Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ తెలుగు 9 ఫస్ట్ కెప్టెన్‌గా మోస్ట్ కాంట్రవర్సియల్ కంటెస్టెంట్..
బిగ్‌బాస్ తెలుగు 9 హోరాహోరీగా సాగుతోంది. సెలబ్రెటీలను టెనెంట్స్‌గా, కామనర్స్‌ని ఓనర్స్‌గా పెట్టి ఎంటర్‌టైన్ చేయిస్తున్నాడు బిగ్‌బాస్. అందుకు తగినట్లుగానే రెండు గ్రూపులు గేమ్ ఆడుతున్నాయి. ఈ నాలుగు రోజుల్లో గేమ్‌ను అర్ధం చేసుకునేందుకు కంటెస్టెంట్స్ ప్రయత్నిస్తున్నారు. బాగా ఆడతారని కంటెస్టెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసినవారు చేతులు ఎత్తేస్తుండగా.. ఏమాత్రం అంచనాలు లేనివారు దుమ్మురేపుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ తెలుగు 9 తొలి కెప్టెన్ ఎవరు? అన్న దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
నవ్వుతూ మంటపెట్టేస్తోందిగా
గత నాలుగు రోజులుగా హౌస్‌ని పరిశీలిస్తే.. తెలుగు బిగ్‌బాస్ మొత్తం సంజనా గల్రానీ చుట్టూనే తిరుగుతోంది. కుర్రాళ్లతో ఈమె ఏ రేంజ్‌లో ఆడుతుందోనని మొదట అంతా డౌట్ పడ్డారు. కానీ నాలుగు రోజులు తిరిగేసరికి హౌస్‌కి మెంటలెక్కించారు సంజన. నవ్వుతూ నవ్విస్తూనే తన మైండ్ గేమ్‌తో దూసుకెళ్తున్నారు ఈ ముద్దుగుమ్మ. ఆమె చేసే చిన్న చిన్న పనులకే ఇల్లు రగిలిపోతుండగా.. ఇక సీరియస్‌గా ఫోకస్ చేస్తే ఎవ్వరూ ఈమె దరిదాపుల్లోకి కూడా రారు అంటున్నారు బిగ్‌బాస్ లవర్స్.

కొట్టుకుంటుంటే సినిమా చూస్తూ
ఓ గుడ్డు దొంగతనం చేసి సంజన తినేసింది. తప్పు చేసినప్పటకి ఎవ్వరికి తగ్గకుండా, ఒక్కొక్కరిని గొడవలో ఇన్వాల్వ్ చేసింది. 14 మంది కంటెస్టెంట్స్ తన గురించి తన్నుకు చస్తుంటే.. తను మాత్రం ఓ మూలన కూర్చొని సినిమా చూసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నామినేషన్స్ రోజున కామనర్స్‌కి సెలబ్రెటీలను నేరుగా నామినేట్ చేసే పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో వారు మరో ఆలోచన లేకుండా సంజన పేరును చెప్పారు. తొలివారమే నామినేషన్‌లోకి రావడంతో ఈమె డేంజర్ జోన్‌లోకి వచ్చేస్తుందని అంతా భావించారు. కానీ రోజు గడిచేసరికి మొత్తం తిప్పేశారు సంజన. హౌస్‌లో అందరూ తన పేరునే పలుకుతున్నారు? గొడవలు జరిగితే అది తన వల్లే. ఎక్కడ పాయింట్ తీయాలో? ఎక్కడ సైలెంట్‌గా ఉండాలో అలా ప్రవర్తిస్తూ హైలైట్‌గా నిలిచారు.
14 మంది ఓ వైపు.. సంజన మరో వైపు
అందరూ గొడవ పడుతుంటే సినిమా చూసినట్లు చూసి.. ఆకలి వేసిందని, అడిగితే ఇవ్వరని నేనే గుడ్డు తిన్నానని ఒప్పుకుంది. తినేటప్పుడు కిచెన్‌లో ఉన్న భరణి, తనూజ కూడా చూశారని చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా రెచ్చిపోయారు. సైలెంట్‌గా ఉంటూ తన పని తాను చూసుకునే శ్రేష్టి వర్మ కూడా గుడ్డు తినడానికి సిగ్గు లేదా? మీ ముగ్గురు కలిసి మమ్మల్ని ఫూల్స్‌ని చేశారని భరణిపై మండిపడింది. దాంతో భరణి కూడా రైజ్ అయ్యాడు. మొత్తం మీద ఒక్క గుడ్డుతో కథ మొత్తం మార్చేసింది సంజన.
తొలి కెప్టెన్‌గా
ఇదిలాఉండగా.. బిగ్‌బాస్ తెలుగు 9లో తొలి వారం హౌస్‌కి కెప్టెన్ ఎవరు? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేమంటే.. బిగ్‌బాస్ తెలుగు 9 తొలి కెప్టెన్‌గా సంజనా గల్రానీ నిలిచారట. కెప్టెన్ కోసం ఇచ్చిన టాస్క్‌లో సంజన గెలిచారట. దీంతో ఫుల్ నెగిటివిటీలో ఉన్న ఆమె, హౌస్ మొత్తం వ్యతిరేకించిన ఆమె కెప్టెన్ కావడం ఏంటంటూ నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎవరైతే తనను మెయిన్ హౌస్‌లోకి రానివ్వలేదో, గుడ్డు తింటే రంకెలు వేశారో? వారందరికీ షాక్ ఇస్తూ హౌస్‌కి కెప్టెన్‌గా, అన్ని సౌకర్యాలు ఉన్న కెప్టెన్ రూమ్‌లో ఎంజాయ్ చేయనున్నారు. సంజన కెప్టెన్ కావడంతో నామినేషన్స్ నుంచి సేవ్ కానుంది. సాధారణ కంటెస్టెంట్‌గా ఉంటేనే అందరినీ ఓ ఆట ఆడుకున్న సంజన.. ఇప్పుడు కెప్టెన్‌గా ఎలాంటి పావులు కదుపుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











