Don't Miss!
- Lifestyle
Sickle Cell Anemia: సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి? లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
- Technology
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- News
Union Budget 2023: మహిళలకు కొత్త స్కీమ్.. సీనియర్ సిటిజన్లకు, గృహ కొనుగోలుదారులకు శుభవార్త!!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss: విజేతగా నిలిచిన శ్రీహాన్.. అన్ని లక్షల ప్రైజ్ మనీ సొంతం.. నక్కతోక తొక్కేశాడా ఏంటి!
తెలుగు టెలివిజన్ రంగంలోనే అత్యధిక రేటింగ్‌ను రాబట్టడంతో పాటు నేషనల్ రేంజ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. అలా ఇప్పుడు ఆరో సీజన్‌ను కూడా పూర్తి చేసుకోడానికి సిద్ధంగా ఉంది. ఇక, నేడే (డిసెంబర్ 18 ఆదివారం) గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా స్ట్రాంగ్ ప్లేయర్ శ్రీహాన్ విజేతగా నిలిచాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

ఆరంభం నుంచే హైలైట్‌గా
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో శ్రీహాన్ కూడా ఒకడు. ఈ సీజన్ ఆరంభంలోనే అతడు తనదైన ఆటతీరు, మాటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించి స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా తన టాలెంట్లతో సత్తా చాటాడు. మధ్యలో కొన్ని పొరపాట్లు చేసినా చివరి వరకూ నెగ్గుకొచ్చాడు.
గ్లామర్ కంచె తెంచేసిన కాజల్: డెలివరీ తర్వాత తొలిసారి యమ హాట్‌గా!

టికెట్ గెలిచి ఫినాలేకు చేరి
రెండు వారాల క్రితం జరిగిన టికెట్ టు ఫినాలే టాస్కులో శ్రీహాన్ విజయం సాధించాడు. తద్వారా నేరుగా ఫినాలేలోకి అడుగు పెట్టిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. దీంతో చివరి వారం అతడు నామినేషన్స్‌లో కూడా లేడు. ఇక, టాప్ 5కి చేరిన శ్రీహాన్ టైటిల్ రేసులో కూడా ఉన్నాడు. బయట ఫాలోయింగ్ ఉండడంతో అతడు ఈ సీజన్ గెలిచే ఛాన్స్‌లు ఉన్నాయని టాక్ వినిపించింది.

టైటిల్ బరిలో ఆ ఐదుగురు
గత సీజన్లు హిట్ అవడంతో బిగ్ బాస్ ఆరో సీజన్ ఎన్నో అంచనాలతో మొదలైంది. ఇందులోకి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో మొత్తంగా 15 మంది ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఆరుగురు సభ్యులు ఫినాలే వీక్‌లోకి రాగా.. వారిలో మిడ్ వీక్ శ్రీ సత్య వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు కీర్తి భట్, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఆది రెడ్డి మాత్రమే టైటిల్ రేసులో నిలిచారు.
డెలివరీ తర్వాత తెగించిన హీరోయిన్: ఎద అందాలు హైలైట్ చేస్తూ ఘోరంగా!

బిగ్ బాస్ విన్నర్, రన్నర్‌లు
బిగ్ బాస్ ఆరో సీజన్ విన్నర్ విషయంలో ఆరంభం నుంచీ ఓ టాక్ వచ్చేసింది. ఇందులో సింగర్ రేవంత్ మాత్రమే విజేతగా నిలిచే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఫినాలేలో అతడే విజేతగా నిలిచాడని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది. అలాగే, శ్రీహాన్ ఈ సీజన్ రెండో స్థానంలో నిలిచి సెకెండ్ రన్నరప్ అయ్యాడని తెలిసింది.
|
బీబీ జోడీల రాకతో సందడి
బిగ్ బాస్ ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం నుంచి అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో 'బీబీ జోడీ' షోలో పాల్గొనబోతోన్న జంటలు బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశాయి. వాళ్లందరి రాకతో నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఎంతో సరదాగా సాగింది. ఫలితంగా ఇది ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో మజాను కూడా పంచింది.
అఖండ హీరోయిన్ హాట్ సెల్ఫీ: ఓర్నాయనో ఆ డ్రెస్సేంటి బాబోయ్!

లెన్స్‌కార్ట్ విన్నర్‌గా శ్రీహాన్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో భాగంగా టైటిల్ స్పాన్సర్స్‌లో ఒకటైన లెన్స్‌కార్ట్ స్టైలిష్ ప్లేయర్ కాంటెస్ట్‌ను నిర్వహించింది. ఇందుకోసం తమ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ పోల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇక, ఈ పోటీలో శ్రీహాన్ విజయం సాధించినట్లు గత ఎపిసోడ్‌లో వెల్లడించారు. ఈ విషయాన్ని బిగ్ బాస్ అధికారిక లేఖ ద్వారా తెలపగా.. దాన్ని రేవంత్ చదివి అందరికీ వినిపించాడు.

అన్ని లక్షలు ప్రైజ్ మనీ
లెన్స్‌కార్ట్ స్టైలిష్ ప్లేయర్ కాంటెస్ట్‌లో విజయం సాధించిన శ్రీహాన్‌కు అవార్డుతో పాటు ఐదు లక్షలు రూపాయలు ప్రైజ్ మనీ కూడా దక్కినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన ట్రోఫీ, ప్రైజ్ మనీని ఆదివారం సాయంత్రం నుంచి జరగబోతున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో అందించబోతున్నట్లు తెలిసింది.