»   » మరీ దారుణంగా ఉంది: ఆ సీరియల్ ని ఆపేసారు, చ్చీ.., థూ.. అంటున్నా వినని చానెల్

మరీ దారుణంగా ఉంది: ఆ సీరియల్ ని ఆపేసారు, చ్చీ.., థూ.. అంటున్నా వినని చానెల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విభిన్న క‌థాంశం అన్న పేరుతో మరీ వికృతమైన సబ్జెక్ట్స్ తో వస్తున్నారు కొన్ని మరీ హద్దు మీరిన కథావస్తువులు కావటం ఇంకా దారుణం గా ఉంది. ఇప్పుడు ప్ర‌సార‌మవుతున్న హిందీ సీరియ‌ల్ "పెహ్రేదార్ పియా కీ" సీరియ‌ల్‌పై కేంద్ర జౌళి శాఖ‌, స‌మాచార ప్ర‌సారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి ఓ వ్య‌క్తి పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

పిల్ల‌ల ఆలోచ‌నా విధానాల‌ను మార్చే విధంగా

పిల్ల‌ల ఆలోచ‌నా విధానాల‌ను మార్చే విధంగా

ప్రైమ్ టైమ్‌లో వ‌స్తున్న ఈ సీరియ‌ల్ పిల్ల‌ల ఆలోచ‌నా విధానాల‌ను మార్చే విధంగా ఉందని ఆ పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఈ పిటిష‌న్‌పై 36,282 మంది సంత‌కాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు అంతేకాక సోషల్ మీడియాలో కూడా ఈ సీరియల్‌పై తీవ్ర విమర్శలు రావడంతో.. సోనీ చానెల్ సోమవారం నుంచి అర్ధంతరంగా దీని ప్రసారాలు నిలిపేసింది. సీరియల్‌ ఒక్కసారిగా నిలిచిపోవడం ఇందులో నటించిన నటీనటులకు, దర్శకనిర్మాతలకు షాక్‌నిచ్చింది.

ప‌దేళ్ల బాలుడిని 19 ఏళ్ల యువ‌తి పెళ్లి

ప‌దేళ్ల బాలుడిని 19 ఏళ్ల యువ‌తి పెళ్లి

ఈ సీరియ‌ల్‌లో అనివార్య కార‌ణాల వ‌ల్ల ప‌దేళ్ల బాలుడిని 19 ఏళ్ల యువ‌తి పెళ్లి చేసుకోవాల్సి వ‌స్తుంది. బాలుడు అమ్మాయి నుదుట బొట్టు పెట్ట‌డం, త‌న‌ను ప్రేమిస్తున్నాన‌ని ప‌దే ప‌దే చెప్ప‌డం వంటి స‌న్నివేశాలు ప్రేక్ష‌కులను ఇబ్బంది పెట్టేలా ఉంటున్నాయి. ఈ సీరియ‌ల్ ప్రారంభానికి ముందే వ‌చ్చిన ప్రోమోల‌పై చాలా మంది అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

టీఆర్‌పీ పెరిగింద‌ని

టీఆర్‌పీ పెరిగింద‌ని

కాక‌పోతే జూలై 17న ప్రారంభ‌మైన ఈ సీరియ‌ల్ మొద‌టి ఎపిసోడ్ బాగుండ‌టంతో టీఆర్‌పీ పెరిగింద‌ని ఛాన‌ల్ వారు చెబుతున్నారు. కానీ ఈ సీరియల్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని బ్రాడ్‌కాస్టింగ్‌ కంటెంట్‌ కంప్లైట్స్‌ కౌన్సిల్‌ (బీసీసీసీ)కు లేఖ రాశారు.

ప్రసార సమయాన్ని మార్చాలని

ప్రసార సమయాన్ని మార్చాలని

రంగంలోకి దిగిన బీసీసీసీ సీరియల్‌ ప్రసార సమయాన్ని మార్చాలని, బాల్యవివాహాలను ప్రోత్సహించడంలేదంటూ సీరియల్‌ ప్రారంభంలో ప్రకటన ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో సీరియల్‌లో కాలాన్ని కొంత ముందుకుతీసుకెళ్లి ప్రధాన పాత్రలు యుక్త వయస్సుకొచ్చిన తర్వాత ఎపిసోడ్స్‌ను ప్రసారం చేస్తారని భావించారు.

సోనీ చానెల్‌ తీరుపై

సోనీ చానెల్‌ తీరుపై

కానీ, వివాదాల నేపథ్యంలో సోనీ చానెల్‌ ఏకంగా సీరియల్‌ ప్రసారాన్నే నిలిపివేయడం 'పెహ్రెదార్‌ పియా కీ' యూనిట్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. సోనీ చానెల్‌ తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తసున్నారు.ఈ సీరియల్‌లో 9 ఏళ్ల బాలుడిని 18 ఏళ్ల యువతి కొన్ని పరిస్థితులరీత్యా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.

మొదటిరాత్రి' గురించి

మొదటిరాత్రి' గురించి

ఆపై జరిగే పరిణామాలు ఏంటన్నదే ఈ సీరియల్‌ కథ. బాలుడు యువతి వెంటపడుతున్నట్టు.. 'మొదటిరాత్రి' గురించి చెప్తున్నట్టు అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో ఈ సీరియల్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైమ్ టైమ్‌లో వ‌స్తున్న ఈ సీరియ‌ల్ ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపటంతోపాటు, పిల్లల ఆలోచ‌నా విధానాన్ని మార్చే ప్రమాదం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

English summary
Sony has pulled the pulled the plug on its controversial show, Pehredaar Piya Ki, which is why it wasn’t telecast on Monday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu