Master chef: తమన్నాను బైక్‌పై దింపేసి వెళ్లిన విజయ్ సేతుపతి.. బేబి అంటూ రొమాంటిక్‌గా..
సౌత్ మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కేవలం సినిమాలతోనే కాకుండా విబిన్నంగా వెబ్ సిరీస్ లతో కూడా బిజీ అవుతోంది. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న ఈ బ్యూటీ టెలివిజన్ వైపు కూడా అడుగులు వేస్తోంది. ఇండియా వైడ్ గా వివిధ భాషల్లో మొదలు కానున్న మాస్టర్ చెఫ్ కోసం తమన్నా హోస్ట్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక అందుకు సంబంధించిన ఒక ప్రోమోను విడుదల చేయగా అందులో సేతుపతి, తమన్నా మధ్య రొమాంటిక్ గా కనిపించారు.

తమిళ్ లో విజయ్ సేతుపతి
విజయ్ సేతుపతి హోస్ట్ గా తమిళంలో మాస్టర్ చెఫ్ మొదలు కానుంది. ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. అయితే అందులో సేతుపతి తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటున్నాడు. ఈ నటుడు తను దాటి వచ్చిన ఆకలి బాధలను కూడా షేర్ చేసుకున్నాడు. ఆ ప్రోమో అయితే తమిళ్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

తకన్నా న్యాయం చేస్తుందా?
ఇక తెలుగులో గ్లామరస్ బ్యూటీ తమన్నా హోస్ట్ గా సెలెక్ట్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. తమన్నా తెలుగులో మాస్టర్ చెఫ్ కు న్యాయం చేస్తుందా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమోలో ఆ సందేహాలకు చాలెంజ్ విసిరేలా సీన్స్ క్రియేట్ చేశారు.
Recommended Video

తమన్నా కూడా రొమాంటిక్ గా
తమన్నాను బైక్ పైన దింపేసిన విజయ్ సేతుపతి మీ మీద నమ్మకం ఉందని అంటూ తప్పకుండా బాగా చేస్తారని నమ్మకం వ్యక్తం చేశాడు. ఇక తమన్నా కూడా రొమాంటిక్ గా థ్యాంక్యూ బేబీ అంటూ స్మైల్ ఇచ్చిన విధానం ప్రోమోలో వైరల్ గా మారింది. ఇక తమన్నా ఈ షో కోసం తెలుగుపై మతింత అవగాహన తెచ్చుకున్నట్లు సమాచారం.
చేతిలో ఇంట్రెస్టింగ్ సినిమాలు
తెలుగు మాస్టర్ చెఫ్ జెమిని టీవీలో త్వరలోనే ప్రసారం కానుంది. ఇక ఈ టెలివిజన్ షో కోసం తమన్నా రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంటున్నట్లు సమాచారం. హీరోయిన్ గా ప్రస్తుతం మిల్కి బ్యూటీ చేతిలో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. F3 సినిమాతో పాటు నితిన్ మాస్ట్రో, గోపిచంద్ సీటిమార్ వంటి సినిమాలో విడుదలకు సిద్దమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











