యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం..ఇష్టమైన వ్యక్తి మరణించడంతో శోకసంద్రంలో ప్రదీప్

టాలెంటెడ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి మరణించడంతో అతను ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్ కారణంగా చాలా మంది కుటుంబాల్లో మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఇక కరోనా ధాటికి ప్రదీప్ ఇంట్లో కూడా ఒక వ్యక్తి మరణించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

గుండె బద్దలయ్యే న్యూస్

గుండె బద్దలయ్యే న్యూస్

యాంకర్ ప్రదీప్ గురించి ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే. ఎంతో కష్టపడి టాప్ మోస్ట్ యాంకర్ గా గుర్తింపు అందుకున్నాడు. ఫీమేల్ యాంకర్స్ లో సుమ టాప్ లో ఉంటే మేల్ యాంకర్స్ లో ప్రదీప్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అంతా హ్యాపీగా కొనసాగుతున్న తరుణంలో గుండె బద్దలయ్యే న్యూస్ అతన్ని ఒక్కసారిగా విషధంలోకి నెట్టి వేసింది.

చాలా ఇంటర్వ్యూలలో ఎమోషనల్..

చాలా ఇంటర్వ్యూలలో ఎమోషనల్..

యాంకర్ ప్రదీప్ ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అతన్ని తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుకున్నారు. ప్రదీప్ ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా తన విజయానికి కారణం అమ్మ నాన్నల సపోర్ట్ అనే చెబుతుంటారు. ఎంతో ఆప్యాయంగా పెంచారని వాళ్ళను వదిలి ఎక్కువరోజులు కూడా ఉండలేనని చాలాసార్లు ఎమోషనల్ అయ్యాడు.

ప్రాణానికి ప్రాణమైన తండ్రి మరణం

ప్రాణానికి ప్రాణమైన తండ్రి మరణం

అయితే అంతగా ఆరాధించే ప్రదీప్ తన ప్రాణానికి ప్రాణమైన తండ్రిని కోల్పోయాడు. గత రాత్రి నుంచి ఈ న్యూస్ ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతున్నప్పటికి ఎవరు అఫీషియల్ గా వివరణ ఇవ్వలేదు. ప్రదీప్ మిత్రులను సన్నిహితులను కాంటాక్ట్ చేసినప్పటికీ సరైన క్లారిటి రాలేదు.

శోకసంద్రంలో ప్రదీప్

శోకసంద్రంలో ప్రదీప్

ప్రదీప్ తండ్రి పేరు పాండురంగ మాచిరాజు. 65 సంవత్సరాల పాండురంగ గత రాత్రి కోవిడ్ కారణంగా తుది శ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా ఆరోగ్యం బాగోలేదని తెలుస్తోంది. ఇక హాస్పిటల్ కు తొందరగానే తీసుకెళ్లినప్పటికి అప్పటికే కోవిడ్ ఆయన ఊపిరిని దెబ్బ తీసింది. ఈ వార్తతో ఒక్కసారిగా ప్రదీప్ శోకసంద్రంలో మునిగిపోయాడు. పాండురంగ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

 కరోనా ఎలా వచ్చింది?

కరోనా ఎలా వచ్చింది?

యాంకర్ ప్రదీప్ కు ఇటీవల కోవిడ్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రదీప్ ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బయటకు కూడా ఎక్కువగా వెళ్లలేదు. రియాలిటీ షోలను కూడా చాలా వరకు దూరం పెట్టేశారు. ఎప్పుడైనా బయటకు వెళ్లినా కూడా ఇంట్లో వాళ్ళకు దూరంగానే ఉండేవాడు. అంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆయన తండ్రికి కరోనా ఎలా వచ్చిందో అని కుటుంబ సభ్యులు కూడా షాక్ కు గురవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X