Don't Miss!
- Finance
Economic Survey: పెరిగిన భారత ఎగుమతులు.. బొమ్మల నుంచి ఆయుధాల వరకు: ద్రౌపదీ ముర్ము
- News
KTR: స్కూల్ వ్యానును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. కలెక్టర్‌కు కేటీఆర్ ఫోన్..
- Lifestyle
Chanakya Niti: ఇలాంటి వ్యక్తులను మాత్రమే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది, వాళ్లే సంపద సృష్టిస్తారు
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Suma Kanakala షాకింగ్ నిర్ణయం.. యాంకరింగ్‌కు గుడ్ బై అంటూ సుమ కంటతడి.. అసలేం జరిగిందంటే
యాంకర్ సుమ.. తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని పేరు. బుల్లితెర ప్రేక్షకులనే కాకుండా సినిమా ఆడియెన్స్ ను కూడా తన యాంకరింగ్ తో కట్టిపడేస్తుంది సుమ. ఇంకా చెప్పాలంటే నేటి యంగ్ యాంకర్ లకు సుమ ఒక డిక్షనరీలా మారిందనే చెప్పవచ్చు. ఇక సుమ కనకాల ఈవెంట్స్ లలో మైక్ పట్టుకుంటే అంతే. ఆమె మాటల ప్రవాహం, పంచ్ ల తూటాలకు నవ్వులు కురవాల్సిందే. ముందు ఉన్నది అగ్ర హీరో అయిన.. చిన్న హీరోయిన్ అయినా సరే ఆమె మాట తీరులో తేడా ఉండదు. అలా అని ఎబ్బెట్టుగా ఉండదు. ఏది.. ఎక్కడ.. ఎంత.. ఎలా మాట్లాడాలో తెలిసిన పర్ఫెక్ట్ యాంకర్ సుమ. అలాంటి సుమ తన యాంకరింగ్ కు గుడ్ బై చెప్పనుందని ఇదివరకే వార్తలు వచ్చాయి. కానీ ఈసారి ఆమె తన నోటి నుంచి కన్నీళ్లతో ఈ విషయం చెప్పుకొచ్చారు.

అతి తక్కువ మంది మాత్రమే..
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేశారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇంకొందరు యాంకర్ అంటే ఇలా ఉండాలి, యాంకరింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. ఎవరు పొందలేని విశేషమైన గుర్తింపు పొందుతారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది యాంకర్ సుమ గురించి. యాంకరింగ్ లో సుమ కనకాల పొందినటువంటి పాపులారిటీ ఎవరు దక్కించుకోలేదనే చెప్పవచ్చు.

సక్సెస్ అవ్వడానికి..
చాలా కాలంగా ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న క్యాష్ షో గురించి అందరికీ తెలిసిందే. జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అవుతోంది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఈ కార్యక్రమం ఇంతగా సక్సెస్ అవడానికి ప్రధాన కారణం యాంకర్ సుమ కనకాల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

విజయవంతంగా ప్రసారం..
ఎందుకంటే సుమ కనకాల తనదైన కామెడీ పంచ్ లతో హీరో హీరోయిన్లు ఎవరనేదేమి చూడకుండా ఎంటర్టైన్ చేస్తుంది. సుదీర్ఘమైన కెరీర్‌లో సుమ ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు చేసింది. వీటిలో చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో 'క్యాష్' కూడా ఒకటని తెలిసిందే. బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. దీనికి వచ్చిన వారికి సుమ చుక్కలు చూపిస్తూ ఫన్‌ను పంచుతోంది.

చలాకీ మాటలతో మరో లెవెల్ కి..
యాంకర్ సుమ ఒక సినిమా ప్రోగ్రామ్ కు హోస్ట్ గా చేస్తుందటే చాలు ఆ హుషారు, సందడి వేరు. ఆమె యాంకరింగ్ అంటే చాలు.. దర్శకనిర్మాతలు, ఈవెంట్ మేనేజర్లు పూర్తిగా రిలాక్స్ అయి పోగ్రామ్ ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి సినిమా అయినా సరే తన యాంకరింగ్ తో, చలాకీ మాటలతో ప్రోగ్రామ్ ను మరో లెవెల్ కి తీసుకెళ్తారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో సూపర్ ఫేమ్ సంపాదించుకున్న సుమ కనకాలనే హోస్ట్ గా పెట్టుకోవాలని అగ్ర దర్శకులు, నిర్మాతలు, స్టార్ హీరోలు మొగ్గు చూపుతారు.

న్యూ ఇయర్ సందర్భంగా..
ఇక
యాంకరింగ్
మాత్రమే
కాకుండా
సోషల్
మీడియాలో
కూడా
యమ
యాక్టివ్
గా
ఉంటుంది
యాంకర్
సుమ.
ఇటీవలే
యూట్యూబ్
లో
తన
పేరు
మీద
ఛానెల్
కూడా
లాంఛ్
చేసింది.
ఆ
ఛానెల్
లో
అన్ని
రకాల
ఎంటర్టైన్
మెంట్స్
ఇస్తూ
మరింత
ఫన్
చేస్తోంది.
ఇప్పటికే
పలు
షోలతో
బిజీగా
ఉన్న
యాంకర్
సుమ
న్యూ
ఇయర్
సందర్భంగా
మరో
ప్రోగ్రామ్
కి
హోస్ట్
గా
చేసింది.
న్యూ
ఇయర్
కు
స్పెషల్
ఈవెంట్
గా
వేర్
ఈజ్
ది
పార్టీ
పోగ్రామ్
ను
నిర్వహిస్తున్నారు.

సూడనివ్వదు.. మాట్లాడనివ్వదు..
సుమ కనకాల హోస్ట్ చేస్తున్న ఈ వేర్ ఈజ్ ది పార్టీ ప్రోగ్రామ్ లో పలు సీరియల్ నటీనటులు పాల్గొన్నారు. వారితో మాట్లాడుతూ పంచ్ లేసింది సుమ కనకాల. తర్వాత హైపర్ ఆది వచ్చి సుమపై పంచ్ వేశాడు. సు.. అంటే సూడనివ్వదు, మ.. అంటే మాట్లాడనివ్వదు అని ఆది అనడంతో అందరూ నవ్వేశారు. ఇక చివర్లో సుమకు అందరూ పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సత్కరించారు. దాన్ని సుమ చాలా బాగా ఎంజాయ్ చేసింది.

కన్నీళ్లు పెట్టుకుంటూ..
తర్వాత సుమ ఎమోషనల్ గా మాట్లాడింది. "మలయాళిగా పుట్టిన నేను ఇక్కడ సెటిల్ అయ్యానంటే అది కేవలం తెలుగు వాళ్లు ఇచ్చినటువంటి అభిమానం, ప్రేమ. లేకపోతే నేను లేను ఇది మాత్రం రాసిపెట్టుకోండి. కానీ కొంత విరామం అయితే తీసుకోవాలనుకుంటున్నాను" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సుమ. యాంకరింగ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పకుండా కాస్తా బ్రేక్ తో గుడ్ బై చెప్పనున్నట్లు ఆమె తెలిపింది. ఈ పోగ్రామ్ ను పూర్తిగా డిసెంబర్ 31 రాత్రి విడుదల చేయనున్నారు.