For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సన్ని లియోన్ తో యంగ్ హీరో వాట్సాప్ చాట్.. బయటపెట్టిన యాంకర్, స్క్రీన్ షాట్స్ వైరల్!

  |

  ప్రభాస్ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చేలా చేసిన చిత్రం వర్షం. ప్రభాస్-త్రిష-గోపిచంద్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ శోభన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ శోభన్ కుమారుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో సంతోష్ శోభన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్ తో అదరగొట్టిన సంతోష్ శోభన్ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో హీరోగా దూసుకుపోతున్నాడు. తాజాగా కల్యాణం కమనీయం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఇప్పుడు సన్ని లియోన్ తో సంతోష్ శోభన్ చేసిన వాట్సాప్ చాట్ హాట్ టాపిక్ గా మారింది.

  విభిన్నమైన ప్రేమకథా చిత్రాలతో..

  విభిన్నమైన ప్రేమకథా చిత్రాలతో..

  పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయ్, ది బేకర్ అండ్ ది బ్యూటి వంటి విభిన్నమైన లవ్ స్టోరీస్ తో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాతో జోడి కట్టి Like, Share & Subscribe సినిమాతో పర్వాలేదనిపించుకున్న ఈ హీరో తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

  లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం..

  లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం..

  విభిన్నమైన కథలతో కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకునే యంగ్ హీరో సంతోష్ శోభన్ చేసినవి లవ్ స్టోరిస్ అయినప్పటికీ అందులో కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మరొక లవ్ అండ్ రొమాంటిక్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కలగలపిన కల్యాణం కమనీయం అనే సినిమాతో సందడి చేయనున్నాడు. యూవీ క్రియేషన్ బ్యానర్ లో సంతోష్ శోభన్ నటించిన చిత్రమే కల్యాణం కమనీయం.

   ట్రైలర్ విడుదల చేసిన అనుష్క..

  ట్రైలర్ విడుదల చేసిన అనుష్క..

  ఇక ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి విడుదల చేసింది. ఒక భర్త, భార్య, పెళ్లి కథగా వస్తున్న కల్యాణం కమనీయం లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తో పాటు ఎమోషనల్ గా సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది. అలాగే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. దీంతో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు.

   ప్రమోషన్స్ లో భాగంగా..

  ప్రమోషన్స్ లో భాగంగా..

  ఇక తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతూ.. సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోంది సుమ కనకాల. యాంకరింగ్ లో తనకు తానే సాటి అన్నట్లుగా వరుస షోలు చేస్తోంది. ఇప్పుడు ఆమె 'సుమ అడ్డా' అనే కొత్త షోతో రాబోతుంది. జనవరి 7 నుంచి అంటే ఇవాళ్టి నుంచి ప్రతి శనివారం ప్రసారం కానుంది. ఈ షోకి ప్రమోషన్స్ లో భాగంగా కల్యాణం కమనీయం చిత్రబృందం వచ్చింది. ఈ షోకి సంతోష్ శోభన్, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్, డైరెక్టర్ అనిల్ కుమార్ ఆళ్ల, సద్దాం హుస్సేన్ హాజరయ్యారు.

   హీరోయిన్లతో హీరో చాట్..

  హీరోయిన్లతో హీరో చాట్..

  సుమ అడ్డా షోలో సంతోష్ శోభన్ ను ఒక ఆట ఆడేసుకుంది యాంకర్ సుమ. సంతోష్ శోభన్ ఫోన్ తీసుకున్న సుమ అతని వాట్సాప్ చాట్ అంతా బయట పెట్టేసింది. స్క్రీన్ షేరింగ్ ఆన్ చేసి.. అతను హీరోయిన్లతో చేసిన వాట్సాప్ చాట్ ను లీక్ చేసింది. వారిలో అనుపమ, త్రిష, కేథరిన్, అవికా గోర్ ఉన్నారు. అనుపమతో బేబీ తిన్నవా అంటూ మాట్లాడే చాట్ ఉంది. చివర్లో సన్ని లియోన్ పేరు ఉంది.

  16 డిలిటెడ్ మెస్సేజ్ లు..

  సన్ని లియోన్ చాట్ ఓపెన్ చేయగానే అందులో అన్నీ డిలీటెడ్ మెసేజెస్ ఉన్నాయి. అవన్నీ లెక్కపెట్టగా మొత్తం 16 ఉన్నాయి. అవి చూపించడంతో సంతోష్ శోభన్ ఏం చేయలేక సైలెంట్ గా ఉండిపోయాడు. అయితే ఇదంతా షోలో భాగంగా సరదాగా చేసి ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది. దీంతో సన్ని లియోన్ తో సంతోష్ శోభన్ వాట్సాప్ చాట్ అంటూ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

  English summary
  Suma Kanakala Reveals Kalyanam Kamaneeyam Movie Hero Santosh Sobhan Whats App Chat With Anupama Parameswaran Sunny Leone In Suma Adda Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X