For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5లోకి సురేఖావాణి: సోషల్ మీడియాలో పోస్టుతో గందరగోళం!

  |

  సురేఖ వాణి అంటే తెలియని తెలుగు వారు ఉండరు. ఆనే చేసేది సాంప్రదాయబద్ధమైన పాత్రలు అయినా బయట మాత్రం ఆమె భీబత్సమైన ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ మీద ఆసక్తికర చర్చ జరుగుతోంది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

  సోషల్ స్టార్

  సోషల్ స్టార్

  ఎక్కువగా అక్క, వదిన, అమ్మ పాత్రల చేస్తూ సినిమాల్లో కనిపించే సురేఖా వాణి నిజ జీవితంలో మాత్రం కూతురితో పోటీపడుతూ హాట్ హాట్ డ్రెస్ లు వేసుకుని సోషల్ మీడియాలో ఒక రేంజ్ క్రేజ్ సంపాదించింది. గతంలో సీరియల్స్ కి దర్శకత్వం వహించిన సురేష్ తేజతో ప్రేమలో పడిన సురేఖ వాణి ఆయనను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆయన అనుకోకుండా కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించారు. అయితే భర్త మరణంతో చాలా రోజులు బాధలో మునిగిపోయిన ఆమె ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. భర్త ఉన్న సమయంలో సైలెంట్ గా ఉన్న ఆమె ఇప్పుడు మాత్రం కూతురు తో పోటీ పడుతూ హాట్ హాట్ డ్రెస్ లు వేసుకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  బిగ్ బాస్ లోకి

  బిగ్ బాస్ లోకి

  అయితే ఈ విషయం చూసి ఎంతో మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అయినా సరే ఆమె ఏ మాత్రం ఆ విషయాలను పట్టించుకున్న పాపాన పోదు. ఎప్పటికప్పుడు తన పని తాను చేసుకుంటూ, సినిమాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, అప్ డేట్స్ ఇస్తూ ఉండే సురేఖ వాణి నిన్న సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో ఒకటి చర్చనీయాంశంగా మారింది. విషయం ఏమిటంటే గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ 5 కి సంబంధించిన అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. వీరు వెళ్తున్నారంటే కాదు కాదు వారు వెళ్తున్నారు అంటూ ఇప్పటికే చాలా మంది పేర్లు తెరమీదకు వచ్చాయి. ఆ పేర్లలో ప్రముఖంగా సురేఖ వాణి పేరు కూడా వినిపించింది.

  ఎందుకు పెట్టింది? ఎందుకు డిలీట్ చేసింది?

  ఎందుకు పెట్టింది? ఎందుకు డిలీట్ చేసింది?

  ఆమెకు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి మరీ బిగ్ బాస్ నిర్వాహకులు ఇంటికి పంపిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుండగా ఈ విషయం మీద ఎట్టకేలకు ఆమె నోరు విప్పింది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో తాను బిగ్ బాస్ ఫైవ్ లో పాల్గొనడం లేదని వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం అంటూ ఆమె ఒక స్టేటస్ పెట్టింది. అదంతా ఫేక్ న్యూస్ ఆ వార్తల్లో నిజం లేదు అని ఆమె కామెంట్ చేసింది. ఇక్కడ దాకా అంతా బాగానే ఉన్నా ఆమె పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేసింది.. ఈ వ్యవహారంతో ఇప్పుడు ఆమె ఎందుకు పోస్ట్ పెట్టింది ? ఎందుకు డిలీట్ చేసింది ? అనే చర్చ మొదలైంది.. ఆమె నిజంగా బిగ్ బాస్ లో ఎంపిక అయిందా ? ఎంపికైతే ఎంపిక కాలేదు అని ఎందుకు పోస్ట్ పెట్టింది ? ఒకవేళ ఎంపిక కాకుండా ఉంటే ఆ పోస్టు ఎందుకు డిలీట్ చేసింది ? ఇలా రకరకాల ప్రశ్నలు అభిమానులు సంధిస్తున్నారు..

  వెళ్ళేది వీళ్ళే

  వెళ్ళేది వీళ్ళే

  ఇక మరోపక్క దాదాపు ఒక డజను మంది పేర్లు మాత్రం ఎక్కువగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వారు వీరే అంటూ ప్రచారం జరుగుతోంది. అందులో ముఖ్యంగా యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, టీవీ నటి నవ్య స్వామి, యూట్యూబ్ షణ్ముఖ్ జస్వంత్, ఒకప్పటి హీరోయిన్ ఇషా చావ్లా, యూట్యూబ్ యాంకర్ శివ, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్ టాక్ దుర్గారావు ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలన్నీ పక్కనబెడితే ప్రస్తుతానికి బిగ్ బాస్ 5 కి సంబంధించిన లోగో మాత్రమే విడుదల కాగా ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించబోయేది ఎవరూ అనే దాని మీద కూడా సరైన క్లారిటీ లేదు. గత సీజన్ హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఈ సీజన్ కు కూడా హౌస్ గా వ్యవహరిస్తారని ప్రచారమైతే జరుగుతున్నా దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు.

  Megastar Chiranjeevi Birthday Wishes To Kaikala Satyanarayana ​| Filmibeat Telug
  నో క్లారిటీ

  నో క్లారిటీ

  అయితే బిగ్ బాస్ నిర్వాహకులు లోగో విడుదల చేశారు కానీ ఈ షో ఎప్పటి నుంచి మొదలవుతుంది అనే అంశం మీద అధికారిక ప్రకటన అయితే ఇంకా చేయలేదు.. గత ఏడాది కూడా కరోనా కారణంగా చాలా లేట్ గా షో స్టార్ట్ అయింది. ఈ ఏడాది కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొంది అని చెప్పక తప్పదు. అయితే ఒకసారి కరోనా పరిస్థితుల్లో షో పూర్తి చేశారు కాబట్టి ఈసారి మరింత అనుభవంతో షో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే గత సీజన్లో ఎక్కువగా లీకేజీలు ఉండడంతో ఈ సీజన్లో మాత్రం లీకేజీలు ఉండకుండా చూడాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది. మరి చూడాలి ఈ సారి బిగ్ బాస్ లో సురేఖ వాణి ఎంటర్ అవుతుందో లేదో అని.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటో గ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంబంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.  English summary
  Responding to Bigg Boss show rumours Surekha “Not at all going to BB5. Itz a fake news guys. Pls dnt encourage such rumours,” wrote in her Insta story. but within minutes, Surekha deleted this story leaving her followers and fans in a big dilemma.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X