Just In
- 32 min ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 1 hr ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 2 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 3 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం: ముత్తూట్ ఫైనాన్స్‌లో 25 కిలోల బంగారం, రూ. 96వేలు అపహరణ
- Finance
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... త్వరలోనే ఆ సర్వీసును పునరుద్దరించనున్న ఐఆర్సీటీసీ..
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అఫీషియల్ : స్టార్ టీవి చేతికి .... 'మాటీవి' (ఫొటోలు)
హైదరాబాద్ : ఇండియాలో నెంబర్ వన్ టివి నెట్ వర్క్ స్టార్ ఇండియావారు అఫీషియ ల్ గా మాటీవి ని తీసుకున్నారు. బుధవారం నాడు మాటీవి యాజమాన్యం...స్టార్ టీవితో ఒప్పందం కుదుర్చుకుంది. ఎవరెవరికి ఎంతెంత వాటాలు, ఎవరి భాగం ఎంత విషయం ఇంకా బహిరంగపరచకపోయినప్పటికీ...ప్రపంచంలోనే అతి పెద్ద శాటిలైట్ ఛానెళ్ల గ్రూప్ అయినటువంటి స్టార్ నెట్ వర్క్ తో మాటీవి భాగస్వామ్యం కుదుర్చుకోవటం తెలుగు టీవి ఛానెళ్ పరిణాల్లో చాలా కీలకమైనదిగా చెప్పుకోవాలి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇన్నాళ్లూ మాటీవి నిమ్మగడ్డ ప్రసాద్ ఛైర్మన్ గా ఉన్నారు. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున భాగస్వామ్యులు గానూ, డైరక్టర్లగానూ ఉన్నారు. స్టార్ నెట్ వర్క్ ప్రతినిథిలతో కలిసి బుధవారం మధ్యాహ్న ప్రెస్ మీట్ పెట్టి తమ ఒప్పందం గురించి ప్రకటించారు.
సోనీటీవి , మాటీవీకు ఎలాంటి ఒప్పందాలు లేవని ఈ సందర్బంగా నిమ్మగడ్డ ప్రసాద్ స్పష్టత ఇచ్చారు. స్టార్, మా టీవి వాటాల వివరాలు ఇంకా తేలలదేని కూడా ఆయన అన్నారు. తెలుగు ప్రజలకు మరింత నాణ్యమైన ప్రసారాలు అందిస్తామని పేర్కొన్నారు.
స్లైడ్ షోలో ఫొటోలు

ముఖ్యులందరూ
నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులంతా హాజరయ్యారు

కీలకమైందే
స్టార్ గ్రూప్‌తో మా టీవీ కీలక ఒప్పందం కుదుర్చుకుందని మాటీవీ ప్రమోటర్ నిమ్మగడ్డ ప్రసాద్ వెల్లడించారు.

భాగస్వామి
స్టార్ ఇండియాలో మాటీవీ భాగస్వామి కానుందని నిమ్మగడ్డ ప్రసాద్ పేర్కొన్నారు.

నాణ్యత కోసం
తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలను అందిస్తామని నిమ్మగడ్డ ప్రసాద్ చెప్పారు.

బ్రాడ్ కాస్టింగ్ ని..
స్టార్ ఇండియా వారు మా టెలివిజన్ నెట్వర్క్ బ్రాడ్ కాస్టింగ్ ని కొనుకున్నారు

ఎన్నో అవకాసాలు
ఈ ఒప్పందంతో టెలివిజన్ మార్కెట్ లోకి ఎంతో మందికి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం కల్పించనున్నారు.

తెలియచేసారు
ఈ విషయం పైన ఈ రోజు నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ మరియు స్టార్ ఇండియా ప్రతినిధులు కలిసి మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్నీ తెలియజేశారు.

రెండవ స్దానంలో
ఇండియాలోనే స్టార్ ఇండియా వారు ఎంటర్టైన్మెంట్ బిజినెస్ లో రెండవ స్థానంలో ఉన్నారు. అలాంటి వారికి మా టీవీ నెట్వర్క్ బ్రాడ్ కాస్టింగ్ ని అప్పగించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.

అధికారింకంగా
అలాగే ప్రస్తుతం అధికారికంగా జరగాల్సిన కొన్ని పనులు జరుగుతున్నాయి. అవి పూర్తి కాగానే స్టార్ ఇండియాతో పాటు కలిసి కొన్ని సరికొత్త కార్యక్రమాలతో మీ ముందుకు వస్తామని తెలిపారు.

ట్రై చేస్తాం
స్టార్ ఇండియా వారు కూడా తెలుగు ప్రజలను మరిన్ని సూపర్బ్ ప్రోగ్రామ్స్ తో ఎంటర్టైన్ చెయ్యడానికి ట్రై చేస్తామని తెలిపారు.

త్వరలోనే..
ఈ డీల్ తర్వాత ఎవరి ఓనర్ షిప్ ఎంత, ఎన్ని కోట్లకి మా చానల్ హక్కులు స్టార్ ఇండియా వారు దక్కిన్చుకున్నరనే విషయాలను త్వరలోనే తెలియజేస్తారు.

స్టార్ ప్రతినిథి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ...
ఇప్పటివరకూ తమకు తెలుగులో ప్రసారాలు లేవని, మాటీవితో టై అప్ తో ఆ లోటు తీరిందన్నారు. అయితే బ్రాడ్ కాస్ట్ బిజినెస్ లో భాగస్వాములం మాత్రమే అని స్టార్ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం కొనసాగుతుందని, ప్రమోటర్లు వాళ్లే ఉంటారని పేర్కొన్నారు. ఇక నుంచి మా బ్రాండ్ స్టార్ గా మారుతుందని అన్నారు. రెగ్యులేటర్ అనుమతులు రాగానే అమల్లోకి వస్తుందని అన్నారు. తెలుగు ప్రేక్షకులుకు అత్యుత్తమ కార్యక్రమాలు అందించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.