For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీముఖి పెళ్లికి గ్రీన్ సిగ్నల్: ఆ మూడింటికి ఓకే అయితేనే.. మెలిక పెట్టిన మామ

  |

  అటు బుల్లతెరపై.. ఇటు వెండితెరపై సందడి చేస్తూ సుదీర్ఘ కాలంగా తెలుగు ఇండస్ట్రీల్లో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న బ్యూటీ శ్రీముఖి. గ్లామర్, యాక్టింగ్, హోస్టింగ్ ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో తరచూ తన వ్యవహార శైలితో వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే కొంత కాలంగా శ్రీముఖి పెళ్లికి సంబంధించిన వార్తలు తెలుగు రాష్ట్రాల్లో తెగ హాట్ టాపిక్ అవుతున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ బ్యూటీ ఓ సింగర్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీముఖి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే, వరుడి తండ్రి కొన్ని కండీషన్స్ పెట్టారు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

   సినిమాల్లో ఎంట్రీ.. ఫుల్ పాపులర్

  సినిమాల్లో ఎంట్రీ.. ఫుల్ పాపులర్

  ఇండస్ట్రీలో స్థిరపడాలన్న లక్ష్యంతో శ్రీముఖి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 'జులాయి'తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అదిరిపోయే పాత్రలు చేసింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఫలితంగా టాలీవుడ్‌లో యమా పాపులర్ అయిపోయింది.

  Mehreen Kaur Pirzada: మెహ్రీన్ అందాల విందు.. అబ్బో ఆమె డ్రెస్ చూస్తే!

  యాంకర్‌గా మారింది.. క్రేజ్ ఇలా

  యాంకర్‌గా మారింది.. క్రేజ్ ఇలా


  వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి యాంకర్‌గా మారింది. 'అదుర్స్' షోతో హోస్టుగా మారిన ఆమె.. ఆ తర్వాత 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలు చేసింది. దీంతో తెలుగులో టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది.

  ఆ షో తర్వాత కెరీర్ మారిందిగా

  ఆ షో తర్వాత కెరీర్ మారిందిగా


  షోలు మీద షోలు చేస్తూ హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఈ షో తర్వాత స్పీడు పెంచేసి కెరీర్‌ను ముందుకు సాగిస్తోంది.

  షార్ట్ డ్రెస్‌లో యాంకర్ హరితేజ రచ్చ: నడిరోడ్డు మీదే అలా.. వీడియో వైరల్

  వరుస ఆఫర్లు... భారీ ప్రాజెక్టులు

  వరుస ఆఫర్లు... భారీ ప్రాజెక్టులు


  ఎక్కువగా గ్లామరస్ ప్రాతలే వస్తున్నాయన్న కారణంగా శ్రీముఖి సినిమాలు చేయకూడదని డిసైడ్ అయింది. అయితే, ఈ మధ్య తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇందులో భాగంగానే వరుసగా షోల మీద షోలు చేస్తూనే సినిమాలను లైన్‌లో పెడుతోంది. గత ఏడాది శ్రీముఖి 'క్రేజీ అంకుల్స్', 'మాస్ట్రో'లో కనిపించింది. ఇప్పుడు 'భోళా శంకర్' సహా పలు సినిమాలను చేస్తోంది.

  శ్రీముఖి పెళ్లి.. అతడితో లవ్వాట

  శ్రీముఖి పెళ్లి.. అతడితో లవ్వాట

  తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దీని గురించి చాలా పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ బోల్డ్ యాంకర్ 'సరిగమప' అనే షోలో సింగర్‌గా పోటీ పడుతోన్న సాయి శ్రీ చరణ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇస్తోంది. టీఆర్పీ కోసమే చేస్తోన్నా.. వీళ్ల జంట బాగా హైలైట్ అవుతోంది.

  స్టేజ్ మీదే హీరోయిన్‌కు ముద్దులు: ఏకంగా ఇద్దరితో.. ఆమె రియాక్షన్ చూశారంటే!

  శ్రీముఖి వివాహానికి గ్రీన్ సిగ్నల్

  శ్రీముఖి వివాహానికి గ్రీన్ సిగ్నల్


  'సరిగమప' షోలో సాయి శ్రీ చరణ్‌తో శ్రీముఖి ప్రేమలో పడినట్లు షోలో చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో చరణ్‌తో కలిసి పాట పాడిన తర్వాత అతడి తండ్రిని శ్రీముఖి 'మామయ్యా' అంటూ పిలిచింది. దీంతో ఆయన స్టేజ్ మీదకు వచ్చి 'మా ఆవిడ రాలేకపోయింది' అన్నారు. దీంతో శ్రీముఖి అత్తమ్మానా అని అడిగింది. అప్పుడాయన 'అత్తమ్మో గిత్తమో' అని ఫన్నీ సెటైర్ వేశారు.

  ముగ్గులో దించడమే వచ్చంటూ


  ఆ తర్వాత సాయి శ్రీ చరణ్ తండ్రి మాట్లాడుతూ.. 'మా ఆవిడ నిన్ను మూడు ప్రశ్నలు అడగమంది. నువ్వు కరెక్టుగా ఆన్సర్ ఇస్తే నాకేమీ అభ్యంతరం లేదు అంది' అని శ్రీముఖితో చెప్పారు. ఆ వెంటనే 'నీకు ముగ్గు వేయడం వచ్చా' అని ప్రశ్నించారు. దీనికి శ్రీముఖి 'ముగ్గులో దించడం వచ్చు మామయ్య' అని చెప్పింది. దీంతో అందరూ నవ్వేశారు. ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

  English summary
  Actress and Television Presenter Sreemukhi Now Doing SAREGAMAPA Show. Singer Sai Sri Charan Father Puts Conditions To her
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X