For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shanmukh Jaswanth కాలికి గాయం.. 'స్వీట్‌ అండ్‌ రాడ్‌ మెమోరీ' అంటూ!

  |

  బిగ్‌బాస్‌ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ జస్వంత్ ముందు చాలా క్రేజ్ తో హౌస్ లో అడుగు పెట్టాడు. కానీ సిరితో స్నేహం సహా అనేక కారణాలతో ఆయన చాలా నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. అతని ప్రియురాలు కూడా బ్రేకప్ చెప్పగా ఇప్పుడు గాయాలతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  చాలా వీక్ పెర్ఫార్మెన్స్

  చాలా వీక్ పెర్ఫార్మెన్స్

  బిగ్ బాస్ సీజన్ 5 లో టైటిల్ ఫేవరెట్ గా అడుగుపెట్టిన యూట్యూబర్, షార్ట్ ఫిలిం హీరో షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఆరేడు వారాలు కేవలం మోజ్ రూమ్ కే పరిమితమై టాస్క్ లలో చాలా వీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎంత సేపు కూర్చుని ఉండడానికి చూసే అతను ఎక్కువగా తన చేతకాని తనాన్ని జెస్సి, సిరి ల ఫ్రెండ్ షిప్ మీద నెట్టేవాడు. బయట చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా విన్నర్ గా బిగ్ బాస్ సీజన్ 5 ట్రోఫీ వచ్చేస్తుంది అనుకున్నాడు.

  హ్యాండ్ ఇచ్చి

  హ్యాండ్ ఇచ్చి


  అయితే అనూహ్యంగా ఆట చివరికి వచ్చేసరికి కానీ షణ్ముఖ్ జస్వంత్ కి ఫ్యాన్స్ కూడా షాకిచ్చారు. షణ్ముఖ్ సిరి తో చేసే ఓవరాక్షన్ భరించలేక బుల్లితెర ప్రేక్షకులయితే ఎప్పుడు పోతాడురా బాబు అని ఎదురు చూసారు. టాస్క్ ల పరంగా వీక్, యాటిట్యూడ్, సిరి తో అతి ఫ్రెండ్ షిప్, సిరి మీద అరవడం, వేరే కంటెస్టెంట్స్ తో కలవకపోవడంతో అప్పటి దాకా షణ్ముఖ్ కి ఉన్న క్రేజ్ మొత్తం బిగ్ బాస్ గంగలో కలిపి నట్టయింది, ఇక సిరితో హగ్గులు, కిస్ లు మాములుగా లేకపోవడంతో గర్ల్ ఫ్రెండ్ కూడా ఆయనకు హ్యాండ్ ఇచ్చి బ్రేకప్ చెప్పింది.

   ఐస్‌ టాస్క్‌ అయితే

  ఐస్‌ టాస్క్‌ అయితే

  ఇక మరో పక్క ఈ బిగ్ బాస్ లో కొన్ని టాస్కులు కాస్త కఠినంగానే ఉంటాయన్న సంగతి తెలిసిందే. అన్ని తెలిసే లోపలికి వెళ్తారు కాబట్టి కొన్నిసార్లు దెబ్బలు కూడా ఓర్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయినా కంటెస్టెంట్స్‌ వాటిని పట్టించుకోకుండా టాస్క్‌ని సీరియస్‌గా తీసుకొని ఆడితేనే గెలిచి బయటకు వస్తారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్లో టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ ఇచ్చిన ఐస్‌ టాస్క్‌ అయితే దారుణమనే చెప్పాలి.

  పాదాలు కమిలిపోయాయి

  పాదాలు కమిలిపోయాయి


  ఈ ఐస్ టాస్క్ వల్ల సిరి, శ్రీరామచంద్రల పాదాల చర్మం ఊడిపోయి కాళ్లు ఎరుపెక్కాయి. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు అంటున్నారా? ఆ టాస్క్‌లో సిరి, శ్రీరామ్‌ మాత్రమే కాదు.. షణ్ముఖ్‌ కూడా తీవ్రంగా గాయపడినట్లు తాజాగా వెల్లడైంది. ఐస్‌లో అతను కూడా నిలబడి గేమ్ ఆడి ఉండడం వల్ల అతని పాదాలు కూడా కమిలిపోయాయి. తాజాగా దానికి సంబంధించిన ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశాడు షన్ను.

   సోషల్‌ మీడియాలో వైరల్‌

  సోషల్‌ మీడియాలో వైరల్‌

  దానికి .. 'స్వీట్‌ అండ్‌ రాడ్‌ మెమోరీ' అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే అది బిగ్‌బాస్‌ హౌస్‌లో తగిలిన గాయమా.. లేదా ఇప్పుడు బయటజయ్ వచ్చాక అయిన గాయమా అనేది తెలియాల్సి ఉంది. దీప్తి సునైనాతో బ్రేకప్‌ తర్వాత షణ్ముఖ్‌ తన కెరీర్ మీద దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. వరుస అవకాశాలు వస్తున్నాయని, త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తానంటూ షణ్ముఖ్‌ తన ఫాన్స్ మీట్ లో ప్రకటించాడు.

  English summary
  Shanmukh Jaswanth shares his leg injury through social media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X