»   »  బుల్లి తెర నటికి అసభ్యకరమైన మెసేజ్‌లు: ఫిర్యాదు

బుల్లి తెర నటికి అసభ్యకరమైన మెసేజ్‌లు: ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ టీవీ నటి వేధింపులకు గురవుతున్న విషయం తెలిసింది. గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకరమైన సందేశాలతో తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ ఓ బుల్లి తెర నటి హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారంనాడు ఫిర్యాదు చేసింది.

 TV actress complains about abusive messages

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - శ్రీనగర్ కాలనీలోని గణపతి కాంప్లెక్స్ సమీపంలో నివసించే భారతి (40) కొన్ని టీవీ షోల్లో నటిస్తోంది. గత మూడు నెలలుగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ నుంచి ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు వస్తున్నాయి.

ఆ మెసేజ్‌ల వల్ల తాను తీవ్రమైన మానసిక క్షోభకు గురువుతున్నానని, తనకు మెసేజ్‌లు వస్తున్నాయని ఆమె భారతి ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

English summary
TV actress complained that she is getting abusive messages from an unidentified person's phone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu