twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండో స్థానానికి కార్తీకదీపం.. ఆ రెండు సీరియల్స్ గట్టి పోటీ.. టాప్ రేటింగ్ ఏ సీరియల్ అంటే?

    |

    తెలుగు టెలివిజన్ రంగంలో డైలీ సీరియల్స్‌‌ మధ్య రసవత్తరమైన పోటీ కొనసాగుతున్నది. గత మూడు, నాలుగేళ్లుగా బుల్లితెరపై టాప్ రేటింగ్‌తో ఏకపక్షంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్‌కు మూడు నాలుగు సీరియల్స్ భారీగా పోటీని ఇస్తున్నాయి. గత నాలుగేళ్లతో తొలిసారి కార్తీకదీపం రెండోస్థానానికి పడిపోయింది. బుల్లితెర సీరియల్స్ మధ్య కొనసాగుతున్న రసవత్తరపోటీ విషయంలోకి వెళితే..

    కార్తీకదీపం 1400 ఎపిసోడ్స్‌కుపైగా

    కార్తీకదీపం 1400 ఎపిసోడ్స్‌కుపైగా


    కార్దీకదీపం సీరియల్ విషయానికి వస్తే.. 1400 పైగా ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకొని 1500 ఎపిసోడ్స్‌కు పరుగులు పెడుతున్నది. గత నాలుగేళ్లుగా ఈ సీరియల్‌కు ఎదురేలేకుండా పోయింది. ఓ దశలో ఈ సీరియల్ 16 పాయింట్లకుపైగా రేటింగ్‌ను సాధించింది. గత కొద్దినెలులగా సీరియల్ రేటింగ్ దారుణంగా క్షీణించింది.ఓ దశలో 9.5 రేటింగ్‌కు పడిపోయింది.

     కార్తీకదీపం సీరియల్‌కు ఎదురుదెబ్బ

    కార్తీకదీపం సీరియల్‌కు ఎదురుదెబ్బ


    తాజాగా కార్తీకదీపం సీరియల్‌లో రెండో జనరేషన్ స్టోరి నడుస్తున్నది. కార్తీక్, దీప, మోనిత కథ ముగిసిపోవడంతో.. డాక్టర్ బాబు, వంటలక్క పిల్లలు హిమ, శౌర్య స్టోరి కొనసాగుతున్నది. అయితే ఈ స్టోరి సాగదీసినట్టు ఉండటం, ఐపీఎల్ టోర్ని లాంటివి ఉండటం కారణంగా కార్తీకదీపంపై భారీ దెబ్బ పడింది. ఆ దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నది. దానికి తోడు గృహలక్ష్మి, గుప్పెడంత మనసు సీరియల్స్‌ కంటెంట్‌ పరంగా బాగుండటంతో కార్తీకదీపం సీరియల్‌కు మంచి పోటీ ఏర్పడింది.

    గృహలక్ష్మి టాప్ రేటింగ్‌తో

    గృహలక్ష్మి టాప్ రేటింగ్‌తో


    ప్రస్తుతం టాప్ డైలీ సీరియల్స్ విషయానికి వస్తే.. కార్తీకదీపం, గృహలక్ష్మీ, గుప్పెడంత మనసు, దేవత, జానకి కలగనలేదు, ఎన్నోన్నో జన్మల బంధం టాప్ స్థానాల్లో కొనసాగుతున్నాయి. తాజాగా అర్బన్ ప్రాంతంలో కార్తీకదీపం సీరియల్‌ రేటింగ్‌ను గృహలక్ష్మి అధిగమించడం విశేషంగా మారింది.

     సీరియల్స్ రేటింగ్ ఇలా..

    సీరియల్స్ రేటింగ్ ఇలా..


    కార్తీకదీపం సీరియల్ విషయానికి వస్తే.. ప్రస్తుత ఏడాది 29వ వారంలో ఈ సీరియల్ ఈ 29వ వారంలో రూరల్‌లో 12.02 రేటింగ్ సొంతం చేసుకోగా, అర్బన్‌లో 11.30 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. ఇక గృహలక్ష్మి విషయానికి వస్తే.. రూరల్‌లో 10.71 రేటింగ్, అర్బన్‌లో 11.48 రేటింగ్ నమోదు చేసుకొన్నది.గుప్పెడంత మనసు రేటింగ్ విషయానికి వస్తే..రూరల్‌లో 10.82, అర్బన్‌లో 10.17 రేటింగ్ నమోదు చేసుకొన్నది. ఇక దేవత సీరియల్ విషయానికి వస్తే..రూరల్‌లో 10.02, అర్బన్‌లో 9.76 రేటింగ్ సాధించింది. అలాగే జానకి కలగనలేదు రూరల్‌లో 7.19 రేటింగ్, అర్బన్‌లో 7.79 రేటింగ్ సాధించింది.

     స్టార్ మా టీవీ టాప్

    స్టార్ మా టీవీ టాప్


    ఇక తెలుగు బుల్లితెరపై స్టార్ మా అధిపత్యం కొనసాగుతూనే ఉంది. స్టార్ మాలో ప్రసారమయ్యే అన్నీ సీరియల్స్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతుండటం రికార్డుగా మారింది. గతంలో సీరియల్స్ విషయంలో ఈటీవీ, జెమిని అగ్రస్థానంలో ఉండేవి. కానీ స్టార్ మా వచ్చిన తర్వాత ఎప్పుడూ అధిపత్యాన్ని కొనసాగిస్తున్నది.

    English summary
    Telugu serials Television Rankings out for 29th week of 2022. Intinti Gruhalakshmi takes over Karthika Deepam serial Rating.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X