»   » కట్నం కోసం భర్త, సెక్స్ కోసం మరిది: టీవీ నటుడి అరెస్ట్

కట్నం కోసం భర్త, సెక్స్ కోసం మరిది: టీవీ నటుడి అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మీరట్: హిందీ టీవీ నటుడు శోబిత్ ఆత్రేయ్‌ను హర్యారా పోలీసులు ఆదివారం అరెస్టు చేసారు. శోబిత్ ఆత్రే కట్నం కోసం తనను వేదింపులకు గురి చేస్తున్నాడని అతని భార్య నిషా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని మీరట్లోని అతని నివాసంలో కస్టడీలోకి తీసుకున్నారు. 'నా ఆనా ఈజ్ దేశ్ లాడో' అనే హిందీ సీరియల్స్‌ తో పాటు పలు సీరియళ్లలో శోబిత్ నటించాడు.

భర్త కట్నం కోసం వేధించడంతో పాటు...మరిది తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆత్రేయ్ భార్య ఆరోపిస్తోంది. శోబిత్ ఆత్రేయ్‌ను పోలీసులు హరెస్టు చేయడానికి వచ్చిన సందర్బంగా అతని తండ్రి తన రివాల్వర్‌తో హల్ చల్ చేసాడని, తన కొడుకును అరెస్టు చేయనీయబోనని రివాల్వర్ చూపుతూ బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. అత్రేయ్ అరెస్టు సందర్భంగా అభిమానులు, అతని లాయర్స్ ఇంటి వద్ద గుమిగూడి పోలీసులును అడ్డుకునే ప్రతయ్నం చేసినట్లు సమాచారం.

TV actor Shobhit Attray arrested for dowry harassment

ఆత్రేయ్, నిషాలకు ఒక సంవత్సరం వయసున్న అబ్బాయి ఉన్నాడు. నిషా తన ఫిర్యాదులో భర్త తనను కట్నం తేవాలని వేధిస్తున్నాడని పేర్కొన్నారు. ఆత్రేయ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా వేదిస్తుండటంతో ఆమె తన పుట్టింటికి చేరుకుంది. అనంతరం తన భర్త, మరిదిపై ఫిర్యాదు చేసింది.

పెళ్లయిన పది రోజుల తర్వాత భర్త ముంబై వెళ్లినప్పుడే బ్రదర్ ఇన్ లా నుండి వేధింపులు మొదలయ్యాయని నషా ఆరోపించింది. పుట్టింటి వద్దనే తనకు ప్రసవం అయిందని, అయితే తన బ్రదర్ ఇన్ లాస్ తన కొడుకును వారి కుటుంబ సభ్యుడిగా అంగీకరించడం లేదని నిషా ఆరోపించారు. త్వరలో 'తేరే ఇష్క్ మే' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా బుల్లితెర నుండి వెండితెరకు పరిచయం కాబోతున్న ఆత్రేయ్ ఈ లోపే అరెస్టు కావడం చర్చనీయాంశం అయింది.

English summary
Small screen actor Shobhit Attray was on Sunday taken into police remand after his wife levelled allegations of dowry harassment against him. Attray, who acted in a popular TV serial "Na aana is desh laado" and few more serials, was arrested by the Haryana police from his residence in Meerut distict, Uttar Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu