Telugu TV Serials TRP Ratings: మళ్లీ టాప్ లేపిన కార్తీకదీపం.. ఏ సీరియల్‌ రేటింగ్ ఎంతంటే!

తెలుగు టెలివిజన్ రంగంలో 27వ వారానికి సంబంధించిన టెలివిజన్ రేటింగ్స్ వెల్లడయ్యాయి. ఇప్పటిలానే కార్తీకదీపం సీరియల్ ఈ వారం కూడా టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్నది. ఇక తెలుగులోని మిగితా ఛానెల్స్‌లో ప్రసారమయ్యే ఛానెల్స్ పరిస్థితి ఎలా ఉందంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్

జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్

జీ తెలుగు టెలివిజన్ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే సీరియల్స్ విషయానికి వస్తే.. త్రినయని టాప్‌గా నిలిచింది. ఈ సీరియల్ అర్బన్‌లో 7.78 రూరల్‌లో 9.07 రేటింగ్‌ను సొంతం చేసుకోగా, నంబర్ 1 కోడలు అర్బన్‌లో 7.01 రూరల్‌లో 8.19 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. ఆ తర్వాత ప్రేమ ఎంత మధురం అర్బన్‌లో 6.43 రూరల్‌లో 8.53, రాధమ్మ కూతురు అర్బన్‌లో 6.06 రూరల్‌లో 7.53, నాగభైరవి అర్బన్‌లో 5.17 రూరల్‌లో 6.93 రేటింగ్‌ను నమోదు చేశాయి.

ఈటీవీ సీరియల్స్ పరిస్థితి ఏమిటంటే..

ఈటీవీ సీరియల్స్ పరిస్థితి ఏమిటంటే..


ఈటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ విషయానికి వస్తే.. యమలీల టాప్ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఈ సీరియల్ అర్భన్‌లో 5.44, రూరల్‌లో 5.14 రేటింగ్‌ను సాధించింది. ఆ తర్వాత నా పేరు మీనాక్షి అర్బన్‌లో 5.25, రూరల్‌లో 4.93, మనసు మమత అర్బన్‌లో 4.98 రూరల్‌లో 4.61 రేటింగ్స్‌ను రిజిస్టర్ చేశాయి.

స్టార్ మా సీరియల్స్ హవా

స్టార్ మా సీరియల్స్ హవా


అదే విధంగా స్టార్ మా తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ భారీ రేటింగ్‌ను నమోదు చేశాయి. స్టార్ మాలో కార్తీకదీపం సీరియల్ అర్బన్‌లో 16.26, రూరల్‌లో 15.66 నమోదు చేసింది. గతవారంతో పోలిస్తే స్వల్పంగా ఒడిదుడుకులకు లోనైంది. ఆ తర్వాత ఇంటింటి గృహలక్ష్మి అర్బన్‌లో 12.57, రూరల్‌లో 12.29, గుప్పెడంత మనసు అర్బన్‌లో 10.67, రూరల్‌లో 10.79, దేవత అర్బన్‌లో 9.42 రూరల్‌లో 8.68 రేటింగ్, జానకి కలగనలేదు అర్బన్‌ ఏరియాలో 9.10 రూరల్ ఏరియాలో 8.75 రేటింగ్‌ను సాధించింది.

జెమినీ సీరియల్స్ ర్యాంకింగ్స్

జెమినీ సీరియల్స్ ర్యాంకింగ్స్

జెమినిలో ప్రసారమయ్యే సీరియల్స్‌లో తాళి, అల వైకుంఠపురంలో, మట్టిగాజులు, చదరంగం సీరియల్స్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమయ్యే సీరియల్స్ అన్నీ రేటింగులో వెనుకబడి పోయాయి. ఇతర ఛానెల్స్‌లో కనీసం పోటీ కూడా ఇవ్వలేదనే విషయం రేటింగ్స్ స్పష్టం చేశాయి.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
టాప్ 5 సీరియల్స్ ఇవే..

టాప్ 5 సీరియల్స్ ఇవే..

ఓవరాల్‌గా తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ సీరియల్స్‌ పరిగణనలోకి తీసుకొంటే.. కార్తీకదీపం నెంబర్ స్థానంలో, ఇంటింటి గృహలక్ష్మి 2వ స్థానంలో మూడో స్థానంలో గుప్పెడంత మనసు, 4 స్థానంలో దేవత, 5వ స్థానంలో జానకి కలగనలేదు నిలిచాయి. ఐదు టాప్ సీరియల్స్ అన్నీ కూడా స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కావడం విశేషంగా పేర్కొన్నాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X