For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dancee Plus షోలో దీప్తి హాట్ షో... ''ఇంత కన్నా దారుణాలు తట్టుకున్నా'' అంటూ షన్నూ కామెంట్స్!

  |

  సొషల్ మీడియా స్టార్ సెలబ్రిటీస్ దీప్తి సునయన, షణ్ముఖ్ గురించి సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉండే అందరికీ తెలిసిందే. దీప్తి సునయన సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో సెలబ్రిటీగా మారగా వైవా షార్ట్ ఫిలింతో అలాగే ఫేమస్ అయ్యాడు. ఇక దీప్తి క్రేజ్ తో బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనీష్ తో ఎఫైర్ ఉన్నట్లు భ్రమ కల్పించినా ఎక్కువగా దీప్తి, షన్ముఖ్ ల మధ్య ప్రేమాయణం ఉందని ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే తాజాగా దీప్తి గురించి కామెంట్ చేయగా దానికి ఆసక్తికరంగా స్పందించాడు షన్ముఖ్. ఆ వివరాల్లోకి వెళితే

  Photos: South Indian Celebrities With Their Tattoos

  డాన్స్ ప్లస్ క్రేజ్

  డాన్స్ ప్లస్ క్రేజ్

  స్టార్‌ మాలో విజయవంతంగా ప్రసారమవుతున్న ‘డాన్స్ ప్లస్' షో ఫైనల్ నిన్న ప్రసారం అయింది. టైటిల్ ఎవరు గెలుస్తారు అన్న ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించి చివరికి విన్నర్ ను ప్రకటించారు. ఈ ఫైనల్స్‌లో టోనీ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌), సంకేత్‌ సహదేవ్‌ (యశ్వంత్‌ మాస్టర్‌ టీమ్‌), మహేశ్వరి - తేజస్విని (బాబా మాస్టర్‌టీమ్‌), జియా ఠాకూర్‌ (అనీ మాస్టర్‌టీమ్‌), డార్జిలింగ్‌ డెవిల్స్‌ (రఘు మాస్టర్‌టీమ్‌) పోటీపడ్డారు. చివరికి సీజన్‌ విజేతగా సంకేత్‌ సహదేవ్‌ నిలువడంతో, 20 లక్షల రూపాయల బహుమతి కూడా గెలుచుకున్నారు.

  Viral Photoshoot of Kochi Photographer Couple Wedding With 50 Guest Photos

  దీప్తితో పాటు వాళ్ళు కూడా

  ఇక ట్రోఫీని శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా అందించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రతిభ గల డాన్సర్లకు ఈ డాన్స్ ప్లస్ ఓ మంచి మంచి వేదిక కల్పించింది. పాన్ ఇండియా డాన్స్ షో గా ప్రేక్షకుల అభిమానాన్ని ఆశీర్వాదాన్ని అందుకుంది. ఇక ఫినాలేలో అలరించేందుకు బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన, స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ "జానకి కలగనలేదు" హీరో అమర్దీప్, "జాతిరత్నాలు" సినిమా హీరోయిన్ ఫారియా అబ్దుల్లా, ప్రముఖ నాట్యకారిణి సంధ్య రాజు, నటాషా దోషి ఫైనల్స్ ని పాల్గొన్నారు.

  ఇంతకన్నా దారుణాలు తట్టుకున్న గుండె

  ఇంతకన్నా దారుణాలు తట్టుకున్న గుండె

  డాన్స్ ప్లస్ లోనే దీప్తి సునైనా కూడా ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అందులో ఆమె కాస్త రెచ్చిపోయి, డ్యాన్సర్ తో క్లోజ్ గా డాన్స్ వేసింది. నిజానికి కళాకారిణి కాబట్టి ఇది సహజం. కానీ నెటిజన్లు, కొందరు మీమర్స్ ఈ అంశంలో షన్ముఖ్ ని లాగి ఆయన బాధ పడుతున్నాడనే విధంగా మీమ్స్ వేశారు, కామెంట్లు చేశారు.

  నిన్న అనుకోకుండా చాట్ సెషన్ నిర్వహించిన ఆయన ఈ అంశం మీద స్పందించాడు. డాన్స్ ప్లస్ లో నిన్న దీప్తి డాన్స్ చేస్తే మీకు చాలా మీమ్స్ వచ్చాయి అనుకుంటా, అని ఒక నెటిజన్ అడగగా, కొత్తగా ఏమీ అనిపించలేదు ఇంతకన్నా దారుణాలు తట్టుకున్న గుండె ఇది ఇవన్నీ ఎంత అంటూ షణ్ముఖ్ అసక్తికరంగా స్పందించాడు.

  సూర్య కోసం వెయిటింగ్

  సూర్య కోసం వెయిటింగ్

  ఇక షణ్ముఖ్ ప్రస్తుతం సూర్య అనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే, ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. విడుదలైన దాదాపు అన్ని ఎపిసోడ్ లు మిలియన్స్ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎనిమిదో ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అని అడుగగా నేను కూడా షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నానని, జూన్ మొదటి వారంలో షూట్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

  ప్రేమలో ఉన్నారా

  ప్రేమలో ఉన్నారా

  ఇక షణ్ముఖ్ ఎక్కువగా దీప్తి సునయనతో వీడియోలు చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని ప్రచారం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇద్దరూ ఈ అంశం మీద ఇప్పటిదాకా స్పష్టమైన వ్యాఖ్యలు ఏమీ చేయక పోయినప్పటికీ వీరిద్దరి మధ్య కచ్చితంగా ప్రేమ ఉందని అందరూ భావిస్తూ ఉంటారు.

  English summary
  A popular YouTuber Shanmukh Jaswanth, rumoured boy friend of ex Bigg Boss 4 Telugu contestant Deepthi Sunaina made some intresting comments about her performence in latest dance plus show finale.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X