అన్నా అంటే అలా బిహేవ్ చేశాడు.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై శ్రష్టి వర్మ షాకింగ్ కామెంట్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో నుంచి తొలివారం నామినేట్ అయింది. ఈ షోలో టాప్ 5 వరకు వస్తుందని ఆశించిన పాపులర్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఆడియెన్స్ ఆదరణ పొందలేకపోవడం, అలాగే భారీగా ఓట్లు సాధించలేకపోవడం వల్ల ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అయితే ఉత్కంఠ భరితంగా సాగిన ఎలిమినేషన్ ప్రక్రియలో చివరకు వరకు నామినేషన్‌లో ఉన్న డీమాన్ పవన్ సేఫ్ కావడం, శ్రష్టివర్మ ఎలిమినేట్ కావడంతో ఆమె జర్నీ అర్ధాంతరంగా ముగిసింది. అయితే ఎలిమినేషన్ తర్వాత ఆమె వేదికపైకి వచ్చి నాగ్‌తో మాట్లాడుతూ ఎమోషనల్‌గా మారి కంటతడి పెట్టుకొని ఓ కంటెస్టెంట్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రష్టి వర్మ చేసిన కామెంట్స్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు లో తొలి ఎలిమినేషన్ తర్వాత నాగ్‌తో కలిసి తన జర్నీని చూసి కొంత భావోద్వేగానికి గురయ్యారు. అయితే స్మాల్ అండ్ క్యూట్ జర్నీ అంటూ నాగ్ ప్రశంసించారు. ఆ తర్వాత ఆమెతో ఓ గేమ్‌ను ఆడించారు. ఇంటిలో తనకు నచ్చిన.. ఫెయిర్ గేమ్ ఆడే నలుగురు కంటెస్టెంట్లు, అలాగే నచ్చని కంటెస్టెంట్లను పెట్టమని నాగ్ అడిగితే.. రాము రాథోడ్, మర్యాద మనీష్, హరిత హరీష్, ఆశా సైనీ జెన్యూన్‌గా ఆడుతున్నారు. వారితో తనకు కలిగిన వైబ్ నిజాయితీతోను, నమ్మకంతోను అని చెప్పింది.

ఇక తనకు నచ్చని వారు.. అలాగే బయటకు ఒకలా.. లోపల ఒకలా ద్వంద ప్రమాణాలను పాటించే వారిలో రీతూ చౌదరీ ఫస్ట్ ఉంటుంది. ఆ తర్వాత తనూజా గౌడ, భరణి ఉంటారు. కెమెరా ముందు ఒకలా.. కెమెరా లేకుంటే ఒకలా ఉంటారు. ఒక మనిషి ఉంటే ఒక ప్రవర్తన, ఆ వ్యక్తి లేకపోతే మరోలా బిహేవ్ చేస్తారు. ఏది ఏమైనా జీవితంలో నిజాయితీ, నమ్మకం ముఖ్యం. వాటిని అనుసరించాలి అని శ్రష్టి వర్మ అన్నారు.
ఇదిలా ఉండగా, భరణి శంకర్‌పై దారుణంగా కామెంట్స్ చేశారు. ఆయన ఇంట్లోకి వచ్చిన వెంటనే ఆయన ప్రవర్తన, సీనియారిటీని చూసి తన అన్నగా భావించాను. నాకు సోదరులు లేరు. కాబట్టి ఆయనకు నా మనసులో అలాంటి స్థానం అందించాను. కానీ నేను అన్న అని పిలిస్తే, నాతో అలా బిహేవ్ చేయలేదు. అది నాకు నచ్చలేదు. ఓ వ్యక్తి మీద నాకు నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు అంటూ భరణిపై సీరియస్ ఆరోపణలు చేసింది. కాసేపు కంటతడి పెట్టుకొంటూ ఎమోషనల్ అయింది.
అనంతరం ఇంటి నుంచి బయటకు నిష్క్రమించే సమయంలో ఇంటిలోని ఓ వ్యక్తిపై బిగ్ బాంబు వేయాలి అనే టాస్క్‌ను ఆమెకు అప్పగించారు. ఆ టాస్క్ ప్రకారం.. ఇంటిలో తనకు అప్పగించిన పనిని ఎవరికైనా ఇవ్వాలి అంటూ నాగార్జున చెబితే.. తాను ఇంటిలో క్లీనింగ్ పనులు చేస్తాను. కాబట్టి ఆ పనిని ఖాళీగా ఉన్న సుమన్ శెట్టికి అప్పగిస్తాను అని చెప్పారు. దాంతో ఆ పనిని ఆయన స్వీకరించారు. ఆ తర్వాత అందరికి గుడ్ బై చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇలా ఆమె ప్రయాణం బిగ్‌బాస్‌లో తక్కువగా ముగిసింది.


Click it and Unblock the Notifications











