Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
గాయనికి చేదు అనుభవం.. స్టేజ్‌పై కౌగిలిలో నలిపేసి.. ముద్దుల్లో ముంచెత్తిన అభిమాని
జాతీయ టెలివిజన్ ఇండస్ట్రీలో ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన ఉంటుందనేది కాదనలేని వాస్తవం. పలు సీజన్లను గ్రాండ్‌గా పూర్తి చేసుకొన్న ఈ మ్యూజిక్ కార్యక్రమం మరోసారి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అను మాలిక్, విశాల్ దద్లానీ, గాయని నేహా కక్కర్ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ కార్యక్రమంలో నేహా కక్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇండియన్ ఐడల్ వేదికపై ఏం జరిగిందంటే..

ఇండియన్ ఐడల్ వేదికపై
ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ సెలక్షన్ కార్యక్రమంలో పలువురు ఔత్సాహిక గాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. చిన్న వయసులోనే అద్భుతమైన టాలెంట్‌ను వేదికపై చూపిస్తున్నారు. అలా కార్యక్రమం జోష్‌గా కొనసాగుతున్న సమయంలో గాయని నేహా కక్కర్ అభిమాని వేదికపైకి వచ్చాడు. రాజస్థానీ దుస్తులు ధరించి వచ్చిన యువకుడు ఆమె కోసం కొన్ని గిఫ్టులు తీసుకొచ్చాడు.

అభిమానికి చేరువై.. చిన్న కౌగిలింతతో
నేహా కక్కర్ అభిమానిని అని చెప్పడంతో గాయని కూడా సంతోషంలో మునిగిపోయింది. గిఫ్టులను తీసుకోవడానికి వెళ్లిన నేహా కక్కర్ వాటిని స్వీకరించి ఆనందంలో మునిగిపోయింది. ఆ క్రమంలో చిన్న కౌగిలింత ఇవ్వడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో నన్ను గుర్తుపట్టావా అంటూ అడగడం వీడియోలో వినిపించింది. ఆ క్రమంలో దగ్గరకు వచ్చిన అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించి గట్టిగా వాటేసుకొన్నాడు. అనుమాలిక్, విశాల్, ఇతర యాంకర్లు చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది.
|
బలవంతంగా ముద్దుతో
గాయని నేహా కక్కర్‌ను అభిమాని కౌగిలి బంధించి అతలాకుతలం చేశాడు. ఏకంగా బుగ్గపై ముద్దు పెట్టుకోవడంతో వేదిక చుట్టు పక్కలంతా గంభీరంగా మారిపోయింది. తనను బలవంతంగా ముద్దు పెట్టుకొన్నాడనే విషయం అర్థం అయ్యేసరికి నేహా కక్కర్ షాక్‌లో మునిగిపోయింది. స్టేజ్ మీద అనుమాలిక్, విశాల్ దిగ్బ్రాంతికి గురయ్యారు.

షాక్‌లో నేహా కక్కర్
అభిమాని చేసిన పనికి నేహా కక్కర్ షాక్‌లో మునిగి కన్నీరు పెట్టుకొనేంత స్థితిలో మునిగిపోయింది. దాంతో అందరూ వచ్చి ఆమెను ఓదార్చడంతో కాస్త రిలీఫ్ అయ్యారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ఐడల్ కార్యక్రమంతో నేహా కక్కర్‌కు ఎంతో అనుబంధం ఉంది. గత సీజన్ నుంచి ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇండియన్ ఐడల్ సీజన్ 2లో నేహా కంటెస్టెంట్‌గా కూడా ఉన్నారు. ఆ తర్వాత అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించడం గమనార్హం.