»   » నన్ను గ్యాంగ్ రేప్ చేసారు: బిగ్‌బాస్ 6 పోటీదారు

నన్ను గ్యాంగ్ రేప్ చేసారు: బిగ్‌బాస్ 6 పోటీదారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బిగ్ బాస్ 6 రియాల్టీ షోలో పాల్గొన్న హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవానీ ఇంత కాలం దిగమింగుతూ వచ్చిన ఓ విషయాన్ని బయట పెట్టింది. 24 ఏళ్ల వయసులో తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఆమె వెల్లడించారు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఫేస్ బుక్ పేజీలో తన వ్యక్తిగత జీవితంలోని ఈ విషాద సంఘటన గురించి వివరించారు. ఈ విషయం తాను ఇప్పుడు బయట పెట్టడానికి కారణం....జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగాలని మహిళా లోకానికి చాటి చెప్పడానికే అన్నారామె.

చిన్నతనంలో బాంద్రాలో నన్ను అందరూ తిరుగుబోతు అని పిలిచేవారు. అపుడు నేను బైక్ నడిపేదాన్ని, సిగరెట్లు కాల్చేదాన్ని, మందు కొట్టేదాన్ని. ఇవన్నీ చేయడం వల్లనే నాకు ఆ ముద్ర పడిందంటే నేనేమీ బాధ పడను. తండ్రి చనిపోయాక షికాగో వెళ్లి అక్కడ సెటిలయ్యాను. అక్కడ క్రిస్మస్ సందర్భంగా ఒంటరిగా షికాగోలోని ఒక బార్ కు వెళ్లాను. పొట్టి స్కర్ట్... పెదాలకు ఎర్రరంగు లిప్ స్టిక్ ఉన్న నన్ను కొంతమంది దుండగులు తుపాకీతో బెదిరించి నాపై అత్యాచారం చేశారు.

Sapna Bhavnani says she was gangraped

ఈ దుర్ఘటన నా మదిని ఎపుడూ తొలుస్తూనే ఉంటుంది...అంతమాత్రాన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఒక్కోసారి నాకేనా ఇలా జరిగిందని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండా జరిగిపోతాయి. ఇన్నిరోజుల పాటు ఈ విషాదాన్ని నాలో నేను దిగమింగాను. అంతకుమించి నాకు వేరే ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి వెల్లడించానికి నాకు 20 ఏళ్లు పట్టింది. కానీ ఇపుడు పరిస్థితులు మారాయి. ఇపుడిలాంటి వాటిపై స్పందించాల్సిన అవసరం ఉంది'' అని ఆమె తెలిపారు.

English summary
Sapna Bhavnani shared a horrifying experience of being gangraped at gunpoint in Chicago on Christmas eve when she was 24.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu