Don't Miss!
- News
ప్యాకేజీ స్టార్ దేశభక్తి ఇది.. రిపబ్లిక్ డే సాక్షిగా మళ్ళీ దొరికిన పవన్ కళ్యాణ్!!
- Finance
world economy: ప్రపంచ దేశాల ఆర్థిక ర్యాంకుల్లో మనమెక్కడ ?
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
మా టీవీలో పని చేసే అన్ననే చెప్పాడు.. నేను రిక్వెస్ట్ చేయడం వల్లే అలా: సోహెల్ సంచలన వ్యాఖ్యలు
సాదాసీదా కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సయ్యద్ సోహెల్ రియాన్. ఆరియానా గ్లోరీతో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన అతడు.. కొద్ది రోజులకు హౌస్‌లో అడుగు పెట్టాడు. అప్పటి నుంచి తన మార్క్ చూపించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. టాస్కుల్లో తీవ్రంగా శ్రమించడం.. స్నేహానికి విలువ ఇవ్వడం.. గొడవలకు దిగుతుండడం వంటి వాటితో తరచూ వార్తల్లో నిలిచేవాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా కూడా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తనకు ఓ విషయంలో మా టీవీలో పని చేసే వ్యక్తి హెల్ప్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు సోహెల్. ఆ వివరాలు మీకోసం!

టాస్కుల్లో కింగ్.. గొడవల్లో ముందు
బిగ్ బాస్ హౌస్‌లో సయ్యద్ సోహెల్ రియాన్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఏ టాస్క్ ఇచ్చిన అందరి కంటే ముందే పూర్తి చేసి సత్తా చాటేవాడు. ఫిజికల్ టాస్కులు మాత్రమే కాదు.. ఎలాంటి గేమ్ అయినా తానే కింగ్ అనిపించుకున్నాడు. అయితే, ‘కథ వేరే ఉంటది' అంటూ తరచూ గొడవలకు దిగడం అతడికి మైనస్‌గా మారినా.. తర్వాత దాన్ని చక్కగా అధిగమించాడు సోహెల్.

టాప్-5లో ప్లేస్.. ఆఫర్‌కు ఓకే చెప్పి
బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లలో ఫ్రెండ్‌షిప్‌కు ఎక్కువగా విలువ ఇచ్చేవాడు సోహెల్. తన స్నేహితుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన అతడు.. ఎమోషనల్‌గా ఫీల్ అయ్యేవాడు. ఇలా అన్ని రకాలుగా ఆకట్టుకుని ప్రజాదరణను పొందాడు. ఈ కారణంగానే టాప్-5లోకి వచ్చాడు. అయితే, ఫినాలేలో బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు ఓకే చెప్పి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఆ స్కాం వీడియోతో విమర్శలపాలు
రీయూనియన్ పార్టీ కోసం మెహబూబ్ హౌస్‌లోకి వెళ్లాడు. అందరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో సోహెల్ దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకో అని సైగలు చేశాడతను. అప్పుడే మూడు వేళ్లు కూడా చూపించాడు. అంటే మూడో స్థానంలో ఉన్నావు.. ఆఫర్‌కు ఒప్పుకో అన్నాడని ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో సోహెల్, మెహబూబ్ మోసం చేశారని వాళ్లపై విమర్శలు వస్తున్నాయి.

సినిమాను ప్రకటించి సత్తా చాటాడు
సినిమా హీరోగా సత్తా చాటాలన్న లక్ష్యంతోనే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు సయ్యద్ సోహెల్ రియాన్. గ్రాండ్ ఫినాలేలో చిరంజీవి ముందు ఇదే విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే ‘జార్జ్‌రెడ్డి' టీమ్‌తో సినిమా చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే. దీంతో అతడి ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

సంచలన వ్యాఖ్యలు చేసిన సోహెల్
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు సయ్యద్ సోహెల్ రియాన్. యూట్యూబ్ ఛానెల్‌తో జరిగిన చిట్ చాట్‌లో యాంకర్ ‘మీరు మొత్తం మీద మూడో నాలుగో సినిమాల్లోనే నటించారు. కొన్ని సీరియళ్లలోనే కనిపించారు. ఇలాంటిది మీకు బిగ్ బాస్ ఆఫర్ ఎలా వచ్చింది' అని ప్రశ్నించాడు. దీనికి ఊహించని సీక్రెట్ లీక్ చేసి షాకిచ్చాడు సోహెల్.

మా టీవీలో పని చేసే అన్నే చెప్పాడు
ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘నాకు మాటీవీలో తెలిసిన అన్న ఒకతను ఉన్నాడు. ఆయనతో బిగ్ బాస్‌లోకి వెళ్తాను అని చెప్పా. దాని కోసం ప్రతిరోజూ ఫోన్, మెసేజ్ చేసి సతాయించాను. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆయన ఫోన్ చేసి ఎంట్రీ ఓకే అయిందని చెప్పాడు. అలా అన్న చేసిన హెల్ప్‌తో నేను బిగ్ బాస్‌లోకి వెళ్లాను' అని సంచలన వ్యాఖ్యలు చేశాడీ యాంగ్రీ యంగ్ మ్యాన్.