Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
స్కాం వీడియోపై క్లారిటీ... ఆ సైగలు వాటి గురించే.. లైవ్‌లో నోరు విప్పిన మెహబూబ్, సోహెల్
బిగ్ బాస్ ఫినాలె ఎపిసోడ్ గురించి మాట్లాడకుండా, విన్నర్ అయిన అభిజిత్ గురించి మాట్లాడకుండా అందరూ ఒకే ఒక వీడియో గురించి మాట్లాడుతున్నారు. మెహబూబ్ కొన్ని సైగలు చేయడం, దాన్ని హింట్‌గా తీసుకునే సోహెల్ 25 లక్షలు పట్టుకొచ్చాడని నెటిజన్లు ట్రోల్ చేసి పడేస్తున్నారు. అయితే తాజాగా ఈ వీడియోపై అభిజిత్ స్పందించడం, ఇన్ స్టా లైవ్‌లోకి వచ్చిన సోహెల్, మెహబూబ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇందులో అనేక విషయాలను క్లారిటీ వచ్చాయి.
నివేదా పేతురాజ్ గ్లామరస్, బోల్డ్ ఫోటోలు.. అందానికి అందంగా బ్యూటీ

అభిజిత్ రియాక్షన్..
అలా మెహబూబ్ సోహెల్‌కు చెప్పినా కూడా ఏం చేయలేం.. అది స్టార్ మా, ఎండోమోల్ షైన్ వారు చూసుకోవాలి.. అది వారి వ్యక్తిగతం.. డబ్బులు తీసుకోవాలా? వద్దా? అన్నది సోహెల్ వ్యక్తిగతం విషయం దాని మీద మనం కామెంట్ చేయకూడదంటూ అభిజిత్ ఎంతో హుందాగా స్పందించాడు.

లైవ్‌లోకి సోహెల్..
తాజాగా సోహెల్ తన ఇన్ స్టా లైవ్‌లోకి వచ్చారు. అందరూ ఆ వీడియో గురించి ప్రశ్నించడంతో క్లారిటీ ఇచ్చాడు. స్కాం, మోసం అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.. మధ్యాహ్నాం అభిజిత్ కూడా మీడియాతో మాట్లాడుతూ..ఫిర్యాదు చేద్దామని ఏదో అన్నాడట.. అభిజిత్‌తో కూడా మాట్లాడుతూ అంటూ ఆ వీడియో గురించి సోహెల్ క్లారిటీ ఇచ్చాడు.

పదేళ్ల కెరీర్..
నా పదేళ్ల కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా అది నాకు తెలియదు.. వాడు చెప్పింది డబ్బుల గురించి అని, టాప్ 3 గురించి అని కానీ నాకు తెలీదు. అసలు మేము ఇన్ స్టాగ్రాం ఫాలోవర్ల గురించి అడిగాము.. వాడు అదే చెప్పాడు. ఆరోజు రాత్రి కూడా అఖిల్‌తో అదే విషయం మాట్లాడాను.. మెహబూబ్ ఏదో అన్నాడు అర్థం కాలేదు అని అఖిల్‌తో అన్నానంటూ సోహెల్ క్లారిటీ ఇచ్చాడు.

చెప్పాడే అనుకుందాం..
అయితే మెహబూబ్ టాప్ 3లోనే ఉంటానని చెప్పాడని అనుకుందాం.. ఆ విషయం మెహబూబ్‌కు ఎలా తెలుస్తుంది.. అలా అయితే పది లక్షలు తీసుకునే వాడిని.. కానీ తీసుకోలేదు.. 20 లక్షలు కూడా తీసుకోలేదు.. ఐదు లక్షలు పెంచాకే ఓకే అన్నాను.. అందులో కూడా మా తమ్ముడు పది లక్షలు అనాథాశ్రమానికి ఇద్దామని అనడంతోనే ఒకే అన్నాను అంటూ సోహెల్ చెప్పుకొచ్చాడు.

మెహబూబ్ సైతం.
మెహబూబ్‌ను సైతం తన లైవ్‌లోకి యాడ్ చేశాడు సోహెల్. ఆ రోజు మాట్లాడుకున్న వాటిపై మెహబూబ్ క్లారిటీ ఇచ్చాడు. ఇన్ స్టా ఫాలోవర్ల గురించి అడిగితే నీకు 300K అని చెప్పా.. అఖిల్‌కు 250K అని చెప్పాను. కానీ అఖిల్ నమ్మలేదు నీకు గుర్తుందా? అంటూ సోహెల్ మెహబూబ్ ముచ్చట్లు పెట్టుకున్నారు. మొత్తానికి ఆ వీడియోపై ఇద్దరూ మాట్లాడి ఓ క్లారిటీ ఇచ్చేశారు. అభిజిత్ ఫ్యాన్స్ అర్థం చేసుకోండని అంటూ సోహెల్ కోరాడు. మరి ఇకపై అయినా వారు ట్రోలింగ్ ఆపేస్తారో లేదో చూడాలి.