»   » ప్రొడ్యూసర్ బాయ్‌ఫ్రెండును పెళ్లాడిన టీవీ నటి (ఫోటోలు)

ప్రొడ్యూసర్ బాయ్‌ఫ్రెండును పెళ్లాడిన టీవీ నటి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ హిందీ టెలివిజన్ నటి ఆమ్నా షరిఫ్ తన బాయ్ ఫ్రెండు అమిత్ కపూర్‌‌ను పెళ్లాడింది. డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్‌గా మారిన అమిత్‌, ఆమ్నా షరీఫ్ మధ్య గత కొంత కాలంగా లవ్ ఎఫైర్ నడుస్తోంది. డిసెంబర్ 27న పెళ్లితో ఏకం అయ్యారు. ముంబైలోని స్టార్ హోటల్ తాజ్ లాండ్స్ ఎండ్‌లో టెలివిజన్ ప్రముఖులు, బాలీవుడ్ ప్రముఖులకు గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి అభయ్ డియోల్, రణదీప్ హుడా, కరణ్ వీర్ బోహ్రా, మౌని రాయ్, సంజీదా షేక్ తదితరులు హాజరయ్యారు.

ఆమ్నా షరీఫ్‌, అమిత్ కపూర్ గత రెండు సంవత్సరాలుగా డేటింగులో ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. పెళ్లి తర్వాత దాదాపు నెల రోజుల పాటు హనీమూన్ గడిపేందుక ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఎక్కడికి వెళ్లాలనే విషయమై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.

రిసెప్షన్ పార్టీలో వీరు వేసుకున్న డ్రెస్సులు ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసారు. ఆమ్నా వేసుకున్న బ్లూ అండ్ పింక్ కలర్ డిజైనర్ డ్రెస్సులో ఆమె స్టన్నింగ్ లుక్‌తో మెరిసి పోయింది. అదే విధంగా అమిత్ కపూర్ పర్పుల్ కలర్ షెర్వానీ అతనికి డాషింగ్ లుక్‌ తెచ్చిపెట్టింది.

అభయ్ డియోల్, ప్రితీ దేశాయ్, సంజీదా షేక్, కరణ్ వీర్ బోహ్రా, మౌని రాయ్, ఆమీర్ అలీ, అర్జూ గోవరికర్, రణదీప్ హుడా, నిఖిల్ ద్వివేది, షెఫాలి జరీవాలా, రాగిణి ఖన్నా, రిచా చద్దా తదితర బాలీవుడ్ స్టార్లు, టీవీ స్టార్లు ఈ రిసెప్షన్ పార్టీకి హాజరయ్యారు. అభయ్ డియోల్ తను సహజీవనం చేస్తున్న గర్ల ఫ్రెండ్ ప్రీతి దేశాయ్‌‍తో కలిసి హాజరయ్యారు.

అమిత్ కపూర్ కంటే ముందు ఆమ్నా షరీఫ్...రాజీవ్ ఖండేల్వాల్, ఆఫ్తాబ్ శివ్‌దాసానిలతో డేటింగ్ చేసింది. వారికి దూరమైన తర్వాత అమిత్ కపూర్‌తో డేటింగ్ చేసి అతన్ని పెళ్లాడింది.

ఆమ్నా షరీఫ్, అమిత్ కపూర్

ఆమ్నా షరీఫ్, అమిత్ కపూర్


రిసెప్షన్ పార్టీలో తన భర్త అమిత్ కపూర్‌తో ఆమ్నా షరీఫ్‌

మౌనీ, సంజీదాతో నవదంపతులు

మౌనీ, సంజీదాతో నవదంపతులు


టీవీ నటులు మౌనీ, సంజీదాతో కలిసి నవదంపతులు

భర్తతో షెఫాలీ జరీవాలా

భర్తతో షెఫాలీ జరీవాలా


తన స్నేహితుల వెడ్డింగ్ రిసెప్షన్‌కు భర్తతో కలిసి హాజరైన షెఫాలి జరీవాలా

రణదీప్ హుడా

రణదీప్ హుడా


తన గుడ్ ఫ్రెండ్స్ ఆమ్నా షరీఫ్, అమిత్ కపూర్‌ల వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా.

భార్య తేజ్ సంధుతో కలిసి కరణ్ వీర్ బోహ్రా

భార్య తేజ్ సంధుతో కలిసి కరణ్ వీర్ బోహ్రా


తన భార్య తేజ్ సంధుతో కలిసి హాజరైన కరణ్ వీర్ బోహ్రా

గర్ల్ ఫ్రెండ్ ప్రీతీదేశాయ్‌తో అభయ్ డియోల్

గర్ల్ ఫ్రెండ్ ప్రీతీదేశాయ్‌తో అభయ్ డియోల్


ప్రీతి దేశాయ్‌తో కలిసి గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్న అభయ్ డియోల్ ఆమెతో కలిసి వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరయ్యారు.

మౌనీ రాయ్

మౌనీ రాయ్


బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్‌తో కనిపించిన మౌనీ రాయ్

సెజానె ఖాన్

సెజానె ఖాన్


నవదంపతులకు బహూకరించేందుకు బ్యూటీఫుల్ బొకేతో హాజరైన సెజానె ఖాన్.

తల్లితో కలిసి ఆమిర్

తల్లితో కలిసి ఆమిర్


టీవీ యాక్టర్ ఆమీర్ తన తల్లితో కలిసి హాజరైన దృశ్యం.

సంజీదా, మౌనీ

సంజీదా, మౌనీ


సంజీదా, మౌనీ రాయ్ కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

రీచా చద్దా

రీచా చద్దా


వెడ్డింగ్ రిసెప్షన్‌కు నటి రీచా చద్దా రెడ్ కలర్ డ్రెస్‌లో హాజరైంది.

రాగిణి ఖన్నా

రాగిణి ఖన్నా


వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన టీవీ నటి రాగిణి ఖన్నా.

English summary
Popular Television actress Aamna Shariff married her film distributor-turned-producer boyfriend Amit Kapoor on 27th December. The wedding reception was hosted at Taj Land's End on December 28, which saw Bollywood and Television celebrities like Abhay Deol, Randeep Hooda, Karanveer Bohra, Mouni Roy, Sanjeeda Sheikh and many others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu