విష్ణుప్రియ తిప్పుడుకు అబ్బాయిలాగా కామెంట్ చేసిన శ్రీముఖి.. మరీ అంత ఘాటుగానా
సోషల్ మీడియాలో యాంకర్స్ కు దక్కుతున్న క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. దాదాపు అగ్ర హీరోయిన్స్ కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఫాలోవర్స్ ను అందుకుంటున్నారు. ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం మాటలతోనే ఎట్రాక్ట్ చేసేవారు. కానీ ఈ రోజుల్లో మాత్రం గ్లామరస్ యాంకర్స్ డామినేషన్ ఎక్కువయ్యింది. అలాంటి బ్యూటీలలో విష్ణుప్రియ, శ్రీముఖి కూడా ఉన్నారు. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో వీరి కామెంట్స్ వైరల్ అయ్యాయి.

హీరోయిన్ గా కూడా..
విష్ణుప్రియ కెరీర్ మొదట్లో నటిగా ప్రయత్నాలు బాగానే చేసింది. చాలామంది ఆమె పోవే పోరా షోతోనే మొదటిసారి ఇండస్ట్రీలోకి వచ్చిందని అనుకున్నారు. కానీ అంతకుముందే కొన్ని సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు చేసింది. కానీ అవేవి అంత పెద్ద సినిమాలు కాకపోవడంతో ఎవరు పట్టించుకోలేదు. కొన్ని సినిమాలైతే ఎన్నో ఏళ్ళకు గాని విడుదల కాలేదు.

స్టార్ యాంకర్స్ పోటీగా ఉన్నా..
ఇక ఎప్పుడైతే సుధీర్ తో కలిసి పోవేపోరా షో స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఆమె కెరీర్ కాస్త యూ టర్న్ తీసుకుంది. పోటీగా శ్రీముఖి, రష్మీ, అనసూయ వంటి యాంకర్స్ ఉన్నా కూడా ఈ బ్యూటీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెలుతోంది.
హాట్ డ్యాన్స్ వీడియో
ఇక స్టార్ యాంకర్స్ కు పోటీని ఇవ్వాలి అంటే మరింత క్రేజ్ అందుకోవాలని అనుకున్న విష్ణుప్రియ రోజుకో లుక్కుతో షాక్ ఇస్తోంది. గ్లామర్ విషయంలో ఎప్పటికప్పుడు డోస్ పెంచుతూ నెటిజన్లకు షాక్ ఇస్తోంది. ముఖ్యంగా ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఒక హాట్ వీడియో పోస్ట్ చేసింది. ఒక ఇంగ్లీష్ పాటకు నచ్చినట్లు డ్యాన్స్ చేసినట్లుగా కూడా కామెంట్ పెట్టింది.
Recommended Video

అబ్బాయిలాగా కామెంట్ చేసిన శ్రీముఖి
టీ షర్ట్ పైకి అనుకోని నడుము కనిపించేలా పొట్టి నిక్కరుతో ఒక విధంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గతంలో చాలాసార్లు ఘాటైన పోజులు ఇచ్చినప్పటికీ ఇది మాత్రం మరీ హాట్ గా ఉన్నట్లు అర్ధమయ్యింది. ఇక ఆమె బాగానే మ్యానేజ్ చేసింది అంటూ శ్రీముఖి కొంటెగా కామెంట్ కూడా చేసింది. అంతే కాకుండా అబ్బాయిల తరహాలో 'హాటీ' అంటూ మరోక పదునైన పదాన్ని వాడేసింది. దీంతో డ్యాన్స్ లుక్ తో పాటు శ్రీముఖి కామెంట్ కూడా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











