For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: తక్కువ టైంలోనే కోటికి పైగా.. జబర్ధస్త్ కమెడియన్ సంచలనం!

  |

  సుడిగాలి సుధీర్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ యంగ్ కమెడియన్ దాదాపు ఎనిమిదేళ్లుగా టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. సాదాసీదాగా పరిచయం అయిన అతడు.. జబర్ధస్త్ షో ద్వారా ఎనలేని గుర్తింపును అందుకున్నాడు. అంతేకాదు, తనలోని అన్ని రకాల టాలెంట్లను చూపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకోవడంతో పాటు వరుస పెట్టి ఆఫర్లను కూడా అందుకుంటున్నాడు. దీంతో సుధీర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ యంగ్ కమెడియన్ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  Recommended Video

  Sudigali Sudheer,Getup Srinu Comedy At Most Eligible Bachelor Wrop Up Party
  జబర్ధస్త్‌గా కెరీర్.. ఆల్‌రౌండర్‌గా

  జబర్ధస్త్‌గా కెరీర్.. ఆల్‌రౌండర్‌గా

  మెజీషియన్‌గా సుధీర్ తన ప్రయాణాన్ని మొదలెట్టాడు. ఈ క్రమంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడడంతో అందులోకి ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. అలా పరిచయమై తక్కువ టైంలోనే మంచి గుర్తింపు అందుకున్నాడు. దీంతో షో నిర్వహకులు సుధీర్‌కు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ అందించారు. ఇక, అప్పటి నుంచి కామెడీ, డ్యాన్స్, పాటలు, సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు.

  బాడీ పార్టులన్నీ చూపిస్తూ అనన్య నాగళ్ల అరాచకం: తెలుగమ్మాయిని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

  రష్మీతో లవ్ ట్రాకుతో పాపులర్

  రష్మీతో లవ్ ట్రాకుతో పాపులర్

  సుదీర్ఘ కాలంగా అన్నింట్లోనూ సత్తా చాటుతూ సుడిగాలి సుధీర్ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో మరింత పాపులర్ అయిపోయాడు. చాలా కాలంగా ఆమెతో వ్యవహారం నడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ వీళ్లిద్దరూ లవర్సే అని చాలా మంది భావిస్తూనే ఉన్నారు.

  సినిమాల్లోనూ సత్తా చాటుతూనే

  సినిమాల్లోనూ సత్తా చాటుతూనే

  బుల్లితెరపై సుడిగాలి సుధీర్ తిరుగులేని ఆర్టిస్టుగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటించాడు. అలాగే హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' అనే సినిమాలు చేశాడు. ఇక, ఇప్పుడు సుధీర్ హీరోగా 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' అనే సినిమాల్లో చేస్తున్నాడు.

  ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!

  యాంకర్‌గా సుధీర్ హడావిడితో

  యాంకర్‌గా సుధీర్ హడావిడితో

  కొన్నేళ్ల క్రితం సుడిగాలి సుధీర్ 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారి రచ్చ రచ్చ చేశాడు. హోస్టుగానూ తన మార్క్‌ను చూపించి ఆకట్టుకున్నాడు. కానీ, ఆ షోతో యాంకరింగ్‌ను ఆపేశాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో యాంకర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. అందులో తనదైన స్టైల్‌లో హోస్టింగ్ చేస్తూ అలరిస్తున్నాడు.

  పుష్పగా కమెడియన్ రచ్చ రచ్చ

  పుష్పగా కమెడియన్ రచ్చ రచ్చ

  ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌లో సుడిగాలి సుధీర్ ఓ రేంజ్‌లో సందడి చేస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అంతకు ముందు వారం ప్రాసారం అయిన ఎపిసోడ్‌లో అతడు 'పుష్ప' మూవీ స్ఫూఫ్ చేశాడు. ఇందులో సుధీర్ పుష్పరాజ్‌ గెటప్‌ వేసుకున్నాడు. అలాగే, రాంప్రసాద్ కేశవ పాత్రను, గెటప్ శ్రీను విలన్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను చేసి తెగ రచ్చ రచ్చ చేసేశారు.

  సమంత, నాగ చైతన్య విడాకుల కథలో బిగ్ ట్విస్ట్: ఆ పార్టీ తర్వాతే విభేదాలు.. ముందు అడిగింది తనేనట!

  తక్కువ టైంలోనే కోటికి పైగానే

  సుడిగాలి సుధీర్ చేసిన 'పుష్ప' స్కిట్‌కు బుల్లితెరపై భారీ స్థాయిలో స్పందన దక్కింది. అదే సమయంలో యూట్యూబ్‌లోనూ ఇది దూసుకుపోయింది. దీంతో దీనికి 24 గంటలు దాటకముందే ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు, కేవలం ఐదు రోజుల్లోనే పది మిలియన్స్ అంటే అక్షరాల కోటి వ్యూస్ కూడా దక్కాయి. దీంతో సుధీర్ పేరిట అరుదైన రికార్డు వచ్చి చేరింది.

  హైపర్ ఆది స్కిట్‌తో పోటీ పడి

  హైపర్ ఆది స్కిట్‌తో పోటీ పడి

  మరోవైపు, అంతకు ముందు గురువారం హైపర్ ఆది కూడా 'పుష్ప' స్కిట్ చేశాడు. ఇందులోకి కేశవ పాత్ర వేసిన నటుడిని కూడా తీసుకొచ్చాడు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ స్కిట్‌కు కూడా యూట్యూబ్‌లో కోటికి పైగానే వ్యూస్ వచ్చాయి. అయితే, దీని కంటే సుధీర్ టీమ్ చేసిన స్కిట్‌కే వేగంగా పది మిలియన్ల వ్యూస్ రావడంతో రికార్డు నమోదైంది.

  English summary
  Sudigali Sudheer Paticipated in Extra Jabardasth Show. He Did Pushpa Movie Spoof Skit In Recent Episode. Now This Skit Creats Record.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X