Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిగ్ బాస్ గుట్టు విప్పిన శ్రీముఖి: ఏకంగా ఆధారాలు చూపించి మరీ బయట పెట్టేసింది
గతంతో పోలిస్తే సరికొత్త టాస్కులు, గొడవలు, కొట్లాటలు, లవ్ ట్రాకులు, మసాలా సీన్లు ఇలా రకరకాల పరిణామాలతో ఆసక్తికరంగా సాగుతోంది బిగ్ బాస్ నాలుగో సీజన్. ప్రస్తుతం ఫినాలే వీక్‌లో ఉన్న ఈ సీజన్.. తాజాగా వంద రోజులు పూర్తి చేసుకుంది. మరో ఐదు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనున్న నేపథ్యంలో షోలో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్‌కు ముందు బిగ్ బాస్ గుట్టు విప్పింది మాజీ కంటెస్టెంట్ శ్రీముఖి. అంతేకాదు, ఏకంగా ఆధారాలు చూపించి మరీ బయట పెట్టేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

బిగ్ బాస్ మూడో సీజన్‌లో రన్నరప్
శ్రీముఖి.. ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతోన్న యాంకర్. నటిగా కెరీర్‌ను ఆరంభించిన ఆమె.. యాంకర్‌గా స్థిరపడిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో షోలు, సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. ఇదిలా ఉండగా, గత ఏడాది జరిగిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. రన్నరప్‌గా నిలిచింది. ఈ సీజన్‌ను రాహుల్ సిప్లీగంజ్ గెలుచుకున్నాడు.

నాలుగో సీజన్‌లోకి గెస్టుగా వచ్చింది
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న ఆమె.. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి గెస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో పాటు మొదటి సీజన్ కంటెస్టెంట్ హరి తేజ, రెండో సీజన్ నుంచి గీతా మాధురి, మూడో సీజన్ నుంచి అలీ రేజా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఫినాలే వీక్ జరుగుతోన్న సందర్భంగా వాళ్లను స్పెషల్ గెస్టులుగా లోపలికి పంపించాడు బిగ్ బాస్.

లీడ్ తీసుకుని, వాళ్లకు ధైర్యం చెప్పి
కరోనా నిబంధనల కారణంగా నేరుగా హౌస్‌లోని కంటెస్టెంట్లతో కలిసే అవకాశం లేకపోవడంతో, మానిటర్ ద్వారా చిట్ చాట్ నిర్వహించారు స్పెషల్ గెస్టులు. వాస్తవానికి నలుగురు మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అందులో లీడ్ తీసుకుని తన మార్క్ చూపించింది శ్రీముఖి. ఈ క్రమంలోనే మిగిలిన వారితో కలిసి తన అనుభవాలు పంచుకుని కంటెస్టెంట్లకు ధైర్యం చెప్పింది.

బిగ్ బాస్ గుట్టు విప్పేసిన యాంకర్
ప్రస్తుత సీజన్ వంద రోజులు పూర్తి చేసుకుని ఫినాలే వీక్‌లో ఉంది. డిసెంబర్ 20 జరగనున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో ఈ సీజన్ విన్నర్ ఎవరో రివీల్ కానుంది. ఇప్పటికే హౌస్‌లోని కంటెస్టెంట్లకు మద్దతుగా వాళ్ల వాళ్ల ఫ్యాన్స్ ప్రచారం చేయడంతో పాటు ఓట్లు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగో సీజన్‌లోకి గెస్టుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. బిగ్ బాస్ షో గుట్టు విప్పేసింది.

ఆధారాలు చూపించి బయట పెట్టింది
బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే తన టాటూ గురించి మాట్లాడింది శ్రీముఖి. అంతేకాదు, గీతా మాధురి వేయించుకున్న బిగ్ బాస్ టాటూను చూపిస్తూ ‘మేమిద్దరం వేయించుకున్న టాటూలు ఉత్తదే అని అంతా అనుకుంటున్నారు. బయట టాక్ నడుస్తున్నట్లు ఇది ఫేక్ కాదు.. కావాలంటే చూసుకోండి' అంటూ ఆధారాలతో సహా చూపించింది. దీంతో ప్రేక్షకులకు దీనిపై క్లారిటీ వచ్చింది.

మొదటి సీజన్‌లో టాటూ ఆమెకేనట
వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్‌లో టాటూ ఎవరికీ వేయలేదు. కానీ రెండో సీజన్‌లో గీతా మాధురు, మూడో సీజన్‌లో శ్రీముఖి అది వేయించుకున్నారు. ఇక, నాలుగో సీజన్‌లో సైతం అటువంటి టాస్క్ పెట్టలేదు. తాజా ఎపిసోడ్‌లో దీని గురించి మాట్లాడుతూ.. ‘ఫస్ట్ సీజన్‌లో పెట్టుంటే అది కచ్చితంగా హరి తేజనే వేయించుకునేది' అని అనుకున్నారంతా.