ప్రియాంక జైన్‌కు లవర్ మోసం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన శోభాశెట్టి!
బిగ్‌బాస్, సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించిన నటీనటులు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు. వారిలో ప్రియాంక ఎం జైన్ కూడా ఒకరు. తెలుగు బుల్లితెరపై హల్‌చల్ చేసిన ఈ అమ్మడు.. బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. పలు సినిమాలలోనూ నటించి ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియాంక పెట్టిన పోస్ట్ తాజాగా వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే...
తమిళ ఇండస్ట్రీతో ఎంట్రీ
ముంబైలో పుట్టి పెరిగిన ప్రియాంక జైన్ .. ఆ తర్వాత బెంగళూరులో చదువుకున్నారు. నటనపై ఆసక్తితో చదువు తర్వాత ఈ దిశగా అడుగులు వేశారు. 2015లో సినీరంగం నుంచి పిలుపు రావడంతో తమిళ చిత్రం రంగి తరంగలో నటించారు. ఈ సినిమాతో ప్రియాంకకు కన్నడ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. 2016లో గోలిసోడాలో నటించిన ప్రియాంక.. ఆ తర్వాత 2018లో చల్తే చల్తే చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

అమ్ములుగా అద్భుతమైన నటన
సినిమాలతో పాటు బుల్లితెరపైనా తన అదృష్టం పరీక్షించుకున్నారు ప్రియాంక. 2017లో స్టార్ మాలో ప్రసారమైన మౌనరాగం ద్వారా తెలుగు టెలివిజన్ రంగంలో అడుగుపెట్టారు. ఇందులో అమ్ములు అనే పాత్రలో ఒదిగిపోయారు. సీరియల్స్‌తో సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది ప్రియాంక ఎం జైన్.. ఎవడూ తక్కువ కాదు, వినరా సోదర వీర కుమార వంటి సినిమాలతో పాటు యూ గాట్ మీ గర్ల్, సితార, సోచ్ వంటి వెబ్‌సిరీస్‌లలోనూ అలరించింది. నటిగా పాపులారిటీతో రావడంతో బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది. తన వ్యక్తిత్వం, మైండ్ గేమ్, దూకుడుతో ఫైనల్ చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది.
శివకుమార్‌తో ప్రేమాయణం
శివకుమార్ అనే బుల్లితెర నటుడితో ప్రేమలో పడిన ప్రియాంక అతనితో రిలేషన్‌లో ఉన్నారు. ఇద్దరూ కలిసి వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఏ సీరియల్‌లోనూ కనిపించడం లేదు. కొద్దిరోజుల క్రితం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు వెళ్లిన ఈ జంట పుణ్యస్నానాలు ఆచరించింది. అలాగే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. ఈ ఏడాది జూన్‌లో శివకుమార్‌కు ప్రపోజ్ చేసిన ప్రియాంక.. తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది.
జంటగా వరలక్ష్మీ వ్రతం
ఈ ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల శ్రావణ మాసంలో ప్రియాంక - శివకుమార్‌లు జంటగా వరలక్ష్మీ వ్రతం చేసుకుని దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అయితే పెళ్లి కాకుండానే దంపతుల మాదిరిగా ఇలాంటి పూజలు చేయడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు వీరిద్దరిని ఏకిపారేశారు. అయినప్పటికీ ఎవ్వరినీ పట్టించుకోకుండా తమ దారిన తాము నడుస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటారు ప్రియాంక జైన్. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది.
ఇరికించిన శోభాశెట్టి
ఇందులో శివకుమార్ కారులో వస్తుండగా కార్తీక దీపం ఫేమ్ శోభాశెట్టి రోడ్డుపై నిలబడి లిఫ్ట్ అడుగుతుంది. దాంతో కారు ఆపిన శివకుమార్‌ను నన్ను అక్కడి వరకు డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది శోభాశెట్టి. ఆ వెంటనే కారెక్కి మీరు ఎక్కడ ఉంటారు? ఆర్ యూ సింగిల్ అని అడుగుతుంది. దానికి శివకుమార్ సింగిల్ అని చెబుతాడు. దాంతో శోభాశెట్టి ఫోన్ తీసుకుని ప్రియాంకకు ఫోన్ చేసి .. బడ్డీ మీ వాడు సింగిల్ అంట్రా అని చెబుతుంది. ఆ మాట వినగానే ప్రియాంక ఏంటీ అని కోపంగా అడుగుతుంది. దాంతో శివకుమార్ భయంతో వణికిపోగా అతని మెడలో దండపడి, హారతి ఇస్తున్నట్లుగా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











