For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: టీషర్ట్ విప్పేసి రచ్చ చేసిన కంటెస్టెంట్.. వెకిలి పనితో పరువు గోవిందా!

  |

  రియల్ కంటెంట్‌ ఆధారంగా ప్రసారం అవుతూ.. ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలతో, దిమ్మతిరిగే ట్విస్టులతో సాగిపోతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను తీసుకొస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోందీ రియాలిటీ షో. ఈ కారణంగానే తెలుగులో ఇది ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్ కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో రేవంత్ ఊహించని ప్రవర్తనతో అందరికీ షాకిచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందో ఆ సంగతులను మీరే చూడండి!

  వాటిని దాటాలని.. బెడిసికొట్టింది

  వాటిని దాటాలని.. బెడిసికొట్టింది

  తెలుగులో అన్ని సీజన్లను సక్సెస్ అవడంతో ఆరో దానిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా నడుపుతున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో సరికొత్త టాస్కులు, రొమాన్స్, ప్రేమ కహానీలు సహా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తున్నారు. కానీ, ఆరో సీజన్‌కు మాత్రం ఆశించిన రీతిలో రేటింగ్ సొంతం కావట్లేదు.

  డెలివరీ తర్వాత షాకింగ్‌గా సోనమ్: ఎద అందాలు చూపిస్తూ దారుణంగా!

  టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన స్టార్

  టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన స్టార్


  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. అందులో సింగర్ రేవంత్ ఒకడన్న విషయం తెలిసిందే. సింగర్‌గా టాలీవుడ్‌లో సత్తా చాటిన అతడు.. ఇండియన్ ఐడల్‌ కూడా గెలిచాడు. దీంతో భారీ అంచనాలతో వచ్చాడు.

  మొదట్లోనే అలాంటి పేరు వల్ల

  మొదట్లోనే అలాంటి పేరు వల్ల


  ఆరో సీజన్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే సింగర్ రేవంత్ తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. వాటిలో తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. కానీ, తరచూ కోపంతో గొడవలు పెట్టుకుంటున్నాడు. దీంతో ఆరంభంలోనే అతడు కోపిస్టి అనే పేరును తెచ్చుకున్నాడు. ఇది అతడికి మైనస్‌గా మారిందనే చెప్పాలి.

  Nitya Menon Pregnant: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నిత్యమీనన్.. బిడ్డకు తండ్రి ఎవరంటే?

  గొడవలతో రేవంత్‌పై విమర్శలే

  గొడవలతో రేవంత్‌పై విమర్శలే


  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రేవంత్‌కు ఓటింగ్ బాగానే పడుతుంది. దీంతో ఇప్పటికే కొన్ని వారాలు నామినేషన్స్‌లో ఉన్నా సేఫ్ అయ్యాడు. దానివల్ల కాన్ఫిడెన్స్ పెరిగిందో ఏమో కానీ, అతడు తరచూ తన ప్రవర్తనతో రెచ్చిపోతోన్నాడు. అందరిపై అరిచేయడం, నేను చెప్పిందే కరెక్ట్ అనేట్లు వ్యవహరించడం, ఎదుటి వాళ్లను తక్కువ చేయడం వంటివి చేస్తూ విమర్శల పాలు అవుతున్నాడు.

  స్పాన్సర్స్ టాస్క్.. రోహిత్ విన్

  స్పాన్సర్స్ టాస్క్.. రోహిత్ విన్


  శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో హౌస్‌లోని కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఓ స్పాన్సర్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా నలుగురు సభ్యులు కొన్ని చాలెంజ్‌లు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండో రౌండ్‌లో 'యమహా కాల్ ఆఫ్ ది బ్లూ మూమెంట్' అంటూ తమ అనుభవం చెప్పాలి. ఇందులో రోహిత్ విజేతగా నిలిచినట్లు సంచాలకురాలైన ఇనాయా సుల్తానా ప్రకటించింది.

  బాత్‌టబ్‌లో అరాచకంగా దీపికా పదుకొనె: హాట్ షోలో గీత దాటేసిందిగా!

  టీషర్ట్ విప్పేసి.. శ్రీహాన్ వెళ్లగా

  టీషర్ట్ విప్పేసి.. శ్రీహాన్ వెళ్లగా


  'యమహా కాల్ ఆఫ్ ది బ్లూ మూమెంట్' టాస్కులో రోహిత్ గెలిచినట్లు ఇనాయా ప్రకటించగానే రేవంత్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతేకాదు, టీషర్ట్ కూడా విప్పేసి మైక్ తీసేసి చిన్న పిల్లాడిలా ప్రవర్తించాడు. అతడిని అలా చూసిన కంటెస్టెంట్లు, ప్రేక్షకులు షాక్ అయ్యారు. తర్వాత కెప్టెన్ శ్రీహాన్ వెళ్లి మరీ కాసేపు బతిమాలి అతడిని మళ్లీ తీసుకుని వచ్చాడు.

  పరువు గోవిందా.. విమర్శలు

  పరువు గోవిందా.. విమర్శలు


  'యమహా కాల్ ఆఫ్ ది బ్లూ మూమెంట్' టాస్కులో ఓటమి తర్వాత రేవంత్ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గెలిస్తే ఒకలా.. ఓడిపోతే మరోలా ఉంటారా? అంటూ అతడిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. అదే సమయంలో రేవంత్ రోజు రోజుకూ తన పేరును చెడగొట్టుకునేలా ప్రవర్తిస్తున్నాడని, అది అతడికి మంచి కాదని చెప్తున్నారు.

  English summary
  Bigg Boss Telugu Telugu 6th Season Running Successfully. Singer Revanth Unexpected Behavior in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X