For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu: షోలో మరో రచ్చ.. అర్జున్ రెడ్డి రేంజ్ రొమాన్స్.. ఆమెను అమాంతం మీదకు లాక్కుని!

  |

  ఊహకే అందని టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. ప్రేమలు.. కొట్లాటలు ఇలా ఎన్నో రకాల ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగుతూ తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే మన షో ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్‌లో నిలుస్తోంది. ఈ కారణంగానే నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను నడుపుతున్నారు. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య అర్జున్ రెడ్డి రేంజ్ రొమాన్స్ గురించిన సీక్రెట్ బయటకు వచ్చింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

  కొత్తగా చూపించిన ఫలితం లేదు

  కొత్తగా చూపించిన ఫలితం లేదు

  తెలుగు బుల్లితెరపై ఒక్క బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. అందుకే నిర్వహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాదీ ఓ సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆరో సీజన్‌ను నడిపిస్తున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను తీసుకొస్తున్నారు. కానీ, దీనికి ఆశించిన రీతిలో రేటింగ్ మాత్రం సొంతం కావడం లేదు.

  Rashmika Vijay Marriage: సీక్రెట్‌గా రష్మిక, విజయ్ పెళ్లి.. ఫొటో వైరల్.. మరీ ఇంతకు తెగించారేంటి!

  లవ్ ట్రాక్‌లు.. ఫుల్‌గా పాపులారిటీ

  లవ్ ట్రాక్‌లు.. ఫుల్‌గా పాపులారిటీ

  బిగ్ బాస్ షోలో ఎక్కువగా హైలైట్ అయ్యేది కంటెస్టెంట్ల మధ్య ఏర్పడే లవ్ ట్రాకులే అని చెప్పుకోవచ్చు. వాళ్ల మధ్య లవ్ ఉన్న లేకున్నా.. నిర్వహకులు మాత్రం జోడీలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ప్రతి సీజన్‌లోనూ కనీసం ఒక్క జంటనైనా హైలైట్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఈ షో వల్ల ఎంతో మంది జంటలుగా మారి ఫుల్ పాపులారిటీని అందుకున్నారు.

  వాళ్లిద్దరూ జంటగా రచ్చ చేశారు

  వాళ్లిద్దరూ జంటగా రచ్చ చేశారు


  సాధారణంగా బిగ్ బాస్ షో ప్రతి సీజన్‌లోనూ లవ్ ట్రాక్‌లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆరో సీజన్‌లోనూ పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలకు రొమాంటిక్ టాస్కులు ఇచ్చి రచ్చ చేస్తున్నారు. అయితే, ఒక ఇద్దరు మాత్రం ఆరంభం నుంచే జంటగా సందడి చేశారు. వాళ్లెవరో కాదు.. ఆర్జే సూర్య, ఆరోహి రావు. బయటే క్లోజ్ ఫ్రెండ్ కావడంతో హౌస్‌లోనూ వీళ్లిద్దరూ జోడీగా రచ్చ చేశారు.

  బ్రాతో యాంకర్ శ్రీముఖి తెగింపు: ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!

  హగ్గులు.. ముద్దులతో జంటగానే

  హగ్గులు.. ముద్దులతో జంటగానే

  వాస్తవంగా ఆర్జే సూర్య, ఆరోహి రావులు దాదాపు మూడేళ్లుగా స్నేహితులుగా కొనసాగుతున్నారు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ హౌస్‌లో కూడా చాలా క్లోజ్‌గా ఉన్నారు. అయితే, వీళ్లు ఫ్రెండ్స్‌కు తక్కువ, లవర్స్‌కు ఎక్కువలా ప్రవర్తించారు. ఇందులో భాగంగానే తరచూ హగ్గులు ఇచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం.. అలగడం.. వంటివి చేసి హైలైట్ అయిపోయారు.

  ఆమె ఎలిమినేట్... ఆ టాస్కులో

  ఆమె ఎలిమినేట్... ఆ టాస్కులో

  ఆర్జే సూర్యతో హౌస్‌లో వ్యవహరించిన తీరు వల్లే ఆరోహి రావు నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఇక, వీళ్లిద్దరి మధ్య జరిగిన కొన్ని అంశాలను చూపిస్తూ గత వారంలో జరిగిన ఓ టాస్కులో గీతూ రాయల్, ఫైమా ఓ స్కిట్ చేశారు. అందులో ఆర్జే సూర్య, ఆరోహిని మీదకు లాక్కుని రొమాన్స్ చేసినట్లు గీతూ యాక్టింగ్ చేసి చూపించింది. దీంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

  షర్ట్ విప్పేసిన యాంకర్ మంజూష: హాట్ షోలో అస్సలు తగ్గట్లేదుగా!

  గీతూను నామినేట్ చేసిన శ్రీహాన్

  గీతూను నామినేట్ చేసిన శ్రీహాన్


  తాజాగా జరిగిన నామినేషన్స్ టాస్కులో శ్రీహాన్.. 'గీతూ స్కిట్'పై స్పందించాడు. 'మొన్న నువ్వు, ఫైమా చేసిన స్కిట్‌ కొంచెం ఓవర్‌గా అనిపించింది. ఇక్కడ సూర్యకు పర్లేదు. బయట ఆ అమ్మాయి (ఆరోహి) పరిస్థితి ఏంటి? తనకు ఎలా ఉంటుందో నాకు తెలుసు. నీ యాక్టింగ్ కొంచెం ఓవర్‌గా అనిపించింది. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా' అని గీతూపై సీరియస్ అయ్యాడు.

  గీతూ క్లారిటీ.. సారీ చెప్పేసింది

  గీతూ క్లారిటీ.. సారీ చెప్పేసింది


  శ్రీహాన్ చెప్పిన దానిపై గీతూ రాయల్ స్పందించింది. 'అయ్యే సామీ.. నేను మీదకు లాక్కోని రొమాన్స్ చేసినట్లు చెప్పినా. కానీ, సూర్య అలా లాగలేదు. అయితే, ఆరోహిని పక్కకు లాక్కోవడం చాలా సార్లు చూశాను. మొత్తానికి ఇందులో నాది తప్పు ఉంది. ఇప్పుడే రియలైజ్ అవుతున్నా. ఈ విషయంలో మాత్రం సూర్యకు సారీ. అలాగే అందరికీ సారీ చెబుతున్నా' అని చెప్పుకొచ్చింది.

  English summary
  Bigg Boss Telugu 6th Season Was Running Sucessfully. Shrihan Serious on Geetu about Arohi Rao and RJ Surya Romantic Skit in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X