For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trinayani 5th August Episode : నయనికి అపాయం, హెచ్చరించిన గాయత్రి.. భయంలో జాస్మిన్!

  |

  జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతి ఎపిసోడ్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విశాల్ నయని మధ్య శోభనం అనేది ఇది హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే నయని అడ్డు తొలగించుకోవడానికి జాస్మిన్, తిలోత్తమ, దురంధర లాంటి వారందరూ ప్రయత్నాలు చేస్తున్నా దైవిక శక్తులన్నీ నయనికి అండగా ఉండడంతో వారి వల్ల కావడం లేదు. అయినా సరే ఆమెను అడ్డు తొలగించుకోవాలని ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఎపిసోడ్ లో ఏం జరిగింది అంటే

  photos courtesy : zee telugu+ zee5 app

   గుర్తు పట్టిన యజ్ఞ

  గుర్తు పట్టిన యజ్ఞ

  గంగాధర్ గంగయ్య గా మారి బయటకు వస్తున్నట్లు యజ్ఞ ఒకసారి చూసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ విషయాన్ని ఆమె గుర్తు తెచ్చుకుని జాస్మిన్ కి ఈ విషయం చేరవేయాలని భావిస్తోంది.. అయితే మరో పక్క పోలీసులకు యజ్ఞ ఫోటో దొరుకుతుంది.. ఆమె స్వయంగా విశాల్ భార్య మీద హత్య ప్రయత్నం చేయించింది అనే విషయం తెలుసుకుని విశాల్ కు సమాచారం ఇస్తారు.. అంతేకాక ఆమె ఫోటో కూడా పంపించి ఆమె ఎవరో తెలుసా అని ప్రశ్నిస్తారు. అయితే విశాల్ కి మాత్రం ఆమెను ఎప్పుడూ చూసిన గుర్తు రావడం లేదు. దీంతో నయని అక్కడికి రావడంతో ఆమె ఎప్పుడైనా చూసిందేమో అనే ఉద్దేశంతో ఆమె కూడా చూపిస్తాడు..

  నయనికే దిష్టి

  నయనికే దిష్టి

  నయని కూడా గతంలో చూసిన గుర్తు లేదు అని చెబుతుంది. అయితే ఇంట్లో వారందరికీ పులుపు, కారం ఎక్కువగా వేసి ఆమె వంట చేస్తుంది.. ఈ విషయం మీద ఇంట్లో రాద్ధాంతం మొదలవుతుంది ఇక ఈ రోజు ఏం జరిగిందంటే, తాను అలక్ష్మీ అమ్మవారి కోసం ప్రసాదం చేసేందుకు ఇలా చేశానని అని చెబుతుంది.. అయితే ఇప్పుడు ఆవిడను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఎవరికి దిష్టి తగిలింది అని ఇంట్లోవాళ్లు అడగగా నయనికే దిష్టి తగిలింది అని గాయత్రి చెల్లెలు చెబుతుంది. అయితే అలా ఎలా అంటారు అంటే ఆమెకు దిష్టి తగిలింది కాబట్టే కళ్ళలో గాజు పెంకులు గుచ్చుకున్నాయి అని అంటారు.

  జగదీష్ షష్టిపూర్తి

  జగదీష్ షష్టిపూర్తి

  అది అరిష్టమని అంటే హాసిని కల్పించుకుని అసలు అరిష్టం జాస్మిన్ అని అందుకే ఆమెను వాయించింది అంట కదా దేవత అని అంటుంది.. అయితే వాయించింది నువ్వే కదా అని పరశురామ్ గుర్తు చేస్తే తనకు వాయించిన సంగతి గుర్తు లేదని ఈ సారి దేవత వస్తే మీ సంగతి కూడా చూస్తా అని అంటుంది. వద్దు వద్దు నాకు ఏమి వద్దు బాబోయ్ అంటాడు పరశురాం. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా జగదీష్ షష్టిపూర్తి వ్యవహారం తెర మీదకు వస్తుంది జగదీష్ షష్టిపూర్తి కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని తిలోత్తమ ఆదేశాలు ఇస్తుంది.

   షష్టిపూర్తికి గాయత్రి

  షష్టిపూర్తికి గాయత్రి

  ఇంతలో నయని ఎంటర్ అయి జగదీష్ బాబు షష్టిపూర్తికి గాయత్రి అమ్మగారు వస్తానన్నారు అని చెప్పి అందరికీ షాక్ ఇస్తుంది. ఆమె రావడం కుదరదని అదంతా ఒట్టిమాటలేనని మీ పనులు మీరు చూసుకోవాలని తిలోత్తమ అంటుంది. అయితే ఈసారి రావడం ఖాయం అని అందరూ చూస్తూనే ఉంటారు కదా అని అంటుంది. గాయత్రి చెల్లెలు కూడా అక్క రావడం ఖాయమని ఈసారి చూస్తూ ఉండమని చెబుతుంది. చనిపోయిన వాళ్ళు రావడం ఏంటి మీ బొంద అన్నట్టు కామెంట్స్ చేస్తూ దురంధర అయితే అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆమెను చూసి జాస్మిన్ కూడా చల్లగా అక్కడినుంచి జారుకుంటుంది.

   భయంతో జాస్మిన్

  భయంతో జాస్మిన్

  అయితే అసలు విషయం ఏమిటంటే జాస్మిన్ గతంలోనే విశాల్ కి సంబంధించిన ఒక వీడియో తీస్తున్నప్పుడు. ఆమెకు గాయత్రీ దేవి కనిపిస్తుంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పిన నమ్మరు. కానీ ఇప్పుడు ఇదే విషయాన్ని నయని చెప్పడంతో ఆమె ఆలోచనలో పడుతుంది.. దురంధర వచ్చి ఇదంతా నమ్ముతున్నావా అంతా ఒట్టి దేనని అంటే నేను నమ్ముతున్నాను అని నేను ముందే చూశానని ఆమె అంటుంది. ఇది ఇలా జరుగుతూ ఉంటే గాయత్రి దేవి మాత్రం నయనికి కనిపిస్తుంది.

   పొంచి ఉన్న అపాయం

  పొంచి ఉన్న అపాయం

  అయితే నేను వస్తాను అని చెప్పకుండానే వస్తాను అని అందరికీ చెప్పినట్లుగా ఎలా చెప్పావు అని ఆమె ప్రశ్నిస్తుంది. అంతేకాక నీ వెనుక చాలా అపాయాలు పొంచి ఉన్నాయని ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరిస్తుంది. అంతేగాక షష్టిపూర్తి కోసం తీసుకున్న ముహూర్తం అస్సలు మంచిది కాదని ఆ రోజు అరిష్టం అపాయం అన్ని ముందుకు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తుంది. అలా మొత్తం మీద గాయత్రీ దేవి హెచ్చరికలతో నయాని ఆలోచనలు పడుతుంది. ఇక తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తి వినిపిస్తోంది.

  Chakra : Telugu Audience Are Always Says Actor Vishal

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Trinayani Episode (375): Nayani tells everyone that Gayatri will come to Jagadish’s ‘Shashti Poorti’, shocking everyone. Jasmine believes that Nayani has a special talent. Gayatri’s spirit visits Nayani and cautions her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X