే వారి పేర్లు చెప్పాను అని సంపూ కారణాలు చెప్పాడు. దాంతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది.