For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Gaalodu ప్రమోషన్స్ లో సుడిగాలి సుధీర్ పరువు గోవిందా.. పెళ్లి కూతురు తల్లికే అంటూ షాకింగ్ గా!

  |

  సుడిగాలి సుధీర్ గురించి పెద్దగా అవసరం లేదు. బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అతికొద్దిమందిలో సుధీర్ ఒకరు. యాంకర్ గా, కమెడియన్ గా రాణిస్తూనే హీరోగా తానేంటో నిరూపించుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడ్ సినిమాలతో వెండితెరపై కనిపించిన సుడిగాలి సుధీర్ తాజాగా గాలోడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ము లేపుతున్నాడు గాలోడు. అయితే గాలోడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుడిగాలి సుధీర్, మూవీ డైరెక్టర్ ఓ షోలో పాల్గొన్నారు. అక్కడ సుధీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది యాంకర్ శ్రీముఖి.

  సుడిగాలి సుధీర్ గా ఎదిగి..

  సుడిగాలి సుధీర్ గా ఎదిగి..

  బుల్లితెరపైకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది కుర్రాళ్లు పరిచయం అయ్యారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్ గురించి. జబర్ధస్త్ షో ద్వారా పరిచయమైన సుధీర్.. సుడిగాలి సుధీర్ గా మారి అనతి కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు.

  హీరోగా ప్రయత్నాలు..

  హీరోగా ప్రయత్నాలు..

  జబర్దస్త్ కమెడియన్ గా సూపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ బుల్లితెరపై ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తాడు. స్మాల్ స్క్రీన్ పై సుధీర్ తనదైన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తోపాటు అప్పుడప్పుడు డ్యాన్స్ లతో సూపర్బ్ గా ఎంటర్టైన్ చేశాడు. ఇటు బుల్లితెరపై తనదైన శైలీలో ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇదివరకు త్రీమంకీస్, సాఫ్ట్ వేర్ సుధీర్, వాంటెడ్ పండుగాడ్ చిత్రాల్లో హీరోగా చేశాడు.

  కలిసిరాని రాఘవేంద్ర రావు సినిమా..

  కలిసిరాని రాఘవేంద్ర రావు సినిమా..

  సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన త్రీమంకీస్, సాఫ్ట్ వేర్ సుధీర్ అంతగా సక్సెస్ కాలేదు. తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పించిన వాంటెడ్ పండుగాడ్ లో ఒక హీరోగా చేశాడు సుధీర్. ఇందులో సుధీర్ కు జోడిగా పాపులర్ యాంకర్, క్యూట్ బ్యూటి దీపిక పిల్లి నటించింది. అయితే ఈ సినిమా కూడా సుడిగాలి సుధీర్ కి కలిసి రాలేదు. దీంతో ఎలాగైన హీరోగా ఒక హిట్ కొట్టాలని తెగ ప్రయత్నిస్తున్నాడు ఈ మెజిషీయన్.

  కీలక పాత్రల్లో కమెడియన్స్..

  కీలక పాత్రల్లో కమెడియన్స్..

  హీరోగా తన మార్క్ చూపించుకోవాలని ట్రై చేస్తున్న సుడిగాలి సుధీర్ ఇటీవల గాలోడుగా నవంబర్ 18న ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన ఈ మూవీని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఇందులో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో కమెడియన్లు సప్తగిరి, శకలక శంకర్ కీలకమైన పాత్రల్లో కనిపించారు. భీమ్స్ దీనికి సంగీతం అందించారు.

  కలెక్షన్స్ లలో గాలోడు జోరు..

  కలెక్షన్స్ లలో గాలోడు జోరు..

  నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ గాలోడు సినిమా కలెక్షన్లలో మాత్రం జోరు చూపిస్తుంది. ఆరు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని లాభాల బాటలో పయనిస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హాజరైంది గాలోడు మూవీ టీమ్. ఈ షోకి సుడిగాలి సుధీర్, డైరెక్టర్ పి రాజశేఖర్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ హాజరయ్యారు. ఈ షోలో పల్లకిలో పెళ్లి కూతురు, కార్తీక దీపం సీరియల్స్ నటీనటులు రెండు టీమ్ లుగా పాల్గొన్నారు.

  పెళ్లికూతురిని గెలికేయొద్దు..

  పెళ్లికూతురిని గెలికేయొద్దు..

  షోలో భాగంగా రెండు టీముల్లో మీరు కచ్చితంగా పల్లికిలో పెళ్లికూతురు సైడ్ ఉంటారని నాకు తెలుసు.. ఎందుకంటే అందులో అమ్మాయిలు ఉన్నారు కాబట్టి అని యాంకర్ శ్రీముఖి అంది. పెళ్లి కూతురు ఉందిగా అని గెలికేయద్దండి బాబు అని శ్రీముఖి అంటే.. అందులో పెళ్లి కూతురు ఎవరు అని కామెడీ చేశాడు సుధీర్. అది అంజలికి కాంప్లిమెంట్ అని F2 ఫేమ్ యాక్టర్ ప్రదీప్ (అంతేగా అంతేగా) అన్నారు.

  సుధీర్ పై శ్రీముఖి కామెంట్స్

  సుధీర్ పై శ్రీముఖి కామెంట్స్

  నటుడు ప్రదీప్ అన్నదానికి.. "అది కాదండి.. ఈ గాలోడు ఎలాంటోడనంటే.. పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు పెళ్లి కూతురు కన్నా వాళ్ల తల్లికి లైన్ వేసే రకం.. అంతేకదా" అని యాంకర్ శ్రీముఖి షాకింగ్ కామెంట్ చేసింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయి.. ఆ తర్వాత నవ్వేశారు. అలా అంటరేంటండి బాబు అని సుధీర్ అన్నాడు. తర్వాత పల్లకిలో పెళ్లికూతురు టీమ్ కు సుధీర్ సపోర్ట్ చేస్తాడని చెప్పింది యాంకర్ శ్రీముఖి.

  English summary
  Anchor Sreemukhi Shocking Comments On Sudigali Sudheer In Adivaram With Star Maa Parivaram Over Gaalodu Movie Promotions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X