»   » అఫీషియల్ : ఓ‘ఇంటి’వాడైన 'సుడిగాలి' సుధీర్! మరి రేష్మితో... ?

అఫీషియల్ : ఓ‘ఇంటి’వాడైన 'సుడిగాలి' సుధీర్! మరి రేష్మితో... ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈటీవి ప్రేక్షకులను జబర్దస్త్‌ పోగ్రామ్ తో నవ్విస్తున్న సుడిగాలి సుధీర్ రీసెంట్ గా ఓ ఇంటివాడయ్యాడు. అయ్యయ్యో.. ఇంటివాడనగానే పెళ్లైపోయింది అనుకోకండి. ఇన్నాళ్లూ అద్దె ఇంట్లో గడిపిన సుధీర్ తాజాగా ఓ కొత్త ఇల్లు కొనుకున్నాడు. ఈ సందర్బంబా తనలోని టాలెంట్‌ను గుర్తించి అవకాశం కల్పించిన మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు, ఈటీవీకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కృతజ్ఞతలు తెలియజేశాడు సుధీర్.

అదే విధంగా తనను ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు.

ఇక యాంకర్ రష్మిగౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని కొంతకాలంగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న సంతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం జబర్దస్త్ స్కిట్లు చేసేప్పుడు కూడా టీమ్ మెంబర్స్ ఇద్దరిపై సెటైర్లు వేయడం ఓ కారణం అయితే, రేష్మి, సుధీర్ కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం లాంటివి చూసిన వారెవ్వరికైనా ఈ అనుమానం రాక తప్పదు.

sudigali sudheer bought a house

జబర్దస్త్ కామెడీ షోలో సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారిందని, ప్రస్తుతం పీకల్లోతు ఎఫైర్లో ఉన్నారని, సహజీవనం చేస్తున్నారని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారంటూ కొంతకాలంగా రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు కేవలం గాసిప్స్ గానే ఉండిపోయాయి... నిజా నిజాలు ఏమిటనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

అయితే రేష్మి, సుధీర్ మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరుగడానికి మూల కారణం మేమే అని గెటప్ శ్రీను వెల్లడించారు. ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి.. ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి, స్కిట్ లో పంచ్ లు పేలడానికి వారిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు సరదాగా కామెంట్స్ చేసే వారమని తెలిపారు.

English summary
sudigali sudheer bought a house at Hyderbad. He shared this matter in FB. Am so happy to share this happy moment with you all that I bought a new house, thank you so much to Mallemala Entertainments, ETV Telugu and Telugu Film Industry (TFI) and thanks a lot to the entire Telugu people around the globe, this happy moment wouldn't have happened without your love and support, thanks again...!!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu