Television serials rating 26వ వారంలో పోటాపోటీగా కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మీ.. రేటింగ్ ఏ రేంజ్‌లో అంటే

తెలుగు టెలివిజన్ సీరియల్స్‌కు బుల్లితెర ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నట్టు తాజాగా వెల్లడైన రేటింగ్స్‌లో మరోసారి స్పష్టమైంది. లాక్‌డౌన్, కరోనావైరస్ కాలంలో ప్రేక్షకులు ఎక్కువగా ఇంటి పట్టునే ఉండటం వల్ల తెలుగు సీరియల్స్‌కు మరింత ఆదరణ పెరిగినట్టు కనిపిస్తున్నది. ప్రస్తుత ఏడాది 2021కు సంబంధించి 26వ వారంలో పలు ప్రముఖ ఛానెల్స్‌లో సీరియల్స్ రేటింగ్ ఎలా ఉందంటే...

ప్రముఖ తెలుగు ఛానెల్ జెమినీ విషయానికి వస్తే.. త్రినయని, నంబర్ 1 కోడలు, ప్రేమ ఎంత మధురం, కల్యాణవైభోగం, రాధమ్మ కూతురు సీరియల్స్‌కు మంచి రేటింగ్ వచ్చాయి. త్రినయని సీరియల్స్ అర్బన్‌లో 6.61 రేటింగ్‌ను సొంతం చేసుకొంటే రూరల్‌లో 9.21 రేటింగ్స్‌‌ను సాధించింది. ఆ తర్వాత ప్రేమ ఎంత మధురం సీరియల్ అర్బన్‌లో 6.69, రూరల్‌లో 8.82 రేటింగ్, నంబర్ 1 కోడలు అర్బన్‌లో 6.61, రూరల్‌లో 7.70 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నాయి. ఇక రాధమ్మ కూతురు విషయానికి వస్తే అర్బన్‌లో 6.29, రూరల్‌లో 7.67 రేటింగ్‌ను సాధించింది.

ఇక స్టార్ మా టెలివిజన్ ఛానెల్ విషయానికి వస్తే.. కార్తీకదీపం సీరియల్ రికార్డు స్థాయిలో రేటింగ్‌ను గత కొద్ది నెలలుగా నిలబెట్టుకొంటున్నది. 26వ వారంలో కార్తీక దీపం సీరియల్ అర్బన్‌లో 16.12, రూరల్‌లో 16.04 రేటింగ్‌ను సాధించింది. ఈ ఛానెల్‌లో కార్తీక దీపం సీరియల్‌కు మంచి పోటీ ఇస్తున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్‌ అర్బన్‌లో 12.15, రూరల్‌లో 12.30 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్‌లో అర్బన్‌లో 10.37, రూరల్‌లో 10.82 రేటింగ్‌తో స్టడీగా కొనసాగుతున్నది. అలాగే జానకి కలగనలేదు సీరియల్ అర్బన్‌లో 8.41, రూరల్‌లో 8.36 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. దేవత సీరియల్ అర్బన్‌లో 8.22, రూరల్‌లో 7.92 రేటింగ్‌తో నిలకడగా సాగుతున్నది.

 Telugu TV Serials 26th week TRP Ratings of July 2021: Karthika Deepam on top again

పాపులర్ ఛానెల్ ఈటీవీ తెలుగులో మనసు మమత, యమలీల, నా పేరు మీనాక్షీ, శతమానం భవతి, రావోయి చందమామ, అత్తారింటికి దారేది సీరియల్స్‌లో టాప్ రేటింగును సొంతం చేసుకొన్నాయి. కాకపోతే మిగితా పోటీ ఛానెల్స్‌తో చూస్తే ఈ సిరియల్స్ 5 రేటింగ్‌కు కిందే ఉన్నాయి. తాజా రేటింగ్‌లో మునపటి డాటాను చూస్తే ఇవి స్టడీగా కొనసాగుతున్నదని చెప్పవచ్చు.

ఓవరాల్‌గా అన్ని చానెల్స్‌లో రేటింగ్స్ పోల్చి చూస్తే స్టార్ మా ఛానెల్ మాత్రం అధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నదనే విషయం తాజా రేటింగ్స్‌లో స్పష్టమైంది. కార్తీక దీపం నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండగా, ఇంటింటి గృహలక్ష్మీ రెండో స్థానంలో, గుప్పెడంత మనసు మూడోస్థానంలో, జానకి కలగనలేదు నాలుగో స్థానంలో, దేవత 5వ స్థానంలో కొనసాగుతున్నాయి.

తెలుగులో అగ్రఛానెల్స్‌లో 26వ రేటింగ్స్ చూస్తే మంచి కంటెంట్, నటీనటుల మేలవింపు ఉన్న సీరియల్స్‌కు ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారనే విషయం స్పష్టమైంది. కార్తీక దీపం, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో భావోద్వేగాలు బ్రహ్మండంగా పండుతుండటంతో ఈ సీరియల్స్‌ ప్రేక్షకులు అగ్రతాంబూలాన్ని అందిస్తున్నారు. కార్తీకదీపం సీరియల్‌లో మోనిత ప్రెగ్నెంట్ వ్యవహారం మలుపు తిప్పితే.. గృహలక్ష్మీలో ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X